Inter Students Success Stories : డబ్బులు లేక మా నాన్నను బతికించుకోలేకపోయాము.. మా అమ్మ కూలీనాలి చేస్తూ..
అత్యున్నతమై ప్రభుత్వ కొలువులు సాధించి ప్రజాసేవ చేస్తామని పేర్కొంటున్నారు. తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలను మే 9వ తేదీన చేసిన విషయం తెల్సిందే.
పేదరికం కారణంగా..
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం తునికిమూతలతండాకు చెందిన కొర్ర దేవునాయక్, కంశ దంపతుల కుమార్తె లావణ్య పేదరికాన్ని జయించింది. తండ్రి డోజర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
➤ Tenth Class Students Success Stories : నిరుపేద కుటుంబం.. తండ్రి మరణంతో.. జీవనోపాధి కోసం..
పేదరికం కారణంగా లావణ్య ఐదవ తరగతి నుంచి చౌటుప్పల్‌లోని తెలంగాణ బాలికల గురుకులంలో చేరింది. ఇంటర్ బైపీసీలో 990 మార్కులు సాధించి చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది. తాను పెద్దయ్యాక గైనిక్ విభాగంలో పెద్ద డాక్టర్‌గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. కలను సాకారం చేసుకుంటానని పేదలకు సేవ చేస్తానని లావణ్య చెబుతోంది. తల్లిదండ్రులు, ప్రిన్సిపాల్, అధ్యాపకుల సహకారంతో ఈ ఘనత సాధించానని గుర్తు చేసుకుంది.
నా లక్ష్యం ఇదే.. : అయేషాఫిర్దోస్
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యనభ్యసించిన పట్టణానికి చెందిన అయేషాఫిర్దోస్ ఇంగ్లిషు మీడియం హెచ్‌ఈసీ విభాగంలో 476/500 మార్కులు సాధించింది. మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు షేక్ ఖాజా హసీనాలకు ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు అయేషా మొదటి నుంచి చదువుపై మక్కువతో పట్టుదలతో చదివి ప్రతిభను ప్రదర్శించింది. ప్రభుత్వ కళాశాలలో సైతం ఇంత మంచి బోధన అందించిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపింది.
భవిష్యత్తులో కలెక్టర్ కావాలనే లక్ష్యంతోనే..
భవిష్యత్తులో సివిల్స్ లేదా న్యాయ శాఖలో ఉద్యోగం సాధించేందుకు ఇంటర్మీడియట్‌లో హెచ్‌ఈసీ విభాగాన్ని ఎంచుకున్నా. కొన్ని అనివార్య కారణాలతో ఇంటర్మీడియట్‌లో ప్రవేశం ఆలస్యమైంది. ఉన్న కొద్ది సమయంలోనే కష్టపడి చదివా. భవిష్యత్తులో చదువును కొనసాగించి నేను అనుకున్న లక్ష్యాన్ని నేరవేర్చుకుంటా.
మోటకోండూర్ మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మహ్మద్ అబీబ్, రజీయాభేగం దంపతుల కుమార్తె ఆయోషా భేగం. పట్టణంలోని శ్రీ వైష్ణవి జూని యర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతుంది. మంగళవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో 468/470 మార్కులు సాధించింది. రాష్ట్ర స్థాయిలో నిలిచే విధంగా మార్కులు సాధించిన విద్యార్థి పేద కుటుంబానికి చెందినది. భవిష్యత్తులో కలెక్టర్ కావాలనే లక్ష్యంతోనే రోజుకు 15 నుంచి 16 గంటల పాటు చదువుతున్నానని పేర్కొంటోంది. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతోనే ప్రతిభ చూపినట్లు పేర్కొంటోంది.
కరోనాతో తండ్రి మరణం.. తల్లి సుశీల కూలీనాలి చేసుకుంటూ..
ఆత్మకూర్.ఎస్ మండలం పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన కొమ్ము యాదయ్య –సుశీల కుమార్తె ప్రశాంతి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివింది. మే 9వ తేదీన వెలువడిన ఫలితాల్లో బైపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 979మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచింది. ప్రశాంతి తండ్రి యాదయ్య కరోనా సోకి మరణించారు. తండ్రి చనిపోయినా తన తల్లి సుశీల కూలీనాలి చేసుకుంటూ కూతురును ఇంటర్మీడియట్ చదివించింది. ప్రశాంతి అధైర్యపడకుండా ప్రభుత్వ కళాశాలలో చదివి ఉత్తమ మార్కులు సాధించి టాపర్‌గా నిలిచి పలువురికి ఆదర్శంగా నిలిచింది.
డబ్బులు లేక మా నాన్నను బతికించుకోలేకపోయాము.. కానీ..
భవిష్యత్‌లో డాక్టర్ అవ్వడమే నా లక్ష్యం. నీట్ పరీక్ష కూడా రాశాను. తన తండ్రి కరోనాతో చనిపోయారు. డబ్బులు లేక మా నాన్నను బతికించుకోలేకపోయాము. మానాన్న లాంటి పరిస్థితి ఎవరికి రాకుండా డాక్టర్ అయి పేద వారికి తనవంతు సహాయం చేస్తాను. తన తల్లి కూలీ పని చేసుకుంటూ నన్ను చదివిస్తుంది. కళాశాలలో ప్రిన్సిపాల్, అధ్యాపకుల ప్రోత్సహం ఎంతగానో ఉంది.
☛ 10th Class Exam: పుట్టెడు దుఃఖంలోనూ విజేతలుగా నిలిచారు
ఐఏఎస్ కావడమే లక్ష్యంగా..
దేవరకొండ పట్టణ కేంద్రానికి చెందిన పేద కుటుంబీకుడైన విగ్రహాల కరుణాకర్–నీరజ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు. కరుణాకర్ వెల్డింగ్ పని చేస్తుంటాడు. పిల్లలను మాత్రం ఉన్నంతలో ఏ లోటూ రాకుండా బాగానే చదివిస్తున్నాడు. చిన్న కుమార్తె గాయిత్రి చౌటుప్పల్‌లోని గురుకులంలో ఇంటర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతుంది. మే 9వ తేదీన వెలువడిన ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 466 మార్కులు సాధించింది. కలెక్టర్ కావడమే లక్ష్యంగా కఠోరమైన సాధన చేసి చక్కటి ప్రతిభతో అందరితో శభాష్ అనిపించుకుంది. ఎన్ని ఇబ్బందులెదురైనా కలెక్టర్ కావాలన్న తన లక్ష్యాన్ని చేరుకుంటానని గాయిత్రి ధీమాగా ఉంది.