Skip to main content

Tabs for Students: సాంకేతిక‌త‌ను పెంచేందుకు విద్యార్థుల‌కు ట్యాబ్ ల పంపిణీ

గ‌తేడాదిలాగే, ఈ ఏడాది కూడా ప్ర‌భుత్వం విద్యార్థులతోపాటు ఉపాధ్యాయుల‌కు కూడా ట్యాబ్ ల‌ను అందించేందుకు చర్య‌ల‌ను చేప‌డుతున్నార‌ని తెలిపింది. ఈ మెర‌కు ట్యాబ్ ల వినియోగం గురించి ప్ర‌భుత్వం వివ‌రించింది. వాటిలో విద్య‌కు సంబంధించ‌న వివరాల‌ను మిన‌హాయించి ఇత‌ర వివ‌రాల‌ను తొల‌గించాల‌ని తెలిపింది..
Government tablet distribution for education,Digital tools for education, Students showing their tabs provided by government, Tablets in the classroom
Students showing their tabs provided by government

సాక్షి ఎడ్యుకేష‌న్: ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక ఆయాలను నియమించింది. 8లో సర్కారు బడుల్లో విద్యను సాంకేతికీకరణ బాట పట్టించడానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. బడుల్లో సాంకేతికీకరణపై గతంలో ఏ ప్రభుత్వమూ దృష్టి సారించిన దాఖలాలు లేవు. ఈ తరుణంలో సర్కారు పాఠశాలల విద్యార్థులు కింది స్థాయి నుంచే సాంకేతికతపై పట్టు సాధించేలా ముందుచూపుతో ట్యాబ్‌లను అందిస్తూ విద్యార్థుల దీర్ఘకాల ప్రయోజనాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇప్పటికే గత ఏడాది ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఎంతో విలువైన బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను ఉచితంగా అందించిన జగన్‌ సర్కారు ఈ ఏడాది కూడా ట్యాబ్‌లను అందించి వారి అభ్యసన సామర్థ్యాలను మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకుంటోంది.

Telangana Central Tribal University: తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ!

రెండో ఏడాది కూడా పంపిణీకి కసరత్తు


నవశకానికి నాంది

ప్రభుత్వ విద్యారంగంలో నవశకానికి నాంది పడింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి గొప్ప భవిష్యత్‌ దార్శనికుడు. విద్యార్థుల భవిష్యత్‌ అవసరాలను గుర్తించి ఆమేరకు విద్యను కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. ప్రభుత్వ విద్యలో సాంకేతికీకరణ ప్రవేశపెట్టాలనే ఆలోచనే ఎంతో గొప్ప విషయం. ప్రభుత్వ విద్యారంగంలో మొదలైన సాంకేతిక విప్లవం భవిష్యత్‌లో అత్యుత్తమ ఫలితాలను అందించనుంది.


– గెడ్డం సుధీర్‌, వైఎస్‌ఆర్‌ టీచర్స్‌
   
  ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

అభ్యసన మెరుగుకు దోహదం

ప్రపంచ స్థాయిలో అభ్యసనకు విద్యార్థులకు ట్యాబ్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇకపై ట్యాబ్‌లలోనే పరీక్షలు రాసేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలి. ఇంట్లో ట్యాబ్‌లను వినియోగించేటప్పుడు విద్యార్థులను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. ట్యాబ్‌లో సాంకేతిక సమస్య తలెత్తితే సమీప సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌ ద్వారా పరిష్కరించేలా హెచ్‌ఎంలు చర్యలు తీసుకోవాలని ఆదేశించాం.

  జిల్లా విద్యాశాఖాధికారి, ఏలూరు

దశాబ్దం క్రితమే కార్పొరేట్‌ విద్యారంగం టెక్నో, ఈ–టెక్నో, స్మార్ట్‌ వంటి పదాలతో తమ సంస్థల్లో విద్యార్థులకు సాంకేతిక విద్య అందిస్తున్నట్లు ప్రచారం చేసుకుని ఆ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులను విశేషంగా ఆకర్షించాయి. అయినప్పటికీ అప్పటి ప్రభుత్వాలు సాంకేతికతకు ప్రభుత్వ బడుల్లో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు సాంకేతికంగా బాగా వెనుకబడటం అందరికీ తెలిసిందే. ఇటువంటి తరుణంలో భవిష్యత్‌ అంతా సాంకేతికతదే అని గ్రహించిన ప్రభుత్వం.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను కింది స్థాయి నుంచే సాంకేతికతకు అలవాటుపడేలా సాంకేతిక పరికరాలను అందిస్తూ ప్రోత్సహిస్తోంది. తద్వారా విద్యార్థి పరిణితి చెంది భవిష్యత్‌లో తన ఉనికిని ఘనంగా చాటేలా బీజాలు వేస్తోంది.

Sports Academy: నూత‌నంగా స్పోర్ట్స్ అకాడ‌మీ

ఇప్పటికే డిజిటల్‌ బోధన

ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే డిజిటల్‌ తరగతులను ప్రభుత్వం నిర్వహిస్తోంది. విద్యలో సాంకేతికీకరణను ప్రవేశపెట్టడంలో భాగంగా స్మార్ట్‌ టీవీ ద్వారా బోధన, ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌ ద్వారా బోధన, డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లు, వర్చువల్‌ క్లాస్‌ రూమ్‌లు, పెర్‌ఫెక్టివ్‌ అడాప్టివ్‌ లెర్నింగ్‌ ట్యాబ్‌లు ఇలా ఒక్కొక్కటిగా సాంకేతికతను చొప్పిస్తూ విద్యలో విప్లవాత్మక మార్పులతో శిఖరాలకు తీసుకువెళుతోంది. ఈ విధానంలో విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభ్యసనా సామర్థ్యాలు మెరుగుపడటమే కాక భవిష్యత్‌లో దేశ, విదేశాల్లో బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు పొందేందుకు దోహదపడనుంది.

Counselling: ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐలలో నాల్గో విడత కౌన్సెలింగ్‌.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

ట్యాబ్‌ల వినియోగంపై పర్యవేక్షణ

విద్యార్థులకు అందించిన ట్యాబ్‌ల వినియోగంపై పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఒక బృందాన్ని నియమించింది. మండలానికి ఇద్దరు చొప్పున ఉపాధ్యాయులకు ట్యాబ్‌ సాఫ్ట్‌వేర్‌ సమస్యలపై జిల్లా నోడల్‌ పర్సన్‌తో శిక్షణ ఇప్పించింది. వీరంతా సంబంధిత మండలాల పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌లను పరిశీలిస్తారు. విద్యార్థి అభ్యసనకు సంబంధించి అవసరమైన వైఫై మేనేజర్‌, బైజూస్‌ కంటెంట్‌, డిక్షనరీ మాత్రమే ఈ ట్యాబ్‌లో అందుబాటులో ఉండేలా ఆయా సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్‌ చేస్తారు. విద్యకు సంబంధించిన యాప్‌లు మినహా ఇతర ఎటువంటి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసినా, ఇన్‌స్టాల్‌ చేసినా సంబంధిత ఉపాధ్యాయునికి ఓటీపీ వచ్చేలా ట్యాబ్‌ల రూపకల్పన జరిగింది. అలాగే పాఠశాలలకు సమీపంలో ఉన్న సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌లకు ట్యాబ్‌ల వినియోగంపై పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన ట్యాబ్‌లలో తలెత్తే భౌతిక, సాంకేతిక సమస్యలను డిజిటల్‌ అసిస్టెంట్లు పరిష్కరించేలా వారికి తగిన తర్ఫీదు ఇచ్చారు.

Meta Layoffs: ఐటీలో మ‌ళ్ళీ ఉద్యోగుల తొల‌గింపు

ట్యాబ్‌లతో చదువుపై ఆసక్తి

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయిని మించి సాంకేతికతను వినియోగిస్తున్న ప్రభుత్వం గత ఏడాది 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేసింది. ఈ ట్యాబ్‌ల ద్వారా విఖ్యాతి చెందిన బైజూస్‌ కంటెంట్‌ను విద్యార్థులకు చేరువ చేసి డిజిటల్‌ బోధనలో మరో అడుగు ముందుకు వేసింది. ఈ ట్యాబ్‌ల ద్వారా బోధన విద్యార్థుల్లో విద్యపై ఆసక్తిని పెంచుతోంది. చిన్న వయసు నుంచే ట్యాబ్‌లను వినియోగించి చదువుకోవడం వారిలో నూతన ఉత్సాహం నింపుతోంది.

Jobs Through CPET: యువ‌త‌కు సీపెట్ ద్వారా ఉద్యోగాలు

గత ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేయడం ప్రారంభించిన ప్రభుత్వం వరుసగా రెండవ ఏడాది కూడా పంపిణీకి కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థుల సంఖ్యను విద్యాశాఖ అధికారులు తేల్చేపనిలో పడ్డారు. ఛైల్డ్‌ ఇన్ఫోలో ఇప్పటివరకు నమోదైన వివరాల ప్రకారం 398 ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 17,405 మంది విద్యార్థులను గుర్తించారు. వీరందరికి కూడా ఈ ఏడాది ట్యాబ్‌లను పంపిణీ చేయనున్నారు. కాగా గతేడాది 8వ తరగతి చదువుతున్న 18,370 మంది విద్యార్థులకు, 2,613 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. దీనికి సంబంధించి 20,825 ఎస్‌డీ కార్డులను కూడా అందజేశారు.
 

Published date : 05 Oct 2023 10:43AM

Photo Stories