Inspiring Story: సాఫ్ట్ బాల్‌లో ప్రతిభ.. చిన్న వయసులోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం,నాసా సందర్శన
సాఫ్ట్ బాల్ క్రీడ ఆమె జీవితాన్నే మార్చేసింది. నాల్గో తరగతి నుంచే సాఫ్ట్ బాల్ పట్ల మక్కువ పెంచుకున్న ఆమె అంతటితో ఆగిపోలేదు.. నిరంతర సాధనతో ఆ క్రీడపై పట్టు సాధించారు. అంతేకాదు పదో తరగతిలోపే నాలుగు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. దీంతోపాటు బాల క్రీడాకారుల కోటాలో అంతర్జాతీయ విజ్ఞాన పర్యటనలకు ఎంపికయ్యారు.
2017లో అంతర్జాతీయ విమానం ఎక్కే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. 20 రోజులు అమెరికాలో పర్యటించే భాగ్యాన్ని దక్కించుకున్నారు. ఇందులో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధన కేంద్రం (నాసా)ను సందర్శించారు సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన ప్రవల్లిక.
15 జాతీయ, రెండు అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఆమె కనబరిచిన ప్రతిభ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని చేజిక్కించుకున్నారు. సాఫ్ట్‌బాల్ వరల్డ్ కప్‌లో గోల్డ్ మెడల్ సాధించడం, సివిల్ సరీ్వసెస్‌లో చేరడం వంటి లక్ష్యాలతో కసరత్తు చేస్తున్న ప్రవల్లిక ‘సాక్షి’తో పంచుకున్న పలు విశేషాలు...
సికింద్రాబాద్ వారాసిగూడలోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన నవీన్‌గౌడ్, కవిత దంపతుల కుమార్తె ప్రవల్లిక. నాల్గో తరగతి చదువుతున్న సమయంలోనే క్రీడల పట్ల ప్రవల్లిక ఆసక్తి చూపేది. కుమార్తె ఆసక్తికి తగ్గట్టుగా ప్రోత్సహించిన తల్లిదండ్రులు బాల్యం నుంచే సాఫ్ట్ బాల్ క్రీడలో శిక్షణ ఇప్పించారు. శిక్షణలో చేరింది మొదలు అకుంటిత దీక్షతో సాధన చేసిన ఆమె క్రమేణ ఉన్నత శిఖరాలు అధిరోహించారు. తను చదువుతున్న సికింద్రాబాద్ సెయింటాన్స్ స్కూల్ సాఫ్ట్‌బాల్ క్రీడాకారిణిగా అండర్ –17 విభాగంలో రాష్త్ర స్థాయి క్రీడాకారిణిగా ఎదిగారు.
NEET UG 2024 Hearing Highlights: నీట్ పరీక్ష రద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
తెలంగాణ జట్టు తరపున మధ్యప్రదేశ్, మహారాష్త్ర తదితర రాష్ట్రాల్లో జరిగిన సాఫ్ట్ బాల్ జాతీయ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఇప్పటి వరకూ వరుసగా 15 జాతీయ స్థాయి పోటీల్లో దక్షిణ భారత దేశం తరపున పాల్గొని పలు పతకాలు గెలుచుకున్నారు. ఇండోనేషియా, సౌత్ కొరియా దేశాల్లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో భారత్ నుంచి పాల్గొని వెండి పతకాన్ని సాధించారు.
లవ్లీ యూనివర్శిటీ తోడ్పాటు..
నగరంలో ఇంటరీ్మడియట్ పూర్తిచేసి దక్షిణాది రాష్ట్రాల నుంచి సాఫ్ట్‌బాల్‌లో రాణిస్తున్న తనను పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ చేరదీసింది. స్పోర్ట్స్ కోటాలో తనకు అన్ని వసతులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే అవకాశాన్ని కల్పించిందని ప్రవల్లిక తెలిపారు. అంతేకాదు తను అక్కడకు వెళ్లిన తర్వాత యూనివర్శిటీ తరపున ఇండోనేíÙయా, దక్షిణ కొరియాలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశాన్నీ కలి్పంచారు. ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో పాల్గొనేందుకు శిక్షణతోపాటు సివిల్స్ పోటీ పరీక్షలకు కోచింగ్ కూడా లవ్లీ యూనివర్శిటీ యాజమాన్యమే ఇప్సిస్తుండడం గమనార్హం.
14 ఏళ్లకే నాసా సందర్శన..
అతి తక్కువ మందికి లభించే అరుదైన నాసా సందర్శన అవకాశం ప్రవల్లికకు 14 ఏళ్ల ప్రాయంలోనే అందివచి్చంది. దేశంలోని వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచే బాలలకు విజ్ఞాన పర్యటనలు ఉంటాయి. ఏ రంగానికి చెందిన బాలలైనా విజ్ఞాన పర్యటనల జాబితాలో చేరడం కోసం రాత పరీక్ష రాయాల్సిందే. ఆ పరీక్షను నెగ్గిన ప్రవల్లిక యూఎస్‌ఏ ఫ్లోరిడాలోని నాసాను సందర్శించారు. 2017లో అంతర్జాతీయ విమానం ఎక్కి ఏకంగా 20 రోజుల పాటు అమెరికాను చుట్టి వచ్చారు.. నాసా పరిశోధకులు, వ్యోమగాములతో కరచాలనాలు, సంభాషణలు చేసే అరుదైన అవకాశం దక్కడం జీవితంలో గొప్ప అనుభూతి అని ఆమె చెబుతున్నారు.
Education Loans: ఈ విద్యార్థులకు సబ్సిడీతో రూ.10 లక్షల వరకు విద్యా రుణాలు
సివిల్స్, వరల్డ్ కప్ సాధించాలి..
సాఫ్ట్‌బాల్ క్రీడలో ఇప్పటికీ నిరంతర సాదన చేస్తున్నాను. ఉత్తమ కోచ్‌ల వద్ద శిక్షణ తీసుకుంటున్నాను. భారత్ తరపున ప్రపంచ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్ షిప్‌లో గోల్డ్ కప్ సాధించాలన్నదే లక్ష్యం. కొద్ది నెలల క్రితమే వచ్చిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు సివిల్స్‌కి కూడా ప్రిపేర్ అవుతున్నాను. సివిల్స్ సాధించడం మరో లక్ష్యం. బాల్యంలోనే అమెరికా పర్యటన అవకాశం రావడం నా అదృష్టం. నన్ను ప్రోత్సహించిన అప్పటి రాష్త్ర మాజీ క్రీడాశాఖ మంత్రి టీ.పద్మారావు గౌడ్, తెలంగాణ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు కే.శోభన్ బాబు, నవీన్ కుమార్, ఇండియన్ కోచ్ చిన్నాకృష్ణ సహకారంతో ఈ స్థాయికి ఎదిగాను.
–ప్రవల్లిక, సాఫ్ట్‌బాల్ క్రీడాకారిణి