ఏయూక్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులతో శ్రీలంకకు చెందిన శ్రీ జయవర్ధన విశ్వవిద్యాలయం అధికారులు సమావేశమయ్యారు.
వీసీ ప్రసాదరెడ్డి
వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాద రెడ్డి, రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, ఆచార్య పి.డి.సత్యపాల్, అంబేడ్కర్ చైర్ ప్రొఫెసర్ డాక్టర్ హెచ్.పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. శ్రీలంకలోని శ్రీ జయవర్ధన విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ఎం.పద్మలాల్, పాలి–బుద్ధిస్ట్ స్టడీస్ విభాగాధిపతి ఆచార్య ఎం.విజితానంద పాల్గొన్నారు. ఏయూలో పాలి–బుద్ధిస్ట్ స్టడీస్ అంశంలో ఎంఏ కోర్సును ప్రారంభించే దిశగా అవగాహన ఒప్పందం(ఎంవోయూ) చేసుకోవడానికి సన్నాహకంగా ఈ సదస్సు నిర్వహించారు. రెండు విశ్వవిద్యాలయాల్లో వసతులు, కోర్సు నిర్వహణకు సాధ్యాసాధ్యాలను చర్చించారు. కార్యక్రమాన్ని డాక్టర్ నిమాలి తక్షిల సమన్వయం చేశారు.