Three Days Schools Holiday : వరుసగా నవంబర్ 11, 12, 13 తేదీల్లో స్కూల్స్‌కు సెలవులు.. ఎందుకంటే..?
ఈ దీపావళి సెలవును నవంబర్ 13వ తేదీకి (సోమవారం) మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మాములుగా అయితే దీపావళి పండగ నవంబర్ 12వ తేదీ (ఆదివారం) ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ పండగ సెలవు సోమవారంకు మారింది.
స్కూల్స్, కాలేజీలకు, ఆఫీస్‌లకు..
సాధారణంగా నవంబర్ 11వ తేదీన రెండో శనివారం దాదాపు స్కూల్స్, కాలేజీలకు, ఆఫీస్‌లకు సెలవు ఉంటుంది. అలాగే నవంబర్ 12వ తేదీన ఆదివారం.. ఈ రోజు కూడా సాధారణంగానే స్కూల్స్, కాలేజీలకు సెలవు ఉన్న విషయం తెల్సిందే. అలాగే ఏపీ ప్రభుత్వం నవంబర్ 13వ తేదీన స్కూల్స్, కాలేజీలకు సెలవులకు దీపావళికి సెలవు ఇచ్చారు. దీంతో వరుసగా మూడు రోజులు పాటు స్కూల్స్, కాలేజీలకు, ఆఫీస్‌లకు సెలవులు రానున్నాయి.
తెలంగాణలో కూడా అక్టోబర్ 13వ తేదీ..?
అలాగే తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలకు కూడా నవంబర్ 13వ తేదీకి (సోమవారం) సెలవు ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఒక వేళ తెలంగాణ ప్రభుత్వం కూడా నవంబర్ 13వ తేదీ (సోమవారం) సెలవు ఇస్తే.. ఈ రాష్ట్రంలో కూడా వరుసగా మూడు రోజులు పాటు సెలవులు రానున్నాయి. దీపావళి పండుగకు ఆశ్వయుజ బహుళ చతుర్ధశి, అర్దరాత్రి అమావాస్య ప్రామాణికం. ఈ సారి నవంబర్ 12 ఆదివారం చతుర్ధశి మధ్యాహ్నం 1.53 నిమిషాల వరకు ఉంది.
➤ గుడ్‌న్యూస్.. ఈ సారి దసరా, క్రిస్మస్, సంక్రాంతి సెలవులు ఇవే.. మొత్తం ఎన్ని రోజులంటే..?
ఉద్యోగులతో పాటు స్కూల్ విద్యార్థులు కూడా..
రాత్రి అమావాస్య కాబట్టి అదే రోజు దీపావళి. ఈ సారి దీపావళి పండుగ నవంబర్ 12నే జరుపుకోవాలని పంచాగకర్తలు అంటున్నారు. మొత్తంగా ఒక్కో పండగకు తిథి అనేది ఒక్కో రకంగా ప్రామాణికంగా వస్తూ వస్తోంది. దీంతో నవంబర్ 12వ తేదీనే దీపావళి పండుగని వేద పండితులు స్పష్టత ఇస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం నవంబర్ 13వ తేదీ (సోమవారం)న కూడా సెలవు ఇవ్వడంతో స్కూల్ విద్యార్థులతో పాటు.. ఉద్యోగులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ దీపావళి పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. దీపావళి అంటే.. ఎక్కవగా పిల్లలకు అత్యంత ఇష్టమైన పండుగ. ఎందుకుంటే.. పిల్లలు పెద్దలు.. అందరు సంతోషంగా టపాకాయలు కాలుస్తూ ఈ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ 2023-24లో సెలవుల పూర్తి వివరాలు..
☛ అక్టోబర్ 14 నుంచి 24 వరకు దసరా సెలవులు
☛ జనవరి 9, 2024 నుంచి 18, 2024 వరకు సంక్రాంతి సెలవులు
☛ డిసెంబర్ 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు క్రిస్టమస్ సెలవులు (మిషనరీ స్కూల్స్‌కు మాత్రమే..)
☛ ఇంకా దీపావళి, ఉగాది, రంజాన్ మొదలైన పండగలకు ఆ రోజును బట్టి సెలవులు ఇవ్వనున్నారు.
తెలంగాణ 2023-24లో సెలవుల పూర్తి వివరాలు ..
☛ 2023-24 అకడమిక్ ఇయర్‌లో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా, ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి
☛ అక్టోబర్ 13 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు
Tags
- Three Days Schools Holidays
- Diwali holidays
- Government Announcement on Diwali Holiday
- ap schools diwali holiday 2023
- ts schools diwali holiday 2023
- november 13th diwali holidays 2023
- school holidays
- Dussehra festival
- Students
- Andhra Pradesh Government
- Diwali holiday change
- unexpected break
- academic schedule
- education orders
- indian festivals
- Diwali holidays
- Sakshi Education Latest News