Inter Student Inspire Story : ఒక వైపు మరణంతో పోరాటం చేస్తూ.. మరో వైపు ఇంటర్‌లో 927 మార్కులతో స్టేట్ 4th కొట్టిందిలా.. కానీ..
ఈమె తెలంగాణలోని పెద్దపల్లికి జిల్లా గోదావరిఖనికి చెందిన కూనరపు సిరి. చదువు కోవాలన్న పట్టుదల ఉన్నవారికి దేవుడు అన్ని వేళలా దీవెనలు అందిస్తాడు. అంగవైకల్యం ఉన్నా.. అనారోగ్యంతో బాధపడుతున్నా.. చదువుకోవాలన్న కృషీ, పట్టుదల ఉన్నవారికి చదువుల తల్లి వెన్నంటే ఉంటుంది. ఎంతోమంది పేదరికంలో ఉన్న పట్టుదలతో చదివి టాపర్ ర్యాంకులు తెచ్చుకుంటున్నారు.
వారానికి రెండు సార్లు డయాలసీస్.. కానీ
సిరికి.. రెండు కిడ్నీలు పూర్తిగా పాడైనా.. వారానికి రెండు సార్లు డయాలసీస్ చేసుకోవాల్సి వస్తున్నా.. ఒంట్లో ఎలాంటి సత్తువ లేక కాలేజ్‌కి వెళ్లకున్నా.. మొక్కవోని పట్టుదలతో సెల్ ఫోన్ ద్వారా అద్యాపకులు, స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహంతో సబ్జెక్ట్స్‌పై అవగాణ పెంచుకొని ఏకంగా 927 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచి అందరిచే శభాష్ అనిపించుకుంది ఓ పేదింటి ఆడబిడ్డ.
ఐదేళ్లుగా..
కూనరపు సిరి ఇంటర్‌లో సీఈసీలో 927 మార్కులు సాధించి సత్తా చాటి అందరికీ ఆదర్శంగా నిలిచింది. అయితే సిరిది అందరి అమ్మాయిల పరిస్థితి కాదు. ఐదేళ్లుగా కిడ్ని వ్యాధితో బాధపడుతుంది. 8 నెలల క్రితం రెండు కిడ్నీలు పూర్తిగా విఫలం కావడంతో వారినికి రెండు రోజులు డయాలసీస్ చేయించుకోవాల్సి వస్తుంది. అయినా మొక్కవోని దీక్షా, పట్టుదలతో చదివి మంచి మార్కులు సాధించింది.
ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజ్‌లో చదివి..
గోదావరి గని శారదానగర్‌లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజ్‌లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదివిన కూనరపు సిరి.. సీఈసీలో 927 మార్కులు సాధించి కాలేజ్ టాపర్‌గా నిలిచింది.
కుటుంబ నేపథ్యం :
గోదావరి గని ఎన్టీపీసీ కృష్ణనగర్‌కి చెందిన కూనారపు పోశం, వెంకట లక్ష్మి దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. స్థానికంగా సెంట్రింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు పోశం. పెద్ద కూతురు సిరి ఐదేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతుంది. ఎన్నో ఆసుపత్రులు తిరిగి వైద్యం చేయించారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు.
మంచానికే పరిమితం..
దాదాపు 8 నెలల క్రితం సిరి కిడ్నీలు పూర్తిగా పనిచేయకుండా పోయాయి. ప్రస్తుతం సిరికి వారానికి రెండు సార్లు రక్త శుద్ది చేయించుకుంటూ మంచానికే పరిమితమైంది. తనకు ఆరోగ్యం బాగా లేకున్నా చదువుకోవాలన్న పట్టుదల ఆమెలో ఏమాత్రం తగ్గలేదు. సిరి పరిస్థితి తెలుసుకున్న కాలేజ్ ప్రిన్సిపల్, అధ్యాపక బృందం పాఠ్యాంశాలను ఫోన్ లో బోధించి స్నేహితుల ద్వారా చేరవేస్తూ వచ్చారు. ఏదైనా సబ్జెక్ట్ లో అనుమానం ఉంటే మెసేజ్ ద్వారా సందేహాలను నివృతి చేసేవారు.
మంచి మనస్సు ఉన్న దాతలు స్పందించి..
మరోవైపు సిరి పట్టుదల చూసి తల్లిదండ్రులు ఆమెకు అన్నివిధాలుగా సహకరిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఇటీవలే విడుదలైన ఇంటర్ ఫలితాల్లో సిరి 927 మార్కులు సాధించి కాలేజ్ టాపర్‌గా రాణించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. తమ కూతురు కిడ్నీ మార్పిడి వైద్య చికిత్సకు ప్రభుత్వం ఆదుకోవాలని, దాతలు స్పందించి చేయూతనివ్వాలని తండ్రి పోశం విజ్ఞప్తి చేశారు. నేటి ఎంతో మంది విద్యార్థులు కూనరపు సిరి జీవితం ఎంతో స్ఫూర్తిధాయకం.
Tags
- Inter Student Inspire Story in Telugu
- Inter Student Siri Got Good Marks
- Inter Student Siri Got Good Marks In Inter
- Kunarapu Siri Inter Student Story
- Kunarapu Siri Inter Student Story Inspire Story
- Kunarapu Siri Inter Student Story Real life Story
- Kunarapu Siri Suffering From Kidney Disease
- Kunarapu Siri Get 927 marks in Inter CEC
- Kunarapu Siri Godavarikhani Story
- Kunarapu Siri Godavarikhani Inter Student
- InterResults
- GoalOriented
- Inspiring Story
- sakshieducation success stories