Skip to main content

November 29th,30th Holidays : న‌వంబ‌ర్ 29, 30 తేదీల్లో స్కూల్స్, కాలేజీల‌కు సెల‌వులు.. అలాగే డిసెంబర్ 3న కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లోని స్కూల్స్‌, కాలేజీల‌కు వ‌రుస‌గా మ‌రో రెండు రోజుల పాటు సెల‌వులు రానున్నాయి. అలాగే ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ ఆఫీస్‌ల‌కు కూడా ఒక రోజు సెలవు ఇవ్వ‌నున్నారు.
"Government and Private Offices to Have One-Day Holiday,Telangana Schools and Colleges Extended Vacationnovember 2023 month Schools and Colleges Holidays news in Telugu
TS Schools and Colleges Holidays

పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన విద్యాసంస్థలు, కార్యాలయాలకు నవంబరు 29న కూడా సెలవు ఇచ్చింది. అలాగే తెలంగాణ రాష్ట్ర శాసనసభ పోలింగ్ జరగనున్న నవంబరు 30వ తేదీన కూడా అన్ని ప్రభుత్వ‌, ప్రైవేట్ స్కూల్స్‌, కాలేజీల‌కు ప్ర‌భుత్వం సెల‌వును ప్ర‌క‌టించింది.

➤ Dussehra Holidays 2023 Changes : ఆంధ‌ప్ర‌దేశ్‌లో దసరా సెలవుల్లో మార్పులు.. ఆ రెండు రోజులు కూడా..

డిసెంబ‌ర్ 3వ తేదీన కూడా..

ts assembly elections 2023 date news telugu

డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు జరిగే ఆయా కార్యాలయాలకు సెలవు ఉంటుందని సీఎస్ శాంతికుమారి అక్టోబ‌ర్ 16వ తేదీన (సోమవారం) ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ పోలింగ్ జరగనున్న నవంబరు 30వ తేదీన ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ ఉద్యోగుల‌కు వేతనంతో కూడిన సెలవుదినంగా ఉంటుంద‌న్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

➤ గుడ్‌న్యూస్‌.. ఈ సారి దసరా, క్రిస్మస్, సంక్రాంతి సెలవులు ఇవే.. మొత్తం ఎన్ని రోజులంటే..?

ఈ రాష్ట్రాల‌లో కూడా..
అలాగే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జ‌రిగే రోజున స్కూల్స్‌, కాలేజీలు, ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ కార్యాల‌యాల‌కు సెల‌వుల‌ను ప్ర‌క‌టించారు ఆయా రాష్ట్రాల సీఎస్‌లు ప్ర‌కటించారు.

☛ Tenth and Inter Public Exams : ఇక‌పై.. ఏడాదికి రెండు సార్లు టెన్త్‌, ఇంటర్‌ బోర్డు పరీక్షలు.. కొత్త‌ రూల్స్ ఇవే..

తెలంగాణ 2023-24లో సెల‌వుల పూర్తి వివ‌రాలు ఇవే..:

☛ 2023-24 అకడమిక్‌ ఇయర్‌లో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా, ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి
☛ అక్టోబర్ 13 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు

 

Published date : 18 Oct 2023 03:31PM

Photo Stories