Areez Khambatta:‘రస్నా’ అరీజ్ కన్నుమూత
దశాబ్దాల క్రితమే తండ్రి ఫిరోజా ఖంబట్టా ప్రారంభించిన చిన్న వ్యాపారాన్ని అరీజ్ భారీ సంస్థగా తీర్చిదిద్దారు. ఆయన హయాంలో రస్నా 60 దేశాలలో విస్తరించడం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద కాన్సెంట్రేట్ తయారీ కంపెనీగా ఆవిర్భవించింది.
పరిశ్రమకు అందించిన విశిష్ట సేవలకు గాను అరీజ్ పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. రాష్ట్రపతి హోమ్ గార్డ్, సివిల్ డిఫెన్స్ మెడల్, పశి్చమి స్టార్, సమర్‌సేవా, సంగ్రామ్ మెడల్స్‌తో పాటు జాతీయ పౌర పురస్కారం మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఆయన నెలకొలి్పన ట్రస్టులు, ఫౌండేషన్‌లు .. హెల్త్‌కేర్, విద్య తదితర రంగాల్లో పనిచేస్తున్నాయి.
1970లో..: చిన్న ప్యాకులలో అందించడం ద్వారా 1970లలో రస్నా సాఫ్ట్ డ్రింకుల మార్కెట్లో వేగంగా ఎదిగింది. దాదాపు 18 లక్షల రిటైల్ ఔట్‌లెట్లలో అమ్ముడవుతోంది. 1980–90లలో రూపొందించిన ‘ఐ లవ్యూ రస్నా’ ప్రకటన ఎంతో మందిని ఆకట్టుకుంది. చౌకగా రూ.5 విలువ గల రస్నా ప్యాకెట్‌తో 32 గ్లాసుల సాఫ్ట్ డ్రింకును తయారు చేసేందుకు వీలు కలి్పంచడం ద్వారా మార్కెట్లో భారీగా విస్తరించింది. రస్నాకు 9 తయారీ ప్లాంట్లు, 5,000 పైచిలుకు స్టాకిస్టులు ఉన్నారు. రుచిపరంగా రస్నాకు పలు అంతర్జాతీయ అవార్డులు సైతం లభించాయి. కొన్నేళ్ల క్రితమే అరీజ్.. కుమారుడు పిరుజ్ ఖంబట్టాకు రస్నా పగ్గాలు అప్పగించారు. ప్రస్తుతం పిరూజ్ గ్రూప్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.