Intermediate: ఇక వంద శాతం సిలబస్
తొలిరోజు కావడంతో చాలాచోట్ల విద్యార్థుల హాజరు తక్కువగానే నమో దైంది. ప్రభుత్వ, ప్రైవేటు హాస్టళ్లు ఇంకా తెరుచు కోక పోవడంతో మరికొన్ని రోజులు విద్యార్థుల సంఖ్య పలుచగానే ఉండే అవకాశం కన్పిస్తోంది. వీరికి మే 23వ తేదీ వరకు ఫస్టియర్ పరీక్షలు జరిగాయి. అప్పట్నుంచి వేసవి సెలవులు ప్రకటిం చగా ప్రస్తుతం ఫస్టియర్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. గత రెండేళ్లుగా Covid నేపథ్యంలో ప్రస్తుతం సెకండియర్‌కు వచ్చిన విద్యార్థులు Tenth Class పరీక్షలు రాయలేదు. దీంతో ఫస్టియర్ ఫలి తాలు ఏ విధంగా ఉంటాయనే ఆసక్తి నెలకొంది. ఫలితాలు వెలువడిన తర్వాత జూలైలో Advanced Supplementary నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. అప్పటివరకూ ద్వితీయ సంవత్సరం క్లాసులు అంతంత మాత్రంగానే జరుగుతాయని భావిస్తున్నారు. దీనికి తోడు ఇప్పటివరకూ పాఠ్య పుస్తకాలు కాలేజీలకు చేరలేదు. ఈ ప్రక్రియకు కూడా సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. ద్వితీయ సంవత్సరంలో వంద శాతం సిలబస్ ఉంటుందని బోర్డు అధికారులు చెబుతున్నారు.
చదవండి:
- TS Intermediate Board: ఇంటర్ ఫలితాలపై క్లారిటీ ఇచ్చిన బోర్డ్.. త్వరలోనే..
- What after Inter/10+2... ఎంపీసీ... మెరుగైన మార్గాలెన్నో
- After Inter BiPC: వెటర్నరీ సైన్స్‌తో ఉద్యోగావకాశాలు.. బీవీఎస్సీతో డాక్టర్ హోదా పొందొచ్చు...
కుదించిన పాఠాల అభ్యసన కష్టమే!
గత నెలలో రాసిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షల సిల బస్‌ను కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో 70 శాతానికి కుదించారు. బోధన కూడా ఈ మేరకే జరిగింది. అయితే ద్వితీయ సంవత్సరంలో మాత్రం వంద శాతం సిలబస్ ఉంటుందని చెబుతున్న అధికా రులు ఇందుకు అనుగుణంగా బోధన ప్రణాళి కను సిద్ధం చేశారు. దీనిపై విద్యార్థుల్లో కొంత ఆందోళన కన్పిస్తోంది. ఫస్టియర్‌లో 30% సిలబస్ కోత కార ణంగా కొన్ని పాఠాలు చెప్పలేదు. కానీ ఇవి సెకండి యర్‌లో విపులంగా కొనసాగుతాయి. ముఖ్యంగా గణితం, ఫిజిక్స్, కెమెస్ట్రీ, బాటనీ, జువాలజీ సహా మిగతా సబ్జెక్టుల్లోనూ ఫస్టియర్ పాఠాలు రెండో ఏడాది కొనసాగింపుగా ఉంటాయి. ఫస్టియర్‌లో సంబంధిత సబ్జెక్టుల్లో కొంతవరకు ప్రాథమిక అంశాలు కోల్పోయిన విద్యార్థులు, ఇప్పుడు వాటిని పూర్తిస్థాయిలో నేర్చుకోవడం కష్ట మవుతుందనే సందేహాలు అధ్యాపక వర్గాల్లో వ్యక్త మవుతు న్నాయి. దీనిపై ఇంటర్ బోర్డు పునరాలోచన చేయా లనే డిమాండ్ విన్పిస్తోంది. ప్రస్తుతం 1–10 క్లాసుల వరకూ ప్రత్యేక బ్రిడ్జ్ కోర్సు నిర్వహి స్తు న్నారు. ఇదే మాదిరిగా ఇంటర్ ఫస్టియర్‌లో కుదించిన పాఠా లను కొంతకాలం పాటు క్లుప్తంగా నైనా బోధిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
చదవండి: వాట్ ఆఫ్టర్ సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ..
ఫలితాలు మరింత ఆలస్యం?
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు మరింత ఆలస్యమయ్యే అవకాశం కన్పిస్తోంది. 20లోగా ఫలి తాలు ప్రకటిస్తామని బోర్డు నెల రోజుల క్రితం చెప్పి ంది. అయితే మూల్యాంకన ప్రక్రియ పూర్త యినా కంప్యూటరైజ్డ్ మార్కుల క్రోడీ కరణ ప్రక్రియ పూర్తవ్వలేదని తెలిసింది. ఇందుకు మరో వారం రోజులు పట్టవచ్చని అధికారులు చెబు తు న్నారు. కాగా మంగళవారం ఫలితాలు వెలువడు తున్నా యంటూ సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచా రాన్ని బోర్డు బుధవారం ఒక ప్రకటనలో ఖండిం చింది. ఇలాంటి వదంతులతో విద్యార్థులను గం దరగోళానికి గురి చేయవద్దంటూ విజ్ఞప్తి చేసింది.