DEO: విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించాలి
కడప ఎడ్యుకేషన్ : మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ ఎద్దుల రాఘవరెడ్డి, సమగ్రశిక్ష జిల్లా పథక అధికారి అంబవరం ప్రభాకరెడ్డి అన్నారు. ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీలో భాగంగా మహిళా శిశు సంక్షేమశాఖలో పనిచేస్తున్న సూపర్‌వైజర్లు, ప్రాథమిక పాఠశా లల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఆరు రోజుల శిక్షణలో భాగంగా సోమవారం కడప లోని గ్లోబర్ ఇంజినీరింగ్ కళాశాలలో శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఆరు సంవత్సరాల వారంతా చిన్నపిల్లలేనని,వారికి ఆటపాటలు, కృత్యాలు, కథల ద్వారా బోధనలు చేసినట్‌లైతే చక్కగా అవగాహన చేసుకుంటారన్నారు. కృత్యాల ద్వారా విద్యా బోధన జరిగినప్పుడే పిల్లల్లో చదువుపై ఆసక్తి పెరుగుతుందని, తద్వారా డ్రాపౌట్స్ స్థాయిని తగ్గించవచ్చన్నారు. సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్టు అధికారి అంబవరం ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు అందరూ తప్పకుండా చదువడం, రాయడం, చదుర్విధ పక్రియలను చేయగలిగేలా చేయడం ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశం అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిక్షణ పర్యవేక్షకురాలిగా అకడమిక్ మానిటరింగ్ అధికారి ధనలక్ష్మి, ఏఏఎంఓ, రామాంజనేయలు, జీసీడీఓ విజయలక్ష్మి, కీ రీసోర్సు పర్సన్‌గా వరలక్ష్మి వ్యవహరించారు.
చదవండి: Andhra Pradesh Govt Schools: ప్రతి పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం