AU Students : ఏయూ విద్యార్థుల వినతికి స్పందించిన అధికారులు
సీతంపేట: ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థుల వినతికి అధికారులు స్పందించి ఫీజు తగ్గించారు. ప్రస్తుతం ఉన్న సెమిస్టర్ ఫీజులో రూ.450 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏయూ ఆర్ట్స్ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు పరీక్ష ఫీజు తగ్గించాలని, ఫీజు చెల్లింపు గడువును నవంబరు 2వ తేదీ వరకు పొడిగించాలని వీసీ ఆచార్య జి.శశిభూషణరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్.ధనుంజయరావులకు బుధవారం వినతిపత్రం అందజేశారు.
Application Date Extended : డీఎస్సీ ఉచిత శిక్షణకు పొడగించిన దరఖాస్తుల గడువు!
ఈ మేరకు ఫీజును తగ్గిస్తూ వీసీ నిర్ణయం తీసుకోగా.. విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య మాట్లాడుతూ విద్యార్థులు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు. త్వరలో ఏయూలో డ్యూయల్ డిగ్రీ విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఆచార్య ఎన్.కిశోర్‌బాబు, విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య జి.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)