Skip to main content

ITI Counselling : ఐటీఐలో ప్రవేశానికి రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం

Counseling session for ITI college admissions  Admissions announcement for Vijayawada East ITI colleges  ITI Counselling  Government ITI College admissions process Second round of ITI college admissions

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాల కోసం రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టామని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.కనకరావు ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో మిగిలిన సీట్లను ఈ రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తామని పేర్కొన్నారు.

పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు ఈ నెల 24వ తేదీలోగా ఐటీఐ.ఏపీ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతరం 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తు చేసుకున్న కళాశాలకు వారి ఒరిజినల్‌ సర్టిఫికెట్లను తీసుకువెళ్లి ప్రిన్సిపాల్‌తో పరిశీలన చేయించుకో వాలని వివరించారు.

IIIT Basara Admissions 2024 :బాసర ట్రిపుల్‌ఐటీలో 2024–25 విద్యా సంవత్సరంలో తగ్గిన పోటీ

ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో చేరాలనుకునే వారికి ఈ నెల 27, 28 తేదీలు, ప్రైవేటు ఐటీఐ కళాశాలలో చేరాలనుకునే వారికి ఈ నెల 29, 30 తేదీల్లో కౌన్సెలింగ్‌ జరుగుతుందని కనకరావు వివరించారు. ఇతర వివరాలకు 94906 39639, 77804 29468లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.
 

Published date : 03 Jul 2024 03:39PM

Photo Stories