Skip to main content

AP Govt School: విద్యార్థుల‌కు ఇచ్చే ట్యాబ్‌ల నాణ్య‌త ప్ర‌మాణాలు ఇవిగో..!

ప్ర‌భుత్వ బ‌డుల్లో చ‌దువుకుంటున్న విద్యార్థుల‌కు ట్యాబ్‌లు ఇవ్వ‌డాన్ని కొంత‌మంది జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఎక్క‌డ ప్ర‌భుత్వానికి మంచిపేరు వ‌స్తుందోన‌ని భ‌య‌కంపితుల‌వుతున్నారు. ఎలాగైనా ప్ర‌భుత్వాన్ని అప్ర‌తిష్ట‌పాలు చేయాల‌ని శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ట్యాబ్‌ల‌పై విషం చిమ్ముతున్నారు.
AP Govt School Negative Critics of Student Aid,,Reputation Concerns in Education
పేద పిల్లలకు ఇచ్చే ట్యాబ్‌లపై విషం చిమ్ముతారా.. వారి భ‌విష్య‌త్తును అంధ‌కారం చేయాల‌నేనా మీ ఆలోచ‌న‌?

వైఎస్‌ జగన్‌మోహ‌న్ రెడ్డి 2019లో అధికారం చేపట్టాక విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేప­ట్టారు. టీడీపీ హయాంలో కునారిల్లి­న విద్యా రంగాన్ని ప్రభుత్వ ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు కింద పది రకాల వసతు­లను కల్పించారు. జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మ ఒడి వంటి పథకాలను అందిస్తున్నారు.

ఇవీ చ‌ద‌వండి: అతి భారీవర్షాలు.. నేడు స్కూల్స్‌కు సెల‌వులు.. అలాగే రేపు, ఎల్లుండి కూడా

8వ తరగతి విద్యార్థులు ఈ ట్యాబ్‌ల ద్వారా నిర్వహించే అభ్యసనాన్ని పర్యవేక్షించేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడం విశేషం. ట్యాబ్‌కు ఒకసారి చార్జింగ్‌ పెడితే 10 గంటలపాటు బ్యాటరీ బ్యాకప్‌ ఉంటుంది. ఇంటర్‌నెట్‌తో సంబంధం లేకుండా ఆఫ్‌లైన్‌లో వీడియో పాఠ్యాంశాలను అభ్యసించేలా ప్రీలోడెడ్‌ కంటెంట్‌తో ఈ ట్యాబ్‌లను అందిస్తారు. 3 ఏళ్ల పాటు వీటికి వారెంటీ ఉంటుంది.

Students tabs

విద్యార్థులకే స్వేచ్ఛ..
వాస్తవానికి ట్యాబ్‌ల విషయంలో విద్యార్థులకే ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. వారు కోరుకుంటే 9 అంగుళాల తెర ఉన్న ట్యాబ్‌లు ఇవ్వాలని విక్రే­తలకు సూచించింది. గతేడాది ఎనిమిదో తరగతి విద్యార్థులకు 8.7 అంగుళాల ట్యాబ్‌లను ప్రభుత్వం పంపిణీ చేసింది. వాటిని విద్యార్థులు బాగున్నాయి అని చెప్పడంతో ఈ సంవత్సరం కూడా అలాంటి ట్యాబ్‌లనే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

చ‌ద‌వండి: ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తో ఎయిర్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి.!

పదో తరగతి వరకు విద్యార్థులు ఈ ట్యాబ్‌ల ద్వారా పాఠాలు అందుకుంటారు. మధ్యలో ట్యాబ్‌ల్లో ఏదైనా సమస్య వచ్చినా సరఫరా చేసిన సంస్థ తిరిగి సరిచేసి ఇస్తుంది. పిల్లలను పక్కదారి పట్టించే ప్రమాదకర వెబ్‌సైట్‌లు ఓపెన్‌ కాకుండా ప్రత్యేకమైన లాకింగ్‌ వ్యవస్థను కూడా ట్యాబ్‌ల్లో ఏర్పాటు చేశారు. ఆఫ్‌లైన్‌లో మాత్రమే బైజూస్‌ యాప్‌ ఓపెన్‌ అయ్యే విధంగా ఏర్పాటు చేశారు. గూగుల్‌ వంటివి ఓపెన్‌ అయినా వాటిలో కేవలం విద్యార్థులు అదనపు సబ్జెక్టు అంశాలను నేర్చుకోవడానికే అవకాశం ఉంటుంది.

Students tabs

ఇక ఇందులో అక్రమాలు అనే మాటకు తావే లేదు. కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ నిబంధనలను అనుసరించి 8 అంగుళాలు, అంతకంటే ఎక్కువ సైజు తెర ఉండాలని ఓ ప‌త్రిక‌ తన కథనంలోనే చెప్పుకొచ్చింది. ఆ నిబంధన ప్రకారం చూసినా అంతకంటే పెద్ద సైజు 8.7 అంగుళాల తెర ఉన్న ట్యాబ్‌లనే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించింది. మరి దీన్ని తప్పుపడుతూ విషం చిమ్మడం ఎంతవరకు సమంజసం?

ఇవీ చ‌ద‌వండి: బీటెక్ అర్హ‌త‌తో ప‌వ‌ర్ గ్రిడ్‌లో ఉద్యోగాలు.. ఎంపికైతే ల‌క్ష‌కు పైగా జీతం..!

సాంకేతిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం
విద్యార్థులకు అందించిన ట్యాబ్‌ల్లో ఏ చిన్న సాంకేతిక సమస్య తలెత్తినా ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులు వెంటనే సరిచేసి ఇస్తున్నారు. సాధారణంగా తలెత్తే చిన్న సమస్యలపై స్థానిక ఉపాధ్యాయులకు నిపుణులతో పలుమార్లు శిక్షణ కూడా ఇచ్చారు. వారి స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే వార్డు సచివాలయంలోని డిజిటల్‌ అసిస్టెంట్‌ వాటిని సరిచేసి ఇస్తారు.

Students tabs

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదులకు అవకాశం..
విద్యార్థులకు అందించే ఒక్కో ట్యాబ్‌ 8.7 అంగుళాల టచ్‌ స్క్రీన్, కనీసం 3 జీబీ ర్యామ్, 32 జీబీ రోమ్‌ కలిగి ఉండాలని ప్రభుత్వం టెండర్‌ డాక్యుమెంట్‌లో స్పష్టం చేసింది. సరఫరా చేసిన 30 రోజుల్లోగా ట్యాబ్‌లో లోపాలుంటే దాని స్థానంలో కొత్త ట్యాబ్‌ను ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ట్యాబ్‌లో రిపేరు వస్తే ఏడు రోజుల్లోగా సరిచేసి ఇవ్వాలనే నిబంధన విధించింది. ట్యాబ్‌ల్లో లోపాలుంటే గ్రామ, వార్డు సచివాల­యాల ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.

చ‌ద‌వండి: డిగ్రీ అర్హ‌త‌తో నాబార్డులో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు... జీతం రూ.90 వేలు..!

ఈ ఫిర్యాదుల ఆధారంగా ఏడు రోజుల్లోగా లోపాలను సరిచేసి ట్యాబ్‌లను అందించాలని టెండర్‌ డాక్యుమెంట్‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ట్యాబ్‌లన్నీ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల మేరకు ఉండాలని.. ఇందులో ఎక్కడా రాజీపడేది లేదని పేర్కొంది. నిర్ధారించిన ప్రమాణాల మేరకు సరఫరా చేయకపోతే బ్లాక్‌లిస్ట్‌లో కూడా ఉంచనున్నట్లు తెలిపింది.

Published date : 05 Sep 2023 04:14PM

Photo Stories