HSC Exams State Topper: 12వ తరగతి ఫలితాల్లో 582/582 మార్కులు సాధించి స్టేట్ టాపర్‌గా తనీషా రికార్డ్
మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ (MSBSHSE) 12వ తరగతి ఫలితాల్లో తనీషా సాగర్ అనే విద్యార్థిని స్టేట్ టాపర్‌గా నిలిచింది. సంభాజీనగర్‌కు చెందిన తనీషా మొత్తం 582 మార్కులకు గాను 582 మార్కులు సాధించి రికార్డు సృష్టించింది. తనీషా చదువులో మాత్రమే కాదు, క్రీడల్లోనూ చురుకే.
Nikesh Arora: ఈ భారత సంతతి సీఈవో వేతనం రూ.1,260 కోట్లు!.. ఎవరీ నికేశ్ అరోరా
గతంలో అండర్-8 చెస్ టోర్నమెంట్స్‌లో రాష్ట్ర స్థాయిలో పాల్గొంది. అంతేకాదు, స్వతహాగా క్రీడాకారిణి కావడంతో బోర్డ్ ఫలితాల్లో అదనంగా 18 మార్కులు సాధించి మొత్తం 100% స్కోరును సొంతం చేసుకుంది. ఈ విజయంపై ఆమె మాట్లాడుతూ.. ''నిజానికి నేను పెద్దగా ప్రిపరేషన్ కోసం సమయం కేటాయించలేదు.
కేవలం నెలన్నర రోజుల నుంచే ప్రిపేర్ అవుతున్నా. అంతకుముందు వరకు చెస్ టోర్నమెంట్‌లతో బిజీగా ఉండేదాన్ని. దీంతో చదువుపై ఎక్కువగా ఫోకస్ చేయలేకపోయాను. ఇంత తక్కువ సమయంలో సిలబస్ ఎలా పూర్తి చేస్తానా అని కాస్త టెన్షన్ పడ్డాను. కానీ మా టీచర్స్ సపోర్ట్‌తో ప్రణాళిక వేసుకొని సిలబస్ పూర్తి చేశాను'' అని పేర్కొంది.
Kyrgyzstan Violence: కిర్గిస్తాన్‌లో భయంభయంగా తెలుగు విద్యార్థులు .. హౌస్ అరెస్టులోనే చాలామంది
అమ్మలా అవ్వాలనుంది..
తనీషా భవిష్యత్తులో తన తల్లితాగే చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం సిఎ ఫౌండేషన్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్లు తెలిపింది. తన తల్లితండ్రులు, టీచర్స్ సపోర్ట్‌తోనే అటు క్రీడలు, ఇటు చదువులో రాణిస్తున్నానని, తనకు అబ్దుల్ కలాం పుస్తకాలు చదవడం బాగా ఇష్టం అని తెలిపింది.