Skip to main content

Sports Academy: నూత‌నంగా స్పోర్ట్స్ అకాడ‌మీ

స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నూత‌నంగా ఏర్పాటు కానున్న అకాడ‌మీలో ప్ర‌వేశాల‌కు ఎంపిక‌లు సాగాయని ప్ర‌క‌టించారు. ఈ ఎంపిక‌ల‌ను స్టెప్ సీఈఓ ప్రారంభించారు. ప్ర‌వేశాల ఎంపికల్లో ఆమె మాట్లాడుతూ..
Selections of players with tests
Selections of players with tests

సాక్షి ఎడ్యుకేష‌న్: పులివెందుల వైఎస్‌ఆర్‌ ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో నూతనంగా ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్‌ అకాడమీలో ప్రవేశాలకు నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. కడప నగరంలోని డీఎస్‌ఏ క్రీడా మైదానంలో నిర్వహించిన ఎంపికలను స్టెప్‌ సీఈఓ సి.సాయిగ్రేస్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పులివెందులలో హాకీ, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, టెన్నిస్‌ క్రీడాంశాల్లో స్పోర్ట్స్‌ అకాడమీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Digital Education: సర్కారు బడుల్లో డిజిటల్‌ విద్య

ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి పులివెందులలో ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి ఎంపికలు నిర్వహించి అకాడమీలో ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. డీఎస్‌ఏ చీఫ్‌ కోచ్‌ ఎన్‌.వి.పి.అమృత్‌రాజ్‌ మాట్లాడుతూ బాలుర స్పోర్ట్స్‌ అకాడమీలో ప్రవేశాలకు విచ్చేసిన క్రీడాకారులకు మోటార్‌ ఎబిలిటీ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌లు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కోచ్‌లు అనిల్‌, అబ్దుల్‌ మునాఫ్‌, శ్రీనివాస్ రాజు, కల్యాణ్‌కుమార్‌, శ్రీధర్‌, రాజేంద్ర, శ్యామ్యూల్‌, ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి అరుణ కుమారి, ప్రవీణ్ కిరణ్‌, స్టెప్‌ సిబ్బంది నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Published date : 04 Oct 2023 03:13PM

Photo Stories