Dasara, Christmas and Sankranti Holidays 2023 : గుడ్‌న్యూస్.. ఈ సారి దసరా, క్రిస్మస్, సంక్రాంతి సెలవులు ఇవే.. మొత్తం ఎన్ని రోజులంటే..?
ఇప్పుడు తాజాగా ప్రభుత్వం దసరాతో పాటు క్రిస్మస్, సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం దసరాతో పాగు క్రిస్మస్, సంక్రాంతి సెలవులపై కూడా ప్రకటన విడుదల చేసింది.
సెలవుల వివరాలు ఇవే..
దసరా, బతుకమ్మ వేడుకల సందర్భంగా 13 రోజుల దసరా సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇవ్వడంతోపాటు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మిగితా పండగల సెలవులను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా దసరా తర్వాత వచ్చే దీపావళి పండగకు ఒక్క రోజు మాత్రమే సెలవు ఇచ్చింది.
☛ Holidays : అక్టోబర్ 25వ తేదీ వరకు దసరా సెలవులు.. అలాగే నెల చివరిలో కూడా..
డిసెంబర్ నెలలో వచ్చే క్రిస్మస్ సెలవులను ఐదు రోజులు ఇచ్చింది. డిసెంబర్ 22 నుంచి 26 వరకు ఐదు రోజులపాటు మిషనరీ స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు ఉంటాయని, ఇతర స్కూళ్లకు మాత్రం ఒక్క రోజు సెలవు ఉంటుందని పేర్కొంది. ఈ విద్యా సంవత్సరంలో వచ్చే మరో పెద్ద పండగ సంక్రాంతికి ఆరు రోజుల సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. బోగి, సంక్రాంతి, కనుమ పండగలతో కలిపి 6 రోజులు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణలోని కాలేజీలకు దసరా సెలవులు ఇలా..
తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంటర్ కాలేజీలకు అక్టోబర్ 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఇంటర్ బోర్డ్ సెలవులను ప్రకటించింది. మొత్తం ఆరు రోజులు పాటు ఇంటర్ కాలేజీలకు సెలవులను ఇచ్చారు. ప్రైవేట్, ఎయిడెడ్ ప్రభుత్వ కాలేజీలన్నింటికీ ఈ సెలవులు వర్తిస్తాయని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. అలాగే గతంలో 2022లో ఎనిమిది రోజుల పాటు దసరా సెలవులు ఇచ్చిన విషయం తెల్సిందే.
ఆంధ్రప్రదేశ్‌లో సెలవులు ఇలా..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా పండగకు సెలవులు ప్రకటించింది. స్కూల్స్, కాలేజీలకు పండుగ సెలవులు ఖరారు చేసింది. అక్టోబర్ 14వ తేదీ నుంచి దసరా హాలిడేస్ ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. అక్టోబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 24 వరకు ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. మొత్తం 10 రోజులు పాటు దసరా సెలవులు స్కూల్స్ ఉండనున్నాయి. ఈ దసరా సెలవుల అనంతరం అక్టోబర్ 25వ తేదీన నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు ప్రకటించింది. అలాగే కాలేజీలకు కూడా 6 నుంచి 7 రోజులు పాటు దసరా సెలవులు ఇచ్చే అవకాశం ఉంది.
క్రిస్మస్ సెలవులను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. క్రిస్మస్ సెలవులను 7 రోజుల నుంచి 5 రోజులకు తగ్గించారు. ఇక జనవరి 12వ తేదీ నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఈసారి సెలవులను బాగానే ఉండనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ 2023-24లో సెలవుల పూర్తి వివరాలు ఇవే..:
☛ అక్టోబర్ 14 నుంచి 24 వరకు దసరా సెలవులు
☛ జనవరి 9, 2024 నుంచి 18, 2024 వరకు సంక్రాంతి సెలవులు
☛ డిసెంబర్ 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు క్రిస్టమస్ సెలవులు (మిషనరీ స్కూల్స్‌కు మాత్రమే..)
☛ ఇంకా దీపావళి, ఉగాది, రంజాన్ మొదలైన పండగలకు ఆ రోజును బట్టి సెలవులు ఇవ్వనున్నారు.
తెలంగాణ 2023-24లో సెలవుల పూర్తి వివరాలు ఇవే..:
☛ 2023-24 అకడమిక్ ఇయర్‌లో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా, ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి
☛ అక్టోబర్ 13 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు
Tags
- Dasara holidays 2023
- ap dasara holidays 2023 telugu news
- christmas holidays 2023
- christmas holidays 2023 for schools
- christmas holidays 2023 for colleges
- sankranti holidays 2024
- sankranti holidays 2024 for schools
- sankranti holidays 2024 for colleges
- ap sankranti holidays 2024
- ts sankranti holidays 2024
- Government Holidays
- Government Holidays 2024
- sankranti holidays in ap 2024 for college students
- sankranti holidays in ts 2024 for college students
- Dasara and Christmas and Sankranti Holidays 2023 List
- Dasara and Christmas and Sankranti Holidays 2023
- Festival holidays for students
- festivals in india
- ts students holidays news 2023
- TS Holidays
- AP Holidays