Skip to main content

Inter Student Banothu Kusuma Story : బాల్య‌వివాహాం నంచి బ‌య‌ట‌ప‌డి.. ఇంట‌ర్ ఫలితాల్లో స్టేట్‌ 4th కొట్టిందిలా.. కానీ..

ఇటీవ‌లే విడుద‌ల చేసిన ఏపీ, తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల్లో ఎంద‌రో పెదింటి బిడ్డ‌లు త‌మ స‌త్తాచాటారు. అలాగే చిన్న‌త‌నంలోనే నిరాధ‌ర‌ణ‌కు గురైన విద్యార్థులు టాప్ మార్కులు సాధించారు. మేము ఆర్థికంగా పేద‌వాళ్ల‌ము కావ‌చ్చుఏమో కానీ.. చ‌దువుల్లో సంప‌న్నుల‌మే అని నిరూపించారు.
Banothu Kusuma Kumari

చదువుకోవాలన్న బ‌ల‌మైన సంక‌ల్పం ఉండాలే కానీ.. అనారోగ్యం, అంగవైకల్యం అడ్డురావు అని నిరూపించారు కొంత మంది ఇంటర్, పదో తరగతి విద్యార్థులు. 

☛ Actress Samantha : ఈ విద్యార్థినిపై ప్రశంసలు కురిపించిన స్టార్‌ హీరోయిన్ సమంత.. ఎందుకంటే..?

inter student niramal success story in telugu

పేదరికంలో పుట్టి, ప్రభుత్వ బడులు, కాలేజీల్లో చదువుతూ మంచి మార్కులు సాధిస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు నిజంగా సరస్వతి పుత్రికలే అని నిరూపిస్తున్నారు. సమాజంలో ఉన్న సవాళ్లను ఎదుర్కొని మరీ.. చదువుల్లో రాణిస్తున్నారు. వ‌య‌స్సుకు వ‌చ్చిన అమ్మాయికి పెళ్లి చేసి పంపించేయాలని ఆలోచిస్తున్న తమ తల్లిదండ్రులను ఎదిరించి మరీ చదువుకుని పాస్ కావడమే కాదు.. ర్యాంకర్లుగా నిలుస్తున్నారు. ఇటీవ‌లే కర్నూల్ జిల్లా ఆదోనీ మండలానికి చెందిన నిర్మల బాల్య వివాహాన్ని ఎదిరించి.. చదువే ముఖ్యమని భావించి.. ఇంటర్‌లో జాయిన్ అయ్యింది. ఇటీవల ఏపీ ఇంటర్మీడియట్ విడుదల చేసిన ఫలితాల్లో బైపీసీలో తొలి ర్యాంక్ సాధించింది. ఆమెకు ఫస్ట్ ఇయర్ లో 440కి గానూ 421 మార్కులు వచ్చిన సంగతి విదితమే. 

ఓ మారుమూల ప్రాంతానికి చెందిన‌..
ఇప్పుడు తెలంగాణ‌కు చెందిన మరో అమ్మాయి.. బాల్య‌వివాహాం అడ్డుకుని.. ఇంట‌ర్ ఫలితాల్లో నాలుగో ర్యాంకర్‌గా నిలిచింది. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలోని మారుమూల ప్రాంతానికి చెందిన బానోతు కుసుమ కుమారి.. ఆడ పిల్ల పుడితేనే భారం అని భావించే కుటుంబంలో పుట్టింది. ఆర్థిక సమస్యలు, కుటుంబ పరిస్థితులు సహకరించకపోయినా బాగా చదివేది. కానీ ఆమెకు పద్నాలుగేళ్లకే పెళ్లి చేసేయాలని అనుకున్నారు తల్లిదండ్రులు. చదువుకుంటాను అని చెప్పినా.. వినిపించుకోకుండా పెళ్లికి ఏర్పాట్లు చేశారు. 

ఆ పెళ్లిని..

Banothu kusuma kumari real life story in telugu

ఆ వయస్సులో ఎంతో ధైర్యంతో ముందడుగు వేసింది. ఈ పెళ్లి ఆపేయాలన్న ఉద్దేశంతో 1098కి ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న ఐసీడీఎస్, చైల్డ్ లైన్ సభ్యులు ఆ పెళ్లిని నిలిపేశారు. తనకు బాగా చదువుకోవాలని ఉందని, నర్సు అవుతానని చెప్పడంతో మణుగూరులోని చిల్ట్రన్స్ హోమ్‌కు పంపించారు. ఆ తర్వాత ములకపల్లి కస్తూర్బా గాంధీ బాలికా విద్యా సంస్థలో చేర్పించారు.

☛ Inter Student Success Story : పేద‌రికంతో చదువు ఆపేసిన ఈ అమ్మాయి.. ఈ కలెక్టర్ చ‌లువ‌తో.. జిల్లాలో టాపర్‌గా నిలిచిందిలా.. కానీ..

వేసవి సెలవుల్లో సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలోని చిల్డ్రన్ హోంలో, పని దినాల్లో కళాశాల హాస్టల్లో ఉంటూనే ఇంటర్ చదివింది. ఇటీవల విడుద‌ల‌ చేసిన ఇంట‌ర్‌ ఫలితాల్లో 978 మార్కులతో రాష్ట్ర స్థాయిలో నాల్గోవ‌ ర్యాంక్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. అలాగే కేజీబీవీ కళాశాల పరిధిలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం మ‌రో విశేషం. 

అంతేకాదు.. పెళ్లి చేసి భారం దించుకుందామనుకున్న తల్లిదండ్రులకు పేరు తెచ్చింది. ఊరి పేరు నిలబెట్టింది కుసుమ కుమారి. కుసుమ కుమారి గ‌ట్టిగా పోరాడింది.. ఒక బ‌ల‌మైన సంకల్పంతో గ‌ట్టిగా నిల‌బ‌డింది. అలాగే చివ‌రికి అంద‌రు ఆశ్చర్య‌పోయేలా గెలిచి.. స‌రైన స‌మాధానం చెప్పింది. ఈ విద్యార్థుల‌కు ఈ బానోతు కుసుమ కుమారి జీవితం ఎంతో ఆద‌ర్శం.

☛ Twin Sisters Got Same Marks in 10th and Inter : విచిత్రం అంటే ఇదే ఏమో.. ఈ కవల అక్కాచెల్లెళ్లు.. ఇంట‌ర్‌లో 620/625 ఒకే మార్కులు.. టెన్త్‌లో కూడా..

Published date : 29 Apr 2024 05:26PM

Photo Stories