Skip to main content

Cardiac arrest: కార్డియాక్ అరెస్ట్‌కు గురైతే ఎలా స్పందించాలో తెలుసా... సీపీఆర్ ఎలా చేయాలో తెలుకోండి

కార్డియాక్ అరెస్ట్‌... ప్ర‌స్తుతం ఈ పేరు వింటేనే కొట్టుకునే గుండె ఆగిపోతోంది. చిన్నా, పెద్ద తేడా లేదు. వ‌య‌సుతో సంబంధం లేదు.. చాలా ఫిట్‌గా ఉన్న వారు కూడా కార్డియాక్ అరెస్ట్‌తో సెక‌న్ల‌లో త‌నువు చాలిస్తున్నారు.
Cardiopulmonary resuscitation (CPR)

ఏపీ మాజీ మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి, సినీ న‌టుడు పునీత్ రాజ్‌కుమార్‌, బాలీవుడ్ న‌టుడు రాజ్ కౌష‌ల్‌.. ఇలా ప్ర‌ముఖులంతా కార్డియాక్ అరెస్ట్‌కు గురై చ‌నిపోయారు. తాజాగా హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలో ఓ వ్య‌క్తి ఉన్న‌ప‌ళంగా రోడ్డుపై ప‌డిపోయాడు. అక్క‌డే విధుల్లో ఉన్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ స‌మ‌యానికి కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేయ‌డంతో ఆ వ్య‌క్తి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌గ‌లిగాడు.

చ‌ద‌వండి: మార్చి 2 నుంచి SSC ప‌రీక్ష‌లు...పూర్తి వివ‌రాలు ఇవే
అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం...
మారుతున్న జీవ‌న శైలి, ప‌ని వేళ‌లు, తినే ఆహారంలో మార్పులు, వేళ‌కు నిద్ర‌పోక‌పోవ‌డం, వ్యాయాయం స‌రిగ్గా చేయ‌క‌పోవ‌డం, వ్య‌స‌నాల‌కు బానిస కావ‌డం... త‌దిత‌ర కార‌ణాల‌తో చాలామంది కార్డియాక్ అరెస్ట్‌కు గుర‌వుతున్నారు. మ‌న చుట్టుప‌క్క‌ల వారు... అంతెందుకు మ‌న ఇంట్లో వారు సైతం కార్డియాక్ బారిన ప‌డుతున్నారు. ఆ స‌మ‌యంలో సీపీఆర్ చేసే విధానం తెలిసి ఉంటే మ‌న‌వారి ప్రాణాలను మ‌నం కాపాడిన వార‌మ‌వుతాం. ఈ నేప‌థ్యంలో సీపీఆర్ ఎలా చేయాలో తెలుసుకుందాం.

Cardiopulmonary resuscitation


కార్డియాక్‌ అరెస్టు అంటే.. 
కార్డియాక్‌ అరెస్ట్‌ ఆకస్మికంగా వస్తుంది. శరీరంలో ఎలాంటి ముందస్తు లక్షణాలు కనిపించవు. సాధారణంగా గుండెలో ఏర్పడే అలజడితో పాటు అప్పటికే శరీరంలో ఉన్న ఇతర అనారోగ్య కారణాలు ఇందుకు తోడు కావడం. గుండె కొట్టుకోవడంలో సమతుల్యం దెబ్బతినడం, రక్తాన్ని పంప్‌ చేసే సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా మెదడు, గుండె, శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రసరణ నిలిచిపోతుంది. ఫలితంగా కొద్ది క్షణాల్లోనే రోగి అపస్మారక స్థితికి చేరుకుంటారు.
నిమిషాల‌ల్లోనే ప్రాణాలు గాలిలోకి...
ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం, గుండె కొట్టుకోవడంలో సమస్యలు ఏర్పడటం, గుండె కండరం దళసరిగా ఉండటం, కుటుంబీకులకు ఈ రకమైన చరిత్ర ఉండటం, ఒత్తిడి ఇలా ఏదో ఒక కారణంతో సడన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ ఏర్పడుతుంది. సడన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌కు గురైతే గుండె మొత్తం ఒకేసారి పని చేయడం ఆగిపోయి నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలొదులుతారు.

చ‌ద‌వండి:​​​​​​​ ఆగ‌ని తొల‌గింపుల ప‌ర్వం... ఈసారి 200 మంది జౌట్
ఛాతీలో నొప్పి అనిపిస్తే..
గుండెలో నొప్పిగా అనిపించినప్పుడు చెమటలు అధికంగా పడుతాయి. ఆయాసం వస్తుంది. గ్యాస్‌ సమస్యగా అనిపించినప్పుడు ట్యాబ్లెట్‌ వేసుకున్నా తగ్గకపోయినపుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. అక్కడే ఉన్న వారికి సీపీఆర్‌ చేయడం తెలిస్తే చేయాలి. 
సీపీఆర్ ఇలా చేయాలి...
- ఎవరైనా హఠాత్తుగా ఛాతిలో నొప్పి, ఇబ్బందితో కుప్పకూలిపోతే వెంటనే సమీపంలో ఉన్నవారు రెండు చేతులతో ఛాతిపై బలంగా నొక్కాలి. 
- ఛాతిపై సుమారుగా 20–30 సార్లు ఇలా చేయాలి. 
- తర్వాత రెండు ముక్కు రంధ్రాలు మూసి నోటిలోకి గట్టిగా గాలి ఊదాలి. ఇలా రెండుమూడు సార్లు చేయాలి.  
- సీపీఆర్ చేయ‌డం వల్ల గుండెపై ఒత్తిడి పడుతుంది. గుండె మళ్లీ కొట్టుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వెంటనే ఆస్పత్రికి తరలించడం ద్వారా ప్రాణాలు కాపాడే వీలుంటుంది.  

చ‌ద‌వండి: హాఫ్‌ జీతానికే ప‌నిచేయండి... లేదంటే.. ప్రెష‌ర్స్‌కు ఐటీ కంపెనీ షాక్‌

Published date : 27 Feb 2023 05:34PM

Photo Stories