Skip to main content

TSPSC Groups Applications 2023 : గ్రూప్-2, 3, 4 పోస్టులకు ఎంతమంది పోటీ పడుతున్నారంటే...? ఈ కామన్‌ సిలబస్ చ‌దివితే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) నిర్వ‌హించే గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్‌-4 ఉద్యోగాల‌కు తీవ్ర పోటీ నెలకొంది! వందల్లో ఉన్న ఈ పోస్ట్‌లకు.. లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.
tspsc groups 2023
tspsc groups 2023 details

అలాగే గ్రూప్-4 పరీక్షలను జూలై 1న నిర్వహించనున్నారు. గ్రూప్-2 పరీక్షలను ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్నారు. గ్రూప్-3 ఉద్యోగాల పరీక్షల తేదీని ప్రకటించాల్సి ఉంది. అలాగే  గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కూడా ముగిసింది. 

Groups Preparation Tips: గ్రూప్స్‌..ఒకే ప్రిపరేషన్‌తో కామన్‌గా జాబ్‌ కొట్టేలా!

ఏ పోస్టుకు ఎంతమంది పోటీ పడుతున్నారంటే...?

tspsc jobs applications

గ్రూప్-2 విభాగంలో 783 పోస్టులకు గాను 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడుతున్నారు. గ్రూప్-3 విభాగంలో 1,375 పోస్టులకు గాను 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు సగటున 390 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గ్రూప్-4 విభాగంలో 8,180 పోస్టులకు గాను 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు సగటున 116 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

చ‌ద‌వండి: Groups Preparation Tips: 'కరెంట్‌ అఫైర్స్‌'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!

గ్రూప్-2, 3, 4 పోస్టులకు కామన్‌ సిలబస్‌తో.. కలిసొచ్చే అంశాలు ఇవే..

గ్రూప్‌-2, 3 అభ్యర్థులకు ప్రధానంగా కలిసొచ్చే అంశం.. ఈ రెండు సర్వీసుల పరీక్షలకు సంబంధించి సిలబస్‌ ఒకే రీతిలో ఉండడం. గ్రూప్‌-2 నాలుగు పేపర్లుగా, గ్రూప్‌-3 మూడు పేపర్లుగా నిర్వహించనున్నారు. రెండు పరీక్షల మధ్య తేడా ఏంటి? అంటే.. గ్రూప్‌-2లో 4 పేపర్లు ఉంటే.. గ్రూప్‌-3లో మూడు పేపర్లే ఉండడమే. గ్రూప్‌-2లో ప్రత్యేకంగా నాలుగో పేపర్‌గా తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం అనే అంశాలతో పరీక్ష ఉంటుంది. ఈ అంశాలను గ్రూప్‌-3లోని పేపర్‌-2, పేపర్‌-3 అంశాలతో సమ్మిళితం చేసుకునే అవకాశం ఉంది.

రెండు పరీక్షల సిలబస్‌లోని అంశాలను సరిపోల్చుకుంటూ..

గ్రూప్‌-2, 3లకు ఉమ్మడి ప్రిపరేషన్‌ సాగించాలనుకునే అభ్యర్థులు రెండు సర్వీసులకు సంబంధించిన సిలబస్‌ను పరిశీలించాలి. ఆ తర్వాత రెండు పరీక్షల సిలబస్‌లోని అంశాలను సరిపోల్చుకుంటూ..ఒకే తరహాలో ఉన్న టాపిక్స్‌పై స్పష్టత తెచ్చుకోవాలి. కామన్‌ అంశాలను ఒకే సమయంలో చదివేలా.. వేర్వేరుగా ఉన్న అంశాలకు నిర్దిష్టంగా ప్రత్యేక సమయం కేటాయించేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. రెండింటిలోనూ ఒకే సిలబస్‌ అంశాలు ఉన్నాయి. కాబట్టి ప్రిపరేషన్‌ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది నిపుణుల అభిప్రాయం.

Also read: TSPSC Group-1 2023: మెయిన్‌లో మార్పులు.. మెరిసే మార్గాలు ఇవే!!

సరితూగే పుస్తకాలు ఇవే..

tspsc groups best books in telugu

ఉమ్మడి ప్రిపరేషన్‌లో భాగంగా అభ్యర్థులు సిలబస్‌కు సరితూగే ప్రామాణిక పుస్తకాలను ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సిలబస్‌కు సంబంధించిన అంశాలన్నీ ఉన్న పుస్తకాలను అన్వేషించి..వాటి ద్వారా ప్రిపరేషన్‌కు ఉపక్రమించాలి. ప్రధానంగా తెలంగాణ ఉద్యమ దశలకు సంబంధించి ప్రత్యేక దృష్టితో వ్యవహరించాలి. మార్కెట్లో ఈ అంశానికి సంబంధించి పదుల సంఖ్యలో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. సిలబస్‌కు అనుగుణంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అన్ని ముఖ్యమైన ఘట్టాలున్న ఒకట్రెండు పుస్తకాలను ఎంచుకోవడం మేలు చేస్తుంది. అదే విధంగా అకాడమీ పుస్తకాలను చదవడం కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

Also read: Groups Preparation 2023: సొంత నోట్సు.. సక్సెస్‌కు రూటు

అభ్యర్థులు ప్రిపరేషన్‌ సమయంలో..

సిలబస్‌పై స్పష్టతతోపాటు, పుస్తకాలను ఎంపిక చేసుకున్న అభ్యర్థులు.. విశ్లేషణాత్మక అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. వాస్తవానికి గ్రూప్‌-2, 3 రెండు పరీక్షలు పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో, బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఉంటాయి. కాని అభ్యర్థులు ప్రిపరేషన్‌ సమయంలో డిస్క్రిప్టివ్‌ విధానంలో చదువుతూ.. ఆయా అంశాలపై పూర్తి స్థాయి పట్టు సాధించాలి. అంతేకాకుండా ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్‌ చదివేలా సమయ పాలన పాటించాలి. 

పరీక్షలో విజయం కోసం..

అభ్యర్థులు ప్రిపరేషన్‌లో భాగంగా సమగ్ర అధ్యయనం కొనసాగించాలి. ఒక టాపిక్‌కు సంబంధించి నిర్వచనం మొదలు తాజా పరిణామాలకు వరకూ.. సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలి. అదే విధంగా నిర్దిష్టంగా ఒక టాపిక్‌ను వాస్తవ పరిస్థితుల్లో అన్వయించే విధంగా చదవాలి. పరీక్షలో విజయం కోసం నిర్ణయాత్మక సామర్థ్యం, సమస్య పరిష్కార నైపుణ్యం పెంచుకోవాలి.

అభ్యర్థులు అనుసరించాల్సిన మరో వ్యూహం..

ప్రిపరేషన్‌ విషయంలో అభ్యర్థులు అనుసరించాల్సిన మరో వ్యూహం.. అనుసంధాన దృక్పథం. రెండు పరీక్షల్లోని ఉమ్మడి అంశాలను గుర్తించి.. వాటిని అనుసంధానం చేసుకుంటూ చదవాలి. జనరల్‌ స్టడీస్, కరెంట్‌ అఫైర్స్, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్, భారత రాజ్యాంగం విధానం, పరిపాలన, ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌.. ఇలా అన్ని అంశాలను అనుసంధానం చేసుకుంటూ చదివే వీలుంది. అభ్యర్థులు ప్రతి రోజు సగటున 8 నుంచి 10 గంటల సమయం ప్రిపరేషన్‌కు కేటాయించేలా టైమ్‌ టేబుల్‌ రూపొందించుకోవాలి.

పరీక్ష కోణంలో ఏ అంశాన్ని వదలకుండా..

జాతీయం నుంచి స్థానికం వరకూ.. పరీక్ష కోణంలో ఏ అంశాన్ని వదలకుండా చదవాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రాధాన్యమున్న అంశాలను ఔపోసన పట్టాలి. తెలంగాణ ఉద్యమ దశలు, తెలంగాణ ఆవిర్భావ దశ, మలిదశ ఉద్యమంలో ముఖ్యమైన ఘట్టాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా తెలంగాణ చరిత్రలో తెలంగాణ సామాజిక ముఖ చిత్రాన్ని తెలియజేసే అన్ని అంశాలను చదవాలి. సాహిత్యం, కళలు, కవులు, సంస్థానాలు, భౌగోళిక స్వరూపం,వనరులు, ప్రభుత్వ పథకాలు, తెలంగాణ ఏర్పాటైన తర్వాత అమలు చేస్తున్న కొత్త పథకాలు.. ఇలా అన్ని అంశాలపై దృష్టి పెట్టాలి.

చ‌ద‌వండి: Groups Preparation 2023: సొంత నోట్సు.. సక్సెస్‌కు రూటు

సొంత నోట్స్‌ ఇలా రాసుకుంటే..

అభ్యర్థులు ఆయా విభాగాలను చదువుతున్నప్పుడే.. ముఖ్యమైన అంశాలను పాయింట్ల వారీగా నోట్స్‌ తయారు చేసుకోవాలి. అదే విధంగా అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి. ఉదాహరణకు సామాజిక వర్గాలనే పరిగణనలోకి తీసుకుంటే.. ఆయా వర్గాల నిర్వచనానికే పరిమితం కాకుండా.. వాటి ఆవిర్భావ చరిత్ర, విస్తరణ, తాజా పరిస్థితులు.. ఇలా అన్నింటి గురించి తెలుసుకోవాలి. అప్పుడే సదరు టాపిక్‌పై సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది. మతాలు, సామాజిక వర్గాలు, గిరిజన సమస్యలు, ప్రాంతీయ సమస్యలు వంటి స్థానిక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

అడిగే ప్రశ్నలు..

జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సామాజిక సమస్యలు, వాటిపై ప్రభుత్వాలు చేసిన విధానాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ విధానాలపై ప్రభుత్వ డాక్యుమెంట్లు ఉన్నాయి. వీటిపై తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలి. ఇందులో మహిళా సాధికారత వంటివి ముఖ్యమైనవి. మహిళల సాధికారత కోసం జాతీయస్థాయిలో రకరకాల పథకాలు తెచ్చారు. మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, గిరిజన సంక్షేమం కోసం విధానాలు రూపొందించారు. అదే విధంగా పలు నూతన పాలసీలు రూపొందుతున్నాయి. వాటి గురించి కూలంకషంగా అధ్యయనం చేయాలి. 

పోటీప‌రీక్ష‌ల బిట్స్‌ కోసం క్లిక్ చేయండి

నూతన విధానాలపై..

తెలంగాణ ప్రత్యేక ప్రాధాన్యం ఉన్న అంశాలపై పరీక్షలో కొన్ని ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా తెలంగాణ పాలసీలపై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా తెలంగాణ ఏర్పాటు,దానికి సంబంధించి ప్రధాన డి­మాండ్లుగా పేర్కొన్న నీళ్లు..నిధులు.. నియామకా­లు.. వంటి అంశాలపై ఎలాంటి విధానాలు తె­చ్చారన్నది తెలుసుకోవాలి. రాష్ట్రంలో ఆయా వ­ర్గా­ల కో­సం అమలు చేస్తున్న నూతన విధానాలపై అవగాహన పెంచుకోవాలి. వెనుకబడిన తరగతు­లు, మై­నారిటీలు,గిరిజనులకు సంబంధించి రూ­పొందించిన పథకాల గురించి తెలుసుకోవాలి. పర్యావరణంపై తెలంగాణకు హరితహారం పాలసీ తెచ్చారు.

Success Story: వేలల్లో వచ్చే జీతం కాద‌నీ.. నాన్న కోరిక కోసం గ్రూప్-2 సాధించానిలా..

గ్రూప్‌-2.. పేపర్‌-4 ప్రత్యేకంగా..

అభ్యర్థులు ప్రత్యేకంగా సమయం కేటాయించి నైపుణ్యం సాధించాల్సిన పేపర్‌.. గ్రూప్‌-2లోని నాలుగో పేపర్‌. 'తెలంగాణ ఆలోచన(1948-1970),ఉద్యమ దశ (1971-1990), తెలంగాణ ఏర్పా­టు దశ, ఆవిర్భావం(1991-2014)) అంశాలకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. ముఖ్యంగా సిలబస్‌లో నిర్దేశించిన ప్రకారం-1948 నుంచి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు.. జరిగిన ముఖ్య ఉద్యమాలు, ఒప్పందాలు, ముల్కీ నిబంధనలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు-వాటి సిఫార్సులు వంటి వాటిని అధ్యయనం చేయాలి. దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా రూపొందించిన పునర్‌ వ్యవస్థీకరణ బిల్లులో తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా పొందుపరచిన అంశాలు; తెలంగాణ రాష్ట్రానికి కల్పించిన హక్కులపై దృష్టి సారించాలి.

తెలంగాణపై ఫోకస్‌..

తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ పేరుతో ప్రత్యేకంగా 
ఉన్న అంశాలపై మరింత లోతైన అవగాహన ఏర్పరచుకుంటే మార్కులు పెంచుకునే అవకాశం ఉంది. చరిత్రలో తెలంగాణలో రాజులు, ముఖ్య యుద్ధాలు, ఒప్పందాలు, తెలంగాణలోని కవులు-రచనలు; కళలు; ముఖ్య కట్టడాలు-వాటిని నిర్మించిన రాజులు తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అదే విధంగా స్వాతంత్య్రోద్యమ సమయంలో తెలంగాణ ప్రాంత ప్రమేయం ఉన్న సంఘటనలపై అవగాహన ఏర్పరచుకోవాలి. తెలంగాణలోని ముఖ్యమైన నదులు-పరీవాహక ప్రాంతాలు; ముఖ్యమైన పంటలు; భౌగోళిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలపై దృష్టి పెట్టాలి. దీంతోపాటు తెలంగాణ భౌగోళిక స్వరూపం, విస్తీర్ణం,జనాభా వంటి అంశాలపై అవగాహన అవసరం. ఎకానమీలో తెలంగాణ స్థూల రాష్ట్రీయోత్ప­త్తి, ముఖ్యమైన పథకాలు, 2011 జనాభా గణాంకాలు; ముఖ్యమైన పరిశ్రమలు -ఉత్పత్తిదాయకత, రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరులపై అవగాహన పెంచుకోవాలి. తాజా బడ్జెట్‌ గణాంకాలు, ఆయా శాఖ­లు, పథకాలకు కేటాయింపులపై పట్టు సాధించాలి. 

ప్రాక్టీస్‌ టెస్ట్‌లకు..

గ్రూప్‌-2, గ్రూప్‌-3 అభ్యర్థులు ప్రిపరేషన్‌ సమయంలో ప్రాక్టీస్‌ టెస్ట్‌లు, మోడల్‌ టెస్ట్‌లకు హాజరవడం మేలు చేస్తుంది. దీనివల్ల ఆయా సబ్జెక్ట్‌లలో తమకు అప్పటి వరకు లభించిన పరిజ్ఞాన స్థాయిపై అవగాహన లభిస్తుంది. ఇంకా చదవాల్సిన అంశాల విషయంలో స్పష్టత వస్తుంది. అదే విధంగా తాము చేస్తున్న పొరపాట్లను విశ్లేషించుకుని.. వాటిని సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది.

రివిజన్ ఇలా..

గ్రూప్‌-2, 3 సర్వీసుల ఉమ్మడి అభ్యర్థులు.. కేవలం ప్రిపరేషన్‌కే కాకుండా..పునశ్చరణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ఆయా పరీక్ష తేదీలకు నెల రోజుల ముందు నుంచి పూర్తిగా రివిజన్‌కు సమ­యం కేటాయించుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇలా.. ఉమ్మడి అంశాలను, ప్రత్యేక అంశాలను పరిశీలించుకుని.. పేపర్‌ వారీగా నిర్దిష్ట ప్రణాళికతో అడుగులు వేస్తే ఒకే సమయంలో గ్రూప్‌-2, 3లకు సన్నద్ధత పొందే ఆస్కారం లభిస్తుంది.

గ్రూప్‌-2, గ్రూప్‌-3 ఉమ్మడి ప్రిపరేషన్‌ ఇలా..

  • దాదాపు ఒకే రీతిలో గ్రూప్‌-2, గ్రూప్‌-3 సిలబస్‌.
  • గ్రూప్‌-2లో ప్రత్యేకంగా నాలుగో పేపర్‌.
  • రెండు పరీక్షలకు ఒకే సమయంలో సన్నద్ధమయ్యే వీలు.
  • సిలబస్‌ బేరీజు వేసుకుంటూ.. ప్రత్యేక అంశాలకు నిర్దిష్టం సమయంలో ప్రిపరేషన్‌.
  • పరీక్షకు నెల రోజుల ముందు నుంచి రివిజన్‌కు ప్రత్యేక ప్రాధాన్యం. 
  • షార్ట్‌ నోట్స్, రెడీ రెకనర్స్‌తో రివిజన్‌ వేగంగా పూర్తి చేసుకునే అవకాశం

 

☛➤ Success Story: ఫ‌స్ట్ ర్యాంక్ సాధించా .. ఆర్‌టీఓగా ఉద్యోగం కొట్టా..

☛➤ DSP Snehitha : గ్రూప్‌–1కు సెలక్టయ్యానిలా...ముగ్గురం ఆడపిల్లలమే..అయినా

☛➤ గ్రూప్‌–1 కిరీటం.. రాష్ట్రస్థాయిలో ఫ‌స్ట్ ర్యాంక్‌.. ఆర్‌టీఓగా ఉద్యోగం

☛➤ Group-2 Job:మొదటి ప్రయత్నంలోనే విజయం..గ్రూపు–2లో ఉద్యోగం..ఎలా అంటే..

☛➤ గ్రూప్‌–1 కిరీటం.. రాష్ట్రస్థాయిలో ఫ‌స్ట్ ర్యాంక్‌.. ఆర్‌టీఓగా ఉద్యోగం

☛➤ కూలీ ప‌నిచేస్తూ..ఎక్సైజ్‌ ఎస్సై ఉద్యోగం కొట్టానిలా..

Published date : 10 Mar 2023 07:03PM

Photo Stories