Inter Student Success Story : నా చదువుకు పేదరికం అడ్డు కాలేదు.. కానీ చాలా సార్లు ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో..
ఇదే కోవలో చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు ఖమ్మం బోనకల్ మండలానికి చెందిన విద్యార్థి. ఆళ్లపాడుకు చెందిన వడ్డెబోయిన వెంకటేశ్వర్లు–లక్ష్మి దంపతుల కుమారుడు నిఖిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల విభాగంలో ఎంపీసీలో వెయ్యి మార్కులకు గాను 984 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచాడు.
➤☛ Success Story : నాకు అమ్మానాన్న లేరు.. కానీ అమ్మ చివరి కోరిక మాత్రం తీరుస్తా..
ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో..
మండలంలోని మారుమూల గ్రామమైన ఆళ్లపాడు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తిచేశాక ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే చేరాడు. సెంట్ భూమి కూడా లేని నిరుపేద కుటుంబంలో పుట్టిన నిఖిల్ కష్టపడి చదివి జిల్లాలోనే ప్రథమ స్థానం నిలవడం విశేషం. కాగా, ఆయన తండ్రి వెంకటేశ్వర్లు మానసిక పరిస్థితి సక్రమంగా లేకపోవడంతో తల్లి లక్ష్మి కూలీ పనులు చేస్తూ కుమారుడిని చదివించగా ఆయన మట్టిలో మాణిక్యంలా మెరవడంపై గ్రామ స్తులు అభినందించారు.
☛➤ Success Story : 600కు 600 మార్కులు.. ఓ బాలిక రికార్డ్ సృష్టించిందిలా..
మా నాన్న లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ..
సత్తుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ ద్వితీయ సంవత్సరం హెచ్‌ఈసీ విద్యార్థిని దాసరి సిరి వెయ్యి మార్కులకు గాను 972మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. ఇంటర్ మొదటి సంవత్సరంలోనూ ఆమె 500మార్కులకు 489మార్కులతో టాపర్‌గా నిలవడం విశేషం. ఆమె తండ్రి దాసరి ధర్మయ్య లారీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, తల్లి స్వప్న గృహిణి.
అద్దె ఇంట్లోనే నివాసముండే వీరు పిల్లల భవిష్యత్ కోసం ఎంత కష్టానైనా సంతోషంగా ఆస్వాదిస్తామని చెబుతున్నారు. ఏ రోజు పాఠాలు ఆరోజే చదవడం, అధ్యాపకుల బోధనతో ఈ విసయం సాధ్యమైందని సిరి వెల్లడించింది. ఇక ఆమె తమ్ముడు వేదరాజు సత్తుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే మొదటి సంవత్సరం హెచ్‌ఈసీలో 378 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలవడం విశేషం.
నా లక్ష్యం ఇదే..
నా పేరు తప్పేట రోహిణి. నాకు ఇంటర్‌లో 990 మార్కులు వచ్చాయి. మొదటి నుంచి శ్రద్ధగా చదువుకొని డాక్టర్ అయి పేదలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం. ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్య అందుతుందనే నమ్మకంతో ఖమ్మంలోని ఏఎస్‌ఆర్ శాంతినగర్ జూనియర్ కళాశాలలో చేరాను. కళాశాలలో నాణ్యమైన అందుతుండటం.. ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించటంతో పాటు అధ్యాపకులు, తల్లిదండ్రుల సహకారం కలిసొచ్చింది. నాన్న రైతు కాగా, అమ్మ ప్రైవేట్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా విధులు నిర్వర్తిస్తూ నన్ను చదివించారు.
మా తల్లిదండ్రులు కష్టంతోనే..
నా పేరు పరికపల్లి రాజేష్. కృష్ణవేణి జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివాను. ఇంటర్ ఎంపీసీలో 994మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవటం ఆనందంగా ఉంది. ఇంజనీరింగ్ మంచి కళాశాలలో సీటు సాధించి సివిల్ ఇంజనీరింగ్ చేశాక సమాజానికి ఉపయోగపడేలా ఉండాలనేది నా ఆకాంక్ష. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలుకు చెందిన మా తల్లిదండ్రులు కష్టమే నేను ఇంతటి మార్కులు సాధించేందుకు సహకరించింది. భవిష్యత్‌లో మరింత మంచి పేరు తెచ్చుకుంటాను.
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకూ జరిగిన విషయం తెల్సిందే. మొదటి సంవత్సరం పరీక్షలకు 4,82,501 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 4,23, 901 మంది హాజరయ్యారు. మొత్తం 9,48,010 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
➤ Tenth Class Students Success Stories : నిరుపేద కుటుంబం.. తండ్రి మరణంతో.. జీవనోపాధి కోసం..