Delhi Assembly Polling: ప్రశాంతంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరడం మొదలైంది. మొత్తం 70 నియోజకవర్గాలకు గాను 13,766 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో 699 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.
సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. 60.44% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. నార్త్‌ఈస్టు జిల్లాలో అత్యధికంగా 63.83% పోలింగ్ నమోదైంది. ముస్తఫాబాద్ నియోజకవర్గంలో 66.68% పోలింగ్ నమోదైనట్లు ప్రకటించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 8వ తేదీ విడుదల కానున్నాయి. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 62.59%, 2024 లోక్‌సభ ఎన్నికల్లో 56% పోలింగ్ నమోదైంది.
Delhi Elections: ఢిల్లీ ఎన్నికలు.. రెండో మేనిఫెస్టోను విడుదల చేసిన బీజేపీ
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, కేంద్ర మంత్రులు ఎస్.జైశంకర్, హర్దీప్ సింగ్ పూరి, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వంటి ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Delhi Elections: గర్భిణులకు రూ.21 వేలు, మహిళలకు రూ.2,500, రూ.500కే సిలిండర్