Certificate Courses: వ్యవసాయ విద్యకు సర్టిఫికెట్ కోర్సులు.. దరఖాస్తులకు చివరి తేదీ!
గుంటూరు: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని సార్వత్రిక, దూరవిద్యా కేంద్రం ద్వారా వ్యవసాయ విద్య విస్తృత వ్యాప్తికి సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభించినట్టు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ కె.గురవారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల రైతులు, మహిళలు, యువతకు 8 వారాలపాటు ఆన్‌లైన్ ద్వారా నిర్వహించే పలు కోర్సులను ఇప్పటికే ఏప్రిల్ నుంచి ప్రారంభించామని పేర్కొన్నారు.
School Teachers: ఉపాధ్యాయులకు రెండురోజుల శిక్షణ..!
మిద్దె తోటల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, జీవన ఎరువుల తయారీ వంటి మూడు కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని వివరించారు. ఆసక్తిగల వారు రూ.1500 ఫీజు చెల్లించి జూన్ 20లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు www.angrau.ac.in ను సందర్శించాలని, లేదా 8008788776, 8309626619, 8096085560 సెల్ నంబర్ల ద్వారా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ సంప్రదించవచ్చని వివరించారు.
Paytm Layoffs: పేటీఎం ఉద్యోగులకు భారీ షాక్.. త్వరలోనే లేఆఫ్స్