Dussehra Holidays 2023 Changes : ఆంధ‌ప్ర‌దేశ్‌లో దసరా సెలవుల్లో మార్పులు.. ఆ రెండు రోజులు కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అక్టోబ‌ర్ 14వ తేదీ నుంచి అక్టోబ‌ర్ 24వ తేదీ వరకు ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూల్స్ విద్యాశాఖ‌ దసరా సెలవులు ప్రకటించించిన విష‌యం తెల్సిందే.
AP Dussehra Holidays Changes

మొత్తం 11 రోజులు పాటు ద‌స‌రా సెల‌వులు స్కూల్స్ ఉండ‌నున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులలో మార్పు చేసింది. అయితే గతంలో ప్రకటించిన సెల‌వుల్లో ప్ర‌భుత్వం స్వ‌ల్ప మార్పు చేసింది. అక్టోబర్ 23 తో పాటు 24వ తేదీన కూడా సెలవు దినంగా ప్ర‌భుత్వం ప్రకటించింది. దీంతో దసరా సెలవులు అధికారికంగా అక్టోబర్ 23, 24వ తేదీల్లో ప్రకటించినట్లు అయింది.

☛ Income Certificate : ఇక‌పై ఈజీగానే.. ఇన్‌కమ్ సర్టిఫికెట్ తీసుకోండిలా.. ప్రవేశాలు, స్కాలర్‌షిప్‌లు, ప్రభుత్వ ఉద్యోగాల‌కు మాత్రం..

ఈ దసరా సెలవుల అనంతరం అక్టోబ‌ర్ 25వ తేదీన‌ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు ప్రకటించింది. అలాగే ఈ సారి కాలేజీల‌కు కూడా 7 రోజులు పాటు ద‌స‌రా సెల‌వులు ఉండ‌నున్నాయి.

ఈ సారి సాధారణ ఛార్జీలతోనే.. ప్రత్యేక బ‌స్సులు..
ప్రయాణికుల సౌకర్యార్థం ఈ సారి విజయదశమి(దసరా) 5,500 ప్రత్యేక సర్వీసులను  ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ నడుపుతోంది. అక్టోబర్‌ 13వ తేదీ నుంచి 26వ దాకా ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు.. సాధారణ ఛార్జీలతోనే ఈ సర్వీసులను ఏపీఎస్‌ఆర్టీసీ నడిపిస్తోంది.

అక్టోబ‌ర్ 13వ  తేదీ నుంచి 22 దాకా.. దసరా ముందు రోజులలో 2,700 బస్సుల్ని, అలాగే.. పండుగ దినాలైన 23వ తేదీ నుంచి 26 దాకా(పండుగ ముగిశాక కూడా)  2,800 బస్సుల్ని నడిపించనుంది. హైదరాబాద్ నుంచి 2,050 బస్సులు, బెంగుళూరు నుంచి 440 బస్సులు,చెన్నై నుంచి 153 బస్సులు వివిధ పట్టణాలకు నడపబడతాయి. విశాఖపట్నం నుంచి 480 బస్సులు, రాజమండ్రి నుంచి 355 బస్సులు, విజయవాడ నుంచి 885 బస్సులు, అదే విధంగా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి వివిధ ప్రాంతాలకు/ పల్లెలకు/ నగరాలకు 1,137 ప్రత్యేక బస్సుల కేటాయింపుతో రద్దీని తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేసింది.

➤ గుడ్‌న్యూస్‌.. ఈ సారి దసరా, క్రిస్మస్, సంక్రాంతి సెలవులు ఇవే.. మొత్తం ఎన్ని రోజులంటే..?

ఇక జనవరి 9, 2024 నుంచి 18, 2024 వరకు సంక్రాంతి సెలవులు.. డిసెంబ‌ర్ 17వ తేదీ నుంచి 26వ తేదీ వ‌ర‌కు క్రిస్ట‌మ‌స్ సెల‌వులు (మిష‌న‌రీ స్కూల్స్‌కు మాత్ర‌మే ఉంటాయి). ఇంకా దీపావ‌ళి, ఉగాది, రంజాన్ తదితర పండ‌గ‌ల‌కు ఆ రోజును బ‌ట్టి సెల‌వులు ఇవ్వ‌నున్నారు. డిసెంబర్ నెలలో వచ్చే క్రిస్మస్ సెలవులను ఐదు రోజులు ఇచ్చింది.

డిసెంబర్ 22 నుంచి 26 వరకు ఐదు రోజులపాటు మిషనరీ స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు ఉంటాయని, ఇతర స్కూళ్లకు మాత్రం ఒక్క రోజు సెలవు ఉంటుందని పేర్కొంది. ఈ విద్యా సంవత్సరంలో వచ్చే మరో పెద్ద పండగ సంక్రాంతికి ఆరు రోజుల సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. బోగి, సంక్రాంతి, కనుమ పండగలతో కలిపి 6 రోజులు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ 2023-24లో సెల‌వుల పూర్తి వివ‌రాలు ఇవే..:

☛ అక్టోబర్ 14 నుంచి 24 వరకు దసరా సెలవులు
☛ జనవరి 9, 2024 నుంచి 18, 2024 వరకు సంక్రాంతి సెలవులు
☛ డిసెంబ‌ర్ 17వ తేదీ నుంచి 26వ తేదీ వ‌ర‌కు క్రిస్ట‌మ‌స్ సెల‌వులు (మిష‌న‌రీ స్కూల్స్‌కు మాత్ర‌మే..)
☛ ఇంకా దీపావ‌ళి, ఉగాది, రంజాన్ మొద‌లైన పండ‌గ‌ల‌కు ఆ రోజును బ‌ట్టి సెల‌వులు ఇవ్వ‌నున్నారు.

#Tags