KU: 23నుంచి దూరవిద్య ఎమ్మెస్సీ మ్యాథ్స్ ఫైనలియర్ పరీక్షలు
Sakshi Education
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య (ఎస్‌డీఎల్‌సీఈ) ఎమ్మె స్సీ మ్యాథ్స్ ఫైనలియర్ పరీక్షలు జనవరి 23 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి మల్లారెడ్డి, అదనపు పరీ క్షల నియంత్రణాధికారి డాక్టర్ నరేందర్ తెలి పారు.
23న పేపర్–1 మెసర్ అండ్ ఇంటిగ్రేషన్, 25న రెండో పేపర్ టొపాలజీ అండ్ ఫంక్షనల్ అనాలిసిస్, 29న మూడవ పేపర్ మ్యాథమెటికల్ మెథడ్స్, 31న నాల్గో పేపర్ ఆపరేషనల్ రీసెర్చ్, ఫిబ్రవరి 2న 5వ పేపర్ న్యూమరికల్ అనాలిసిస్ పరీక్షలు నిర్వహించనున్నామని వివరించారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు.
బీటెక్ సెకండియర్ మొదటి సెమిస్టర్..
కేయూ పరిధిలో బీటెక్ సెకండియర్ మొదటి సెమిస్టర్ (మూడవ సెమిస్టర్) (సీబీసీఎస్) రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు ఈ నెల 23వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు అధికారులు మల్లారెడ్డి, రాధిక తెలిపారు. ఈనెల 23, 25, 27, 29, 31, ఫిబ్రవరి 2, 5వ తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
Published date : 19 Jan 2024 01:37PM