Skip to main content

September Month Schools and Colleges List 2024 : స్కూల్స్‌, కాలేజీలు, ఆఫీసుల‌కు సెల‌వులే.. సెలవులే.. మొత్తం ఎన్ని రోజులు హాలిడేస్‌ అంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : సెప్టెంబ‌ర్‌ నెల‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు భారీగా సెల‌వులు రానున్నాయి. సెప్టెంబ‌ర్‌లో ఎక్కువ పండ‌గ‌లు ఉన్నాయి. సెప్టెంబర్‌లో వినాయక చతుర్థి, ఈద్ మిలాద్ పండుగలకు సెల‌వులు ఇవ్వ‌నున్నాను.
September Month Schools and Colleges List 2024 Details

సెప్టెంబ‌ర్ 1వ తేదీ నుంచి ఆదివారం. ఈ రోజు సాధార‌ణంగా స్కూల్స్‌, కాలేజీల‌కు, ఆఫీసుల‌కు సెలవు ఉన్న విష‌యం తెల్సిందే. అలాగే సెప్టెంబర్ 7వ తేదీ (శనివారం) గణేష్ చతుర్థి సందర్భంగా దేశవ్యాప్తంగా స్కూల్స్‌, కాలేజీల‌కు, ఆఫీసుల‌కు సెల‌వు ఉంటుంది. మ‌ళ్లీ రోజు సెప్టెంబర్ 8వ తేదీన ఆదివారం. ఈ రోజు కూడా సాధార‌ణంగా స్కూల్స్‌, కాలేజీల‌కు, ఆఫీసుల‌కు సెల‌వు. దీంతో వ‌రుస‌గా రెండు రోజులు పాటు.. సెల‌వులు రానున్నాయి. 

వ‌రుస‌గా 3 రోజులు పాటు సెలవులు..
సెప్టెంబర్ 14వ తేదీన‌ రెండో శనివారం సందర్భంగా చాలా స్కూల్స్‌, కాలేజీలు, ఆఫీసులు సెల‌వు ఉంటున్న విష‌యం తెల్సిందే. అలాగే సెప్టెంబర్ 15వ తేదీన‌ ఆదివారం వారంతపు హాలిడే. సెప్టెంబర్ 16 వ తేదీన (సోమవారం) ఈద్ ఇ మిలాద్ సందర్భంగా దేశవ్యాప్తంగా హాలిడే ఉన్న విష‌యం తెల్సిందే. దీంతో ఇదే వ‌రుస‌గా 3 రోజులు పాటు సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 22వ తేదీన ఆదివారం. ఈ రోజు కూడా సాధార‌ణంగా స్కూల్స్‌, కాలేజీల‌కు, ఆఫీసుల‌కు సెల‌వు ఉంటుంది.సెప్టెంబర్ 28వ తేదీన‌ నాల్గవ శనివారం. ఈ రోజున కొన్ని స్కూల్స్‌, కాలేజీలు సెల‌వు ఆఫీసులు సెల‌వు ఉంటున్న విష‌యం తెల్సిందే.
అలాగే సెప్టెంబర్ 29 ఆదివారం.. ఈ రోజున సాధార‌ణంగా అన్ని స్కూల్స్‌, కాలేజీల‌కు, ఆఫీసుల‌కు సెలవు ఉంటుంది. 

దాదాపు 9 నుంచి 10 రోజుల పాటు సెల‌వులు..?
మొత్తం మీద ఈ సెప్టెంబ‌ర్ నెల‌లో 5 ఆదివారాలు, రెండో శ‌నివారం, నాలుగో శ‌నివారం, వినాయక చతుర్థి, ఈద్ మిలాద్ పండ‌గ‌ల‌తో క‌లిపి మొత్తం మీద దాదాపు 9 రోజులు స్కూల్స్, కాలేజీల‌కు సెల‌వులు రానున్నాయి. అలాగే కొన్ని అనుకోని బంద్‌లు, భారీ వ‌ర్షాలు వ‌స్తే.. స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. మొత్తం మీద స్కూల్స్‌, కాలేజీల విద్యార్థుల‌కు సెప్టెంబ‌ర్ మాసం అంతా సెల‌వులే.. సెలవులే.. పండ‌గే పండ‌గలా ఉంది.

2024 సెప్టెంబ‌ర్ నెల బ్యాంక్‌ల‌కు కూడా భారీగా సెల‌వులు ఇవే..
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతి నెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తున్న విష‌యం తెల్సిందే. వినియోగదారులు ఈ సెలవులను గమనించి తమతమ బ్యాంకు పనులను చేసుకునేందుకు ప్లాన్‌ చేసుకోవడం మంచిది. ఆర్బీఐ క్యాలెండర్‌ ప్రకారం.. సెప్టెంబర్‌లో మొత్తం 14 రోజులు పాటు బ్యాంక్‌ల‌కు సెలవులు ఉండనున్నాయి. ఇందులో శని, ఆదివారాలు సెలవులు ఉన్నాయి. వినాయక చతుర్థి, ఈద్ మిలాద్ పండుగలు కూడా సెలవు జాబితాలో చేర్చారు. కేరళలో జరుపుకొనే ఓనం, తిరువణం పండుగలు ఉండనున్నాయి. బదులుగా నారాయణగురు జయంతి సందర్భంగా సెప్టెంబర్ 18, 21 తేదీలలో కేరళలో బ్యాంకులు మూసి ఉండనున్నాయి. సెప్టెంబరు 14 నుంచి 16 వరకు దేశవ్యాప్తంగా బ్యాంకులకు మూడు రోజుల సెలవులు ఉంటాయి. ఇందులో 16న ఈద్ మిలాద్ కూడా ఉంది. సెప్టెంబర్ 13 నుంచి 16 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు రాజస్థాన్‌లో బ్యాంకులు మూతపడనున్నాయి. సిక్కింలో 14 నుంచి 17వ తేదీ వరకు నాలుగు రోజుల సెలవులు ఉన్నాయి.ఈద్ మిలాద్ కాకుండా శని, ఆదివారాలు మాత్రమే సెలవులు. కర్ణాటకలో మొత్తం ఎనిమిది సెలవులు ఉన్నాయి. ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయని గమనించండి. 

సెప్టెంబర్ 2024లో బ్యాంక్ సెల‌వులు ఇవే..
☛➤ సెప్టెంబ‌ర్ 1వ తేదీ నుంచి ఆదివారం ( ఈ రోజు బ్యాంక్ సెల‌వు ఉంటుంది)
☛➤ సెప్టెంబర్ 5వ తేదీ గురువారం : శ్రీమంత శంకరదేవ తిథి (అస్సాంలో సెలవు)
☛➤ సెప్టెంబర్ 7వ తేదీ శనివారం : వినాయక చతుర్థి
☛➤ సెప్టెంబరు 8వ తేదీ ఆదివారం సెలవు (ఒడిషాలో నౌకై పండుగ)
☛➤ సెప్టెంబర్ 13వ తేదీ శుక్రవారం : రామ్‌దేవ్ జయంతి, తేజ దశమి (రాజస్థాన్‌లో సెలవు)
☛➤ సెప్టెంబర్ 14వ తేదీ  రెండవ శనివారం ( కేరళలో ఓనం)
☛➤ సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం సెలవు (కేరళలోని తిరువోణం)
☛➤ సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం: ఈద్ మిలాద్
☛➤ సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం: ఇంద్ర జాత్ర (సిక్కింలో సెలవు)
☛➤ సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం: శ్రీ నారాయణగురు జయంతి (కేరళలో సెలవు)
☛➤ సెప్టెంబర్ 21వ తేదీ శనివారం: శ్రీ నారాయణగురు సమాధి (కేరళలో సెలవు)
☛➤ సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం సెలవు
☛➤ సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం : బలిదాన్ డే (హర్యానాలో సెలవు)
☛➤ సెప్టెంబర్ 28వ తేదీ నాల్గవ శనివారం
☛➤ సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం సెలవు

 

2024లో Schools & Colleges సెల‌వులు వివ‌రాలు ఇవే...

☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

2024-25 విద్యాసంవత్సరంలో ముఖ్యమైన‌ సెలవులు ఇవే..

➤☛ దసరా సెలవులు అక్టోబరు 4 నుంచి 13 వరకు ఉండనున్నాయి.
➤☛ క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి.
➤☛ అక్టోబరు 31న దీపావళి సెలవు
➤☛ డిసెంబరు 25న క్రిస్మస్, క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు.
➤☛ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు.

Published date : 23 Aug 2024 07:33PM

Photo Stories