November Schools and Colleges Holidays List 2023 : నవంబర్ నెలలో స్కూల్స్, కాలేజీలకు వచ్చే సెలవులు ఇవే.. దాదాపు 10 రోజులు పాటు..
అలాగే దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకునే దీపావళి పండగ కూడా ఈ నెలలోనే వస్తుంది. చిల్డ్రన్స్ డే, గురునానక్ జయంతి పండగలు కూడా ఈ నెలలోనే ఉన్నాయి.
స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇలా..
నవంబర్ 5వ తేదీ ఆదివారం స్కూల్స్, కాలేజీలకు సెలవులు. అలాగే నవంబర్ 11వ తేదీన రెండో శనివారం.. కొన్ని స్కూల్స్, కాలేజీలకు ఈ రోజున సెలవు ఉంటుంది. అలాగే నవంబర్ 12వ తేదీన ఆదివారంతో పాటా దీపావళి పండగ కూడా ఉంది. దీంతో వరుసగా రెండు రోజులు పాటు స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఉంటాయి.
➤ గుడ్‌న్యూస్.. ఈ సారి దసరా, క్రిస్మస్, సంక్రాంతి సెలవులు ఇవే.. మొత్తం ఎన్ని రోజులంటే..?
ఆ రోజు ఆశ.. నిరాశ..
ఈ పండగ అంటే.. ఎక్కవగా పిల్లలకు చాలా ఇష్టమైన పండగ. ఎందుకుంటే.. పిల్లలు పెద్దలు.. అందరు సంతోషంగా టపాకాయలు కాలుస్తూ ఈ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. అయితే ఈ పండగ రోజు ఆదివారం(నవంబర్ 12వ తేదీ) రోజున వచ్చింది. ఇటు స్కూల్స్, కాలేజీల విద్యార్థులతో పాటు.. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు కుడా నిరాశతో ఉన్నారు.
శనివారం లేదా సోమవారం దీపావళి పండగ వచ్చినట్లు ఉంటే బాగుండు.. అనే ఆలోచనలో ఉన్నారు. అయితే కొన్ని స్కూల్స్, కాలేజీలు సోమవారం అంటే నవంబర్ 13వ తేదీన కూడా సెలవు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఒక వేళ నవంబర్ 13వ తేదీ సోమవారం కూడా స్కూల్స్, కాలేజీలకు సెలవు ఇస్తే.. వరుసగా రెండు రోజులు పాటు సెలవులు రానున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వం ఇంకా స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు. పండగ దగ్గర పడే సమయంలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది.
దీపావళి పండగకు ఆశ్వయుజ బహుళ చతుర్ధశి, అర్దరాత్రి అమావాస్య ప్రామాణికం. ఈ సారి నవంబర్ 12 ఆదివారం చతుర్ధశి మధ్యాహ్నం 1.53 నిమిషాల వరకు ఉంది. రాత్రి అమావాస్య కాబట్టి అదే రోజు దీపావళి. ఈ సారి దీపావళి పండుగ నవంబర్ 12నే జరుపుకోవాలని పంచాగకర్తలు అంటున్నారు. మొత్తంగా ఒక్కో పండగకు తిథి అనేది ఒక్కో రకంగా ప్రామాణికంగా వస్తూ వస్తోంది. దీంతో నవంబర్ 12వ తేదీనే దీపావళి పండుగని వేద పండితులు స్పష్టత ఇస్తున్నారు.
వరుసగా మూడు రోజులు పాటు..
అలాగే నవంబర్ 14వ తేదీన భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం(‘చిల్డ్రన్స్ డే’) ఈ రోజు కూడా చాలా స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఉండనున్నాయి. నవంబర్ 19వ తేదీ ఆదివారం కనుక సాధారణంగా స్కూల్స్, కాలేజీలకు సెలవు ఉంటుంది. నవంబర్ 25వ తేదీన నాలుగో శనివారం కనుక చాలా స్కూల్స్, కాలేజీలకు సెలవు ఉంటుంది. అలాగే నవంబర్ 26వ తేదీ ఆదివారం స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఉన్న విషయం తెల్సిందే. ఇక నవంబర్ 27వ తేదీన గురునానక్ జయంతి అలాగే కార్తీక పౌర్ణమి. కనుక నవంబర్ 27వ తేదీన (సోమవారం) కూడా కొన్ని స్కూల్స్, కాలేజీలకు సెలవు ఉంటుంది. ఒక వేళ నవంబర్ 27వ సోమవారం సెలవు ఇస్తే స్కూల్స్, కాలేజీలకు వరుసగా మూడు రోజులు పాటు సెలవులు రానున్నాయి.
మరో సారి వరుసగా రెండు రోజుల పాటు సెలవులు..
అలాగే తెలంగాణలో అత్యంత ముఖ్యమైన అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇదే నెలలో జరగనున్నాయి. దీంతో మరో సారి వరుసగా రెండు రోజులు పాటు స్కూల్స్, కాలేజీలకు సెలవులు రానున్నాయి. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీస్‌లకు కూడా ఎన్నికల రోజున సెలవు ఇవ్వనున్నారు. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన విద్యాసంస్థలు, కార్యాలయాలకు నవంబరు 29న కూడా సెలవు ఇచ్చింది. అలాగే తెలంగాణ రాష్ట్ర శాసనసభ పోలింగ్ జరగనున్న నవంబరు 30వ తేదీన కూడా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలకు ప్రభుత్వం సెలవును ప్రకటించింది. అలాగే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రోజున స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవులను ప్రకటించారు ఆయా రాష్ట్రాల సీఎస్‌లు ప్రకటించారు.
అంటే ఈ నవంబర్ నెలలో స్కూల్స్, కాలేజీలకు దాదాపు 10-12 రోజులు పాటు స్కూల్స్, కాలేజీలకు సెలవులు రానున్నాయి
డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు జరిగే ఆయా కార్యాలయాలకు సెలవు ఉంటుందని తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ పోలింగ్ జరగనున్న నవంబరు 30వ తేదీన ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవుదినంగా ఉంటుందన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఏడాది స్కూల్స్, కాలేజీల విద్యార్థులకు బంద్‌లు, వర్షాలు, పండగలు మొదలైన వాటి వల్ల సెలవులు ఎక్కువగానే వచ్చాయి. ఈ సెలవులు వల్ల సరైన టైమ్‌కి సిలబస్ పూర్తికావడం లేదు. దీంతో ఉపాధ్యాయులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ 2023-24లో సెలవుల పూర్తి వివరాలు ఇవే..:
☛ అక్టోబర్ 14 నుంచి 24 వరకు దసరా సెలవులు
☛ జనవరి 9, 2024 నుంచి 18, 2024 వరకు సంక్రాంతి సెలవులు
☛ డిసెంబర్ 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు క్రిస్టమస్ సెలవులు (మిషనరీ స్కూల్స్‌కు మాత్రమే..)
☛ ఇంకా దీపావళి, ఉగాది, రంజాన్ మొదలైన పండగలకు ఆ రోజును బట్టి సెలవులు ఇవ్వనున్నారు.
తెలంగాణ 2023-24లో సెలవుల పూర్తి వివరాలు ఇవే..:
☛ 2023-24 అకడమిక్ ఇయర్‌లో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా, ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి
☛ అక్టోబర్ 13 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు
Tags
- november month school and college holiday list 2023
- due to ts assembly elections 2023 schools and colleges holidays
- diwali holidays telugu news 2023
- guru nanak holiday telugu news 2023
- children's day school holiday 2023
- children's day school holiday 2023 telugu news
- sunday holidays in november 2023
- holidays in november 2023 andhra pradesh
- holidays in november 2023 telangana
- schools holidays in noverber 2023
- colleges holidays in novermber 2023