Due to Rain Schools Holidays 2023 : అతి భారీవర్షాలు.. నేడు స్కూల్స్‌కు సెలవులు.. అలాగే రేపు, ఎల్లుండి కూడా..
భారీవర్షాల కారణంగా హైదరాబాద్‌లో స్కూళ్లకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. పొరుగున్న ఉన్న మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పాఠశాలలకు కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ వానలు ఇలాగే కొనసాగితే.. ఈ సెలవులను పొడిగించే అవకాశం ఉంది.
మరో మూడు రోజులు పాటు..
అల్పపీడన ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. నేడు, రేపు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, నారాయణపేట, నిజామాబాద్,పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.
అదిలాబాద్, హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, గద్వాల్,కొమరం భీం, మహబూబబాద్,మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూలు, నల్గొండ, నిర్మల్, రంగా రెడ్డి, సిద్దిపేట, సూర్యా పేట, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి ఎల్లో అలెర్ట్ ఇచ్చింది. హైదరాబాద్ నగరంలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
విద్యార్థులు ఉంటే ప్రమాదమని..
కొన్ని జిల్లాల అధికారులు ఈ సమయంలో స్కూళ్లు తెరవడం మంచిది కాదంటున్నారు. చాలాచోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతికూల పరిస్థితులున్నాయని, తరగతి పైకప్పులు కురుస్తున్నాయని, వర్షపునీరు గదుల్లో ఉందని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కొన్నిచోట్ల పైకప్పుల నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయని, తరగతిలో విద్యార్థులు ఉంటే ప్రమాదమని ఎంఈఓలు కూడా డీఈఓలకు చెప్పారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
కొన్ని పాఠశాలల ప్రాంగణంలో వరదనీరు ఇంకా నిల్వ ఉందని, విద్యార్థులు పరుగెడితే జారిపడే ప్రమాదం ఉందంటున్నారు. కొన్ని స్కూళ్లల్లో గోడల్లో చెమ్మ ఉందని, ఫలితంగా విద్యుత్ బోర్డుల్లోంచి గోడలకు కరెంట్ వచ్చే ప్రమాదం ఉంటుందని చెప్పారు.
ఏ ఒక్క విద్యార్థికి..
ఏ ఒక్క విద్యార్థికి సమస్య తలెత్తినా ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీంతో బోధన కుంటుపడిందని, ఇంకా సెలవులు ఇవ్వడం సరికాదని కొంతమంది టీచర్లు అంటున్నారు. ప్రమాదంగా ఉండే స్కూళ్లను గుర్తించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే నష్టమేంటని ప్రశ్నిస్తున్నారు.
ఇటు ఆంధ్రపదేశ్‌లో కూడా..
ఆంధ్రప్రదేశ్ నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బలంగా గాలులు వీస్తాయని, ఎల్లుండి సైతం భారీ వానలు ఉంటాయని అప్రమత్తం చేస్తోంది. ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో కూడా విద్యాశాఖ అధికారులు స్కూల్స్ సెలవులు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయంలో ఇంకా స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు.
జూలై నెలలో కురిసిన భారీ వర్షాలకు దాదాపు స్కూల్స్, కాలేజీలకు 10రోజులు వరకు సెలవులు ఇచ్చిన విషయం తెల్సిందే. ఇప్పుడు తాజాగా సెప్టెంబర్ నెలలో కురిసే ఈ భారీ వర్షాలకు కూడా స్కూల్స్,కాలేజీలకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా స్కూల్స్, కాలేజీలకు సెలవులు భారీగానే వచ్చాయి. ఈ సెలవులు కారణంగా ఉపాధ్యాయులు మాత్రం సిలబస్‌ను టైమ్‌కు పూర్తి చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు.
Tags
- due to heavy rain schools holidays
- Telangana schools holidays
- Schools Holidays News
- due to rain schools holidays
- telangana schools holidays due to rain
- schools holiday today
- due to rain schools holiday today telugu news
- TS School Holidays 2023
- School Holiday
- 2023 school holiday list
- heavy rain school holiday telangana
- ap schools holidays 2023
- due heavy rain hyderabad schools holiday
- school holidays
- holiday news
- Due to Heavy Rain Today Schools Holiday
- Due to Heavy Rain Today Schools Holiday in Telangana
- Due to Heavy Rain Today Schools Holiday in AP
- Sakshi Education Latest News