Skip to main content

Talented Students: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ!

కళాత్మక పోటీల్లో కేజీ.కండ్రిగ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న 9 మంది విద్యార్థులను సీఈఓ సరస్వతి సత్కరించారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో దాగివున్న ప్రత్యేక ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించే విధంగా రాష్ట్ర విద్యాశాఖ ప్రతి ఏటా విద్యార్థులకు కళాత్మక పోటీలు నిర్వహిస్తోంది. పాఠశాల, మండల, జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి చివరగా రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నారు. తిరువళ్లూరు జిల్లా స్థాయిలో కళాత్మాక పోటీల్లో జిల్లా నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

JEE Main 2024: జేఈఈ మెయిన్‌ పరీక్ష విధానం.. సబ్జెక్ట్‌ వారీగా ముఖ్యమైన టాపిక్స్‌..

16 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఆరవ నుంచి ప్లస్‌టూ విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో కేజీ.కండ్రిగ ప్రభుత్వ మహోన్నత పాఠశాల నుంచి 123 మంది విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధికంగా కేజీ.కండ్రిగ పాఠశాల విద్యార్థులు 19 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు.

విజేత విద్యార్థులను జిల్లా ఉన్నత విద్యాశాఖాధికారి సరస్వతి, జిల్లా ప్రాథమిక విద్యాశాఖాధికారి సుగానందనం అభినందించారు. అలాగే పాఠశాల హెచ్‌ఎం దామోదరన్‌, పీటీఏ అధ్యక్షుడు రమేష్‌, అసిస్టెంట్‌ హెచ్‌ఎం ముకుందయ్య, పట్టభద్రుల ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నరసింహన్‌, సహా ఉపాధ్యాయులు, విద్యార్థుల ఉత్తమ ప్రతిభను కొనియాడి రాష్ట్ర స్థాయిలో రాణించాలని అకాంక్షించారు.

Study Abroad in USA: యూఎస్‌లో క్రేజీ కోర్సులు.. వీసాకు కావల్సిన పత్రాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Published date : 06 Nov 2023 03:08PM

Photo Stories