Jagananna Vidya Deevena Scheme 2023: మూడో విడత నిధులు విడుదల.. రూ.35.39 కోట్లు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఈ నిధులు విడుదల చేయనున్నారు. ఈ నిధులు మొత్తం జిల్లాలోని 47,350 మంది విద్యార్థులకు సంబంధించి 42,899 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.35.39 కోట్లు జమకానున్నాయి. స్థానిక ప్రకాశం భవనంలోని వీడియో కాన్ఫరెన్స్‌హాలు నుంచి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌తోపాటు ఒంగోలు శాసనసభ పరిధిలోని ప్రజాప్రతినిధులంతా పాల్గొంటారని, ఈ సందర్భంగా మెగా చెక్కు పంపిణీ చేస్తారని సాంఘిక సంక్షేమశాఖ నోడల్ అధికారి ఎన్.లక్ష్మానాయక్ తెలిపారు.
Also read: AP Students Chosen for United Nations Forum Meet | CM YS Jagan | #sakshieducation
ఈకేవైసీలో రాష్ట్రంలోనే ప్రకాశం ప్రథమ స్థానం
జగనన్న విద్యాదీవెన మూడో విడత నిధుల విడుదలకు సంబంధించి ప్రతి విద్యార్థి ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. దీనికి సంబంధించి విద్యార్థి రాష్ట్రంలోని ఏ సచివాలయం నుంచి అయినా ఈకేవైసీ చేయించుకునేలా అవకాశం కల్పించారు. మొత్తం 26 జిల్లాలకు సంబంధించి ఈకేవైసీ నమోదులో ప్రకాశం అగ్రస్థానంలో నిలిచింది. 97.77 శాతం ప్రకాశం ప్రథమస్థానంలో ఉంది.
Also read: Student Speaks Up!:Sharing insights into the Jagananna Videshi Vidya Deevena Scheme #sakshieducation
నేడు జగనన్న విద్యాదీవెన మూడో క్వార్టర్ నిధులు విడుదల జిల్లాలో అర్హులైన విద్యార్థులు 47,350 మంది జమ కానున్న నిధులమొత్తం రూ.35.39 కోట్లు