School & Colleges Holiday list in September 2023 : సెప్టెంబర్‌లో స్కూల్స్, కాలేజీలకు భారీగానే సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?
దీంతో స్కూల్స్, కాలేజీలకు వరుసగా సెలవులు (Schools & Colleges Holidays) రాబోతున్నాయి. సెప్టెంబర్ నెలలో నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం, శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సెలవులు ఉన్నాయి.
సెప్టెంబర్ నెలలో సెలవుల పూర్తి వివరాలు ఇవే..
☛ సెప్టెంబర్ 3- ఆదివారం
☛ సెప్టెంబర్ 7- శ్రీకృష్ణ జన్మాష్టమి
☛ సెప్టెంబర్ 9- రెండో శనివారం
☛ సెప్టెంబర్ 10- ఆదివారం
☛ సెప్టెంబర్ 17- ఆదివారం
☛ సెప్టెంబర్ 18- వినాయక చవితి
☛ సెప్టెంబర్ 23- నాలుగో శనివారం
☛ సెప్టెంబర్ 24- ఆదివారం
☛ సెప్టెంబర్ 28- మిలాద్ ఉన్ నబీ
సెప్టెంబర్ 7 గురువారం కృష్ణాష్టమి సందర్భంగా సెలవు. సెప్టెంబర్ 9 రెండో శనివారం, సెప్టెంబర్ 10 ఆదివారం సందర్భంగా సెలవు. కాబట్టి సెప్టెంబర్ 8 శుక్రవారం సెలవు తీసుకుంటే లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చు. వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు రానున్నాయి. అలాగే ప్రస్తుతం వర్షాకాలంలో భారీ వర్షాల కారణంతో కూడా కొన్ని కొన్ని స్కూల్స్‌కు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్‌లో కచ్చితమైన సెలవుల గురించి తెలుసుకోవడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు సంబంధిత స్కూల్ హాలిడే షెడ్యూల్‌ను చెక్ చేయవచ్చు.
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
తెలంగాణలో 2023-24 అకడమిక్ ఇయర్‌లో పరీక్షలు- సెలవులు ఇవే..
☛ 2023-24 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి మొత్తం 229 పనిదినాలు ఉన్నాయి.
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి
☛ అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా అకడమిక్ ఇయర్ క్యాలెండర్‌లో పేర్కొంది తెలంగాణ ప్రాథమిక విద్యాశాఖ.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
ఆంధ్రప్రదేశ్ స్కూల్ అకడమిక్ క్యాలెండర్, సెలవుల(2023–24) పూర్తి వివరాలు ఇవే..
జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం అయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ స్కూల్ అకడమిక్ క్యాలెండర్ 2023–24ను విడుదల చేశారు. స్కూల్ కాంప్లెక్స్ షెడ్యూల్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విధులు, లాంగ్వేజ్ మేళా, లాంగ్వేజ్ క్లబ్, లాంగ్వేజ్ ల్యాబ్స్, లెసన్ ప్లాన్ ఫార్మాట్ అండ్ గైడ్‌లైన్స్, లెర్న్ ఏ వర్డ్ ఏ డే, తెలుగు భాషా వారోత్సవాలు, కల్చరల్ యాక్టివిటీస్‌తో సహా స్కూళ్లలో చేపట్టాల్సిన పలు అంశాలతో అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించారు.
చదవండి: ఏపీ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్ పేపర్స్ | న్యూస్
ఏపీలో ఈ ఏడాది (2023-24) సెలవులు ఇలా..
☛ అక్టోబర్ 14 నుంచి 24 వరకు దసరా సెలవులు
☛ జనవరి 9, 2024 నుంచి 18, 2024 వరకు సంక్రాంతి సెలవులు
☛ డిసెంబర్ 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు క్రిస్టమస్ సెలవులు (మిషనరీ స్కూల్స్‌కు మాత్రమే..)
☛ ఇంకా దీపావళి, ఉగాది, రంజాన్ మొదలైన పండగలకు ఆ రోజును బట్టి సెలవులు ఇవ్వనున్నారు.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్
Tags
- Telangana schools holidays
- ap schools holidays 2023
- school holidays
- holidays
- vinayaka chaturthi 2023 college holiday
- krishnashtami school holidays 2023
- sunday and saturday school holidays 2023
- september month school holidays 2023 telugu news
- september month colleges holidays 2023 telugu news
- telangana government holidays 2023 september
- ap government holidays 2023 september
- schools and colleges holiday september 2023
- schools and colleges holiday september 2023 in Telugu
- sakshi education