Skip to main content

AP Inter Results Release 2024 Update : ముగిసిన‌ ఇంటర్‌ మూల్యాంకనం.. ఫ‌లితాల విడుద‌ల తేదీ ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఈ సారి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో లోక్‌స‌భ‌, అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. ముందుగానే టెన్త్‌, ఇంట‌ర్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల ప‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు.
Inter Public Exam Evaluation Concluded on April 4th   AP Inter Results 2024   Andhra Pradesh Elections  10th and Inter Public Exam Results Announced

విద్యార్థుల‌కు ఈ ఎన్నిక‌ల వ‌ల్ల ఎలాంటి సమ‌స్య‌లు రాకుండా విద్య‌శాఖ అధికారులు జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ఇందులో భాగంగానే టెన్త్‌, ఇంట‌ర్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల మూల్యాంకనం త్వ‌ర‌గా చేస్తున్నారు. ఏప్రిల్ 4వ తేదీతో ఇంట‌ర్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల మూల్యాంకనం పూర్తి చేశారు. ఈ సారి ఇంట‌ర్ మొద‌టి, రెండో సంవ‌త్స‌రంకు మొత్తం 9,99,698 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

☛ AP Schools Summer Holidays 2024 : స్కూల్స్‌కు వేసవి సెలవులను ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం.. ఈసారి భారీగా హాలిడేస్‌.. మొత్తం ఎన్నిరోజుంటే..?

ఏప్రిల్‌ 12వ తేదీ నాటికి..
జవాబుపత్రాల మూల్యాంకనం కోసం సుమారు 23 వేలమంది అధ్యాపకులను ఇంటర్‌ విద్యామండలి నియమించింది. షెడ్యూల్‌ ప్రకారమే ఇంటర్మీడియట్‌ జవాబుపత్రాల మూల్యాంకనం గురువారంతో ముగిసింది. ఆ తరువాత పునఃపరిశీలన, మార్కుల నమోదు వంటి ప్రక్రియ నిర్వహించనున్నారు. అనంతరం ఏప్రిల్‌ 12వ తేదీ నాటికి ఇంటర్మీడియట్‌ ఫలితాలను వెల్ల­డించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

చ‌ద‌వండి: After‌ Inter MPC‌: ఇంజనీరింగ్‌తోపాటు వినూత్న కోర్సుల్లో చేరే అవకాశం.. అవకాశాలు, ఎంట్రన్స్‌ టెస్టుల వివ‌రాలు ఇలా..

☛ Tenth Class Public Exams Results 2024 : టెన్త్‌ ఫలితాల విడుద‌ల‌పై తాజా స‌మాచారం.. ఏప్రిల్ 8వ తేదీ నాటికి..

ఇంట‌ర్ ఫలితాల ప్రకటన అనంతరమే..
ఈ  మూల్యాంకన ప్రక్రియలో ఎక్కువమంది సిబ్బంది నియామకం, టెక్నాలజీ విని­యో­గం, ప్రతి మూల్యాంకన కేంద్రానికి బోర్డు నుంచి ప్రత్యేక అధికారుల పరిశీలన వంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితాల ప్రకటన అనంతరం ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ ప్రకటిస్తారు. ఏపీలో 2022–23 విద్యాసంవత్సరంలో జరిగిన ఇంట‌ర్‌ వార్షిక పరీక్షల ఫ‌లితాలను ఇంటర్మీడియట్‌ ఏప్రిల్ 26వ తేదీన విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.

చ‌ద‌వండి: After 10+2: ఇంటర్మీడియెట్‌ తర్వాత ఫార్మసీ కోర్సులు.. కెరీర్‌కు ధీమా

చ‌ద‌వండి: Inter Special: ఎంపీసీ.. అకడమిక్‌ సిలబస్‌తోపాటే పోటీ పరీక్షలకూ ప్రిపరేషన్‌!!

Published date : 04 Apr 2024 05:49PM

Photo Stories