TSPSC Jobs Notification : ఫారెస్ట్ కాలేజ్‌లో ప్రొఫెసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : ములుగు జిల్లాలోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో వివిధ కేటగిరీల్లో 27 ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆగస్టు 22వ తేదీన (సోమవారం) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు ఆసక్తి ఉన్న అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి సెప్టెంబర్ 6వ తేదీ నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. దరఖాస్తులకు సంబంధించిన నిబంధనలు, ఇతర అంశాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ప్రస్తుతం ప్రకటించిన 27 పోస్టుల్లో ప్రొఫెసర్ పోస్టులు–2, అసోసియేట్ ప్రొఫెసర్–4, అసిస్టెంట్ ప్రొఫెసర్–21 పోస్టులున్నాయి.
చదవండి: Indian Polity Notes for Competitive Exams: రాజ్యాంగ వికాసంలో భాగమైన చట్టాలు..
Published date : 23 Aug 2022 06:40PM