Tenth Class Students Success Stories : నిరుపేద కుటుంబం.. తండ్రి మరణంతో.. జీవనోపాధి కోసం..
ప్రైవేట్‌కు దీటుగా ఉత్తమ జీపీఏ సాధించి అందరి మన్ననలు పొందుతున్నారు. భవిష్యత్‌లో ఉన్నత చదువులను ఇదే తరహాలో అభ్యసించి తామెంటో నిరూపించుకుంటామని చెబుతున్నారు.
నిరుపేద కుటుంబం.. తండ్రి మరణంతో..
నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం ఎర్రచెరువు తండాకు చెందిన రమావత్ సర్దార్, శారద దంపతులది నిరుపేద కుటుంబం. వీరికి ఇద్దరు కుమారులు. అందులో చిన్న కుమారుడైన సాయికుమార్ పెద్దవూర మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివాడు. సాయికుమార్ ప్రతిభను గుర్తించిన పాఠశాల ఉపాధ్యాయులు మొదటి నుంచి ప్రోత్సహిస్తూ వచ్చారు. దీంతో మే 10వ తేదీన (బుధవారం) విడుదలైన ఫలితాల్లో సాయికుమార్ 10జీపీఏ సాధించాడు.
☛ SSC 2023: కవలలకు 10 జీపీఏ.. ఆడపిల్లలని పుట్టగానే తండ్రి వదిలేశాడు..
నా లక్ష్యం ఇదే..
తన తల్లి పెద్దవూరలో చిన్నపాటి పని చేసుకుంటూ పిల్లలను పోషిస్తుంది. సాయి కుమార్ తండ్రి సర్ధార్ నాయక్ కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. తండ్రి చనిపోయినా తల్లి రెక్కల కష్టంతో తనను చదివిస్తుందని ఆమె కష్టానికి ఫలితం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నానని.. సాయికుమార్ చెబుతున్నాడు. భవిష్యత్‌లో ఉన్నత విద్యను అభ్యసించి కుటుంబ సమస్యలు తీరుస్తానని పేర్కొంటున్నాడు.
తల్లిదండ్రులది పేద కుటుంబం.. వీటిపై ఆధారపడి..
జనగామ జిల్లా కేంద్రానికి చెందిన మచ్చ రమేష్ రజినీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మచ్చ సిరిచందన రాజాపేట మండలంలోని రఘునాథపురం గ్రామంలో తన అమ్మమ్మ గంజి లక్ష్మి ఇంట్లో ఉంటూ స్థానిక ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. సిరిచందన.. వెలువడిన పదవతరగతి పరీక్ష ఫలితాల్లో 9.8 జీపీఏ సాధించి మండల టాపర్‌గా నిలిచింది.
☛ 10th Class Exam: పుట్టెడు దుఃఖంలోనూ విజేతలుగా నిలిచారు
తల్లిదండ్రులది పేద కుటుంబం. పవర్‌లూమ్స్‌పై ఆధారపడి జీవనోపాధి పొందుతూ ఇద్దరు కుమార్తెలను చదివిస్తున్నారు. కాగా సిరిచందన ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు మండల విద్యాధికారి కృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాల్‌రెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు.
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి మే 10వ తేదీ టెన్త్ ఫలితాలను విడుదలను విడుదల చేసిన విషయం తెల్సిందే. మొత్తంగా 4,94,504 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,91,862 మంది పరీక్షలు రాశారని, ఇందులో 4,22,795 మంది (86.60 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,793 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత నమోదైంది. 25 స్కూళ్లలో సున్నా ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలో నిర్మల్ జిల్లా 99శాతం ఉత్తీర్ణతతో ముందు వరుసలో ఉండగా.. వికారాబాద్ జిల్లా 59.46 శాతంతో చివరన నిలిచినట్టు తెలిపారు.
☛ 10జీపీఏ విద్యార్థులకు రూ.10వేలు నగదు పురస్కారం
ప్రభుత్వ గురుకులాలు 98.25 శాతంతో టాప్‌లో నిలిచాయి. రెసిడెన్షియల్, సోషల్, బీసీ, మైనార్టీ, ట్రైబల్ వెల్ఫేర్, మోడల్ స్కూళ్లు కూడా సగటుకుపైగా ఉత్తీర్ణత శాతాన్ని సాధించాయి. అయితే ఈ ఫలితాల్లో నల్గొండ జిల్లా నిడమనూరు ఆదర్శ పాఠశాల విద్యార్థిని కట్టెబోయిన అలేఖ్య పరీక్షలకు ముందు ఎన్నో ఇబ్బందులకు ఎదుర్కొని.. 9.7 జీపీఏ సాధించింది.
చదవండి: Jobs After 10th & Inter: పది, ఇంటర్‌తోనే... కొలువుల దిశగా!
2,793 స్కూళ్లలో 100 శాతం పాస్..
పదో తరగతిలో రాష్ట్రవ్యాప్తంగా 2,793 పాఠశాలల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత నమోదైంది. 25 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. ఇందులో ప్రైవేటు స్కూళ్లు 13 ఉంటే.. ప్రభుత్వ జిల్లా పరిషత్ స్కూళ్లు 9, ఎయిడెడ్ స్కూళ్లు 3 ఉన్నాయి. జీరో ఉత్తీర్ణత వచ్చిన పాఠశాలల్లో పనితీరుపై సమీక్ష చేపడతామని మంత్రి సబిత తెలిపారు.