Skip to main content

Collector Sudden Inspection At School: ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్‌ ఆసక్మిక తనిఖీ

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్‌ జిల్లాలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులకు కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశ సూచించారు. జిల్లా ఫిజికల్‌ సైన్స్‌ ఫోరం తయారుచేసిన పదో తరగతి ఫిజికల్‌ సైన్స్‌ ఒక మార్క్‌, రెండు మార్కుల బుక్‌లెట్‌ను కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆయన మంగళవారం ఆవిష్కరించారు.
Collector Sudden Inspection At School
Collector Sudden Inspection At School

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. బుక్‌లెట్‌ తయారీలో ఫిజికల్‌ సైన్స్‌ టీచర్ల కృషిని అభినందించారు. జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు మాట్లాడుతూ.. సైన్స్‌ టీచర్లు అందరూ ప్రయోగశాలను సమర్థవంతంగా వినియోగించుకొని బోధనను మరింత మెరుగుపర్చుకోవాలన్నారు.

త్వరలో జరిగే ఇన్‌స్పైర్‌, జిల్లా సైన్స్‌ ఫెయిర్‌లకు విద్యార్థులను సిద్ధం చేయాలన్నారు. జిల్లా సైన్స్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మైనం హుస్సేన్‌ మాట్లాడుతూ.. ఫిజికల్‌ సైన్స్‌ సబ్జెక్ట్‌ కాంప్లెక్స్‌లలో సబ్జెక్ట్‌ నిష్ణాతులైన టీచర్స్‌ ద్వారా ఈ మెటీరియల్‌ను తయారు చేశామన్నారు.

Food Poison At School: తెలంగాణలో మళ్లీ ఫుడ్‌ పాయిజన్‌.. బాలికలకు అస్వస్థత

పబ్లిక్‌ పరీక్షలకే కాకుండా పాలిసెట్‌ వంటి పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుందన్నారు. సర్వశిక్షాభియాన్‌ జిల్లా ఏపీసీ ఉమామహేశ్వరరావు, పీఓ చంద్రశేఖర్‌, డీఎంహెచ్‌ఓ సుహాసిని, డీసీపీ కృష్ణమూర్తినాయుడు, జిల్లా ఫిజికల్‌ టీచర్స్‌ ఫోరం ప్రధాన కార్యదర్శి పి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 05 Dec 2024 10:10AM

Photo Stories