Skip to main content

TSPSC Paper Leak News : ఈ అమ్మాయి కోస‌మే.. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారం సంచలనంగా మారింది. అయితే ఈ పేపర్‌ లీక్ వ్య‌వ‌హారం మరో కొత్త కోణం బయటకు వచ్చింది.
tspsc paper leak news telugu news latest news
tspsc paper leak news

ఈ క్రమంలో హ్యాకింగ్‌ జరగలేదని నిర్ధారణ అయ్యింది. టీఎస్‌పీఎస్సీలో ప‌నిచేసే ఓ ఉ‍ద్యోగి.. ఓ యువతి కోసం పేపర్‌ లీక్‌ చేసినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. పేపర్‌ లీకేజీ ఘటన కేసు దర్యాప్తులో హానీట్రాప్‌ జరిగినట్టు తెలుస్తోంది. టీఎస్‌పీఎస్సీ ఆఫీసుకు ఇటీవల తరచుగా ఓ యువతి రావడాన్ని గమనించారు.

☛➤ టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఆమె కోసమే పేపర్‌ లీక్‌.. కానీ
ప్రవీణ్‌ కోసం సదరు యువతి తరచూ వస్తూ ఆఫీసులో కలుస్తోంది. సదరు యువతి.. టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్‌ కుమార్‌కు గాలం వేస్తూ సన్నిహితంగా ఉంది. ఈ క్రమంలో తనకు పేపర్‌ ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో ఆమె కోసం పేపర్‌ లీక్‌ చేసినట్టు గుర్తించారు. యువతి కోసం టౌన్‌ ప్లానింగ్‌ పేపర్‌ లీకేజీ జరిగిందని అధికారులు నిర్ధారించారు. దీంతో.., నిందితుడు ప్రవీణ్‌ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

టీఎస్‌పీఎస్సీ పరీక్షలు వాయిదా.. ఇంకా..

TSPSC

టౌన్‌ప్లానింగ్, పశు సంవర్థక శాఖ పరిధిలోని వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్షలను టీఎస్‌పీఎస్సీ పరీక్షను వాయిదా వేసింది. పరీక్షల నిర్వహణకు సంబంధించిన సమాచారం బయటకు పొక్కిందనే అనుమానంతో కమిషన్‌ ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకుంది.

☛➤ TSPSC Groups Applications 2023 : గ్రూప్-2, 3, 4 పోస్టులకు ఎంతమంది పోటీ పడుతున్నారంటే...? ఈ కామన్‌ సిలబస్ చ‌దివితే..

ఈ నెల 15, 16వ తేదీల్లో జరగాల్సిన ప‌రీక్ష‌లు కూడా..

tspsc groups exams latest news telugu

మార్చి 12వ తేదీన‌ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. పరీక్ష నిర్వహణకు ముందే దానికి సంబంధించిన సమాచారాన్ని, పరీక్ష తీరును క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఈ మేరకు అభ్యర్థులకు సంక్షిప్త సమాచార రూపంలో రిజిస్టర్డ్‌ ఫోన్‌ నంబర్లకు ఆదివారంనాటి పరీక్ష రద్దు సమాచారాన్ని అందించినట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.

దీంతోపాటు ఈ నెల 15, 16వ తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్‌ కమిషన్‌ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది.

☛➤ TSPSC Exams Postponed 2023 : షాకింగ్ న్యూస్‌.. టీఎస్‌పీఎస్సీ పరీక్షలు వాయిదా.. కార‌ణం ఇదే

Published date : 12 Mar 2023 06:24PM

Photo Stories