Specialized Courses: నైపుణ్యంతో కూడిన కోర్సులకు యూజీసీ ప్రతిపాదనలు.. వివిధ కోర్సుల్లో 2017-18 నుంచి చేరికలు ఇలా..
ఇందుకు సంబంధించి ఇటీవల యూనివ ర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చేసిన ప్రతిపా దనలకు సూత్ర ప్రాయంగా ఆమోదం లభించింది. సాధారణ యూనివర్శిటీ విద్య మాదిరిగానే డిస్టెన్స్ మోడల్ లోనూ నైపుణ్యంతో కూడిన కొన్ని కోర్సులను ప్రవేశపెట్టాలని యూజీసీ భావిస్తోంది.
సాధారణ డిగ్రీల్లో గణ నీయమైన మార్పులు వస్తున్న నేపథ్యం లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ను ఇంకా సంప్ర దాయ కోర్సులతో నిర్వహించడం వల్ల ఫలితం ఉండదని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూజీసీ నిర్వహించిన అధ్యయనంలో నేటి తరం ఉపాధి అవకాశాలు మెరుగు పరిచే కోర్సులు దూర విద్యలోనూ ఉం డాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో ఏయే కోర్సులు ఉండాలి? నిర్వహణ ఎలా? సాధ్యాసాధ్యాలేమిటి? అనే అం శాలను కేంద్ర స్థాయిలో పరిశీలిస్తు న్నారు.
స్కిల్ కోర్సులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని యూజీసీ భావి స్తోంది. ఈ మేరకు విదేశీ వర్సిటీల తోనూ అవగాహన ఒప్పందం కుదుర్చు కోవాలని భావిస్తున్నారు.
చదవండి: Distance Education: దూర విద్యలో ఇగ్నో ఆధునిక కోర్సులు.. దేశ వ్యాప్తంగా స్థానం ఇది!
విదేశీ ఫ్యాకల్టీతో వర్చువల్ విధానంలో..
వాస్తవానికి డిస్టెన్స్ విద్యా విధానానికి గత ఐదేళ్ళ కాలంలో 13 శాతం మేర ఎన్రోల్మెంట్ (చేరికలు) పెరిగింది. దూరవిద్యలో చదివేవారి సంఖ్య 2017-18లో దేశవ్యాప్తంగా 40.32 లక్షలు ఉండగా.. 2021-22 నాటికి ఇది 45.73 లక్షలకు చేరింది. వీరిలో 20.06 లక్షల మంది మహిళలయితే, 25.67 లక్షల మంది పురుషులు.
సాధారణ విద్యతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారు పదోన్నతుల కోసం డిస్టెన్స్ విద్యను ఎంచుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బం దుల వల్ల ఇంటర్, డిగ్రీతో విద్య మానేసిన వాళ్ళు, చదువు మధ్యలోనే ఆపేసి వివాహం చేసుకున్న మహిళలు, పరిస్థితుల కారణంగా కుటుంబ పోషణ కోసం ప్రైవేటు ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు డిస్టెన్స్ విధానంలో ఉన్నత విద్యను అభ్యసి స్తున్నారు. దీంతో పాటు సివిల్స్, ఇతర పోటీ పరీక్షలపై దృష్టి పెట్టే వాళ్ళు కూడా ఆర్ట్స్ కోర్సులు చదివేందుకు డిస్టెన్స్ మోడ్ను ఎంచుకుంటున్నారు.
చదవండి: KU: 23నుంచి దూరవిద్య ఎమ్మెస్సీ మ్యాథ్స్ ఫైనలియర్ పరీక్షలు
మరో ఏడాదిలోనే అందుబాటులోకి
డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇప్పటివ రకు సంప్రదాయ డిగ్రీ, పీజీ, సరి ఫికెట్, డిప్లొమా, ఇంటిగ్రేటెడ్, పీహెచ్ కోర్సులకు మాత్రమే పరి మితమైంది. తాజాగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పారిశ్రామిక భాగస్వామ్యంతో కంప్యూటర్ కోర్సులు, ఇతర స్కిల్ కోర్సులూ నేర్చుకునేందుకు అవకాశం కల్పించాలని భావిస్తున్నారు.
వర్చువల్ విధానం లోనూ క్లాసులు నిర్వహణకు వీలుగా కార్యాచరణ రూపొందిస్తు న్నారు. కంప్యూటర్ కోర్సులను అవసరమైతే విదేశీ బోధనా సిబ్బంది ద్వారా వర్చువల్ (విదేశాల్లోనే ఉండి) విధానంలో నేర్చుకునేలా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. విద్యార్థులు కూడా ఇంట్లో ఉండే ఆన్లైన్ క్లాసుకు హాజరయ్యే వీలు కల్పించాలన్నది కొత్త ప్రతిపా దన. మరో ఏడాదిలో ఈ విధానం అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
స్కిల్ కోర్సులు అందుబాటులోకి తెస్తే డిస్టెన్స్ కోర్సుల్లో చేరేవారి సంఖ్య మరింత పెరిగే వీలుందని అటున్నారు.
50 శాతం చేరికలు లక్ష్యం
దేశవ్యాప్తంగా ప్రస్తుతం దూర విద్య ద్వారా చదివే వాళ్ళు 28 శాతం మాత్రమే ఉన్నారు. దీన్ని 50 శాతానికి తీసుకెళ్ళాలని యూజీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణం గా కొత్త కోర్సులు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని పరిశ్ర మలతో ఎంవోయూ చేసుకునే యోచనలో కూడా ఉన్నారు.
- ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి (ఉన్నత విద్య మండలి చైర్మన్)
డిస్టెన్స్ విద్య ద్వారా వివిధ కోర్సుల్లో 2017-18 నుంచి చేరికలు
కోర్సు |
2017-18 |
2018-19 |
2019-20 |
2020-21 |
2021-22 |
బీఏ |
1651499 |
1745018 |
1890920 |
1877809 |
1946123 |
ఎంఏ |
677641 |
613161 |
656154 |
720181 |
824709 |
ఎమ్మెస్సీ |
105507 |
74103 |
109459 |
99948 |
113504 |
బీఎస్సీ |
222218 |
217942 |
251489 |
184916 |
220782 |
ఎంబీఏ |
156911 |
125980 |
155337 |
130731 |
120361 |
ఎంకాం |
171093 |
128801 |
144284 |
223231 |
152082 |
Tags
- distance education
- UGC
- Virtual Approach with Foreign Faculty
- Telangana News
- Specialized Courses
- TSCHE
- prof r limbadri
- UGC Guidelines for Pursuing Academic Programs
- University Grants Commission
- CentralEducationDepartment
- DistanceEducation
- DistanceLearning
- EducationReforms
- OnlineEducation
- SakshiEducationUpdates