Skip to main content

TS Intermediate Board: ఇంట‌ర్ ఫ‌లితాలపై క్లారిటీ ఇచ్చిన బోర్డ్‌.. త్వ‌ర‌లోనే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ‌లో ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల విడుద‌ల‌పై బోర్డ్ స్ఫ‌ష్ట‌మైన క్లారిటీ ఇచ్చింది.
telangana inter results
Telangana Inter Results

ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియాలో ఫ‌లితాల విడుద‌ల‌పై వివిధ తేదీలు చ‌క్క‌ర్లు కొట్టాతున్నాయి. అయితే ఇలాంటి వార్త‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని, ఫ‌లితాలు ఎప్పుడు విడుద‌ల చేస్తామో త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డ్ స్ప‌ష్టం చేసింది. మే 6వ తేదీన‌ మొదలైన ఇంటర్మీడియెట్‌ పరీక్షలు మే 24వ తేదీ వ‌రకు జ‌రిగిన విష‌యం తెల్సిందే. తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్ట్‌,సెకండియ‌ర్ ఫ‌లితాల‌ను సాక్షిఎడ్యుకేషన్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

How to check TS Inter 2022 Results:
➤ Visit results.sakshieducation.com or education.sakshi.com

➤ Click on TS Inter results - General / Vocational on the home page

➤ In the next page, enter your hall ticket number and submit

➤ The results will be displayed on the screen.

➤ Save a copy of the marks sheet for further reference

ఈ సారి ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు..
ఈ సారి ఇంట‌ర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 9,07,396 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఫస్టియర్‌ విద్యార్థులు 4,64,626 మంది కాగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,42,768 మంది ఉన్నారు. అలాగే ఈ సారి 1,443 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. 25,530 మంది ఇన్విజిలేటర్లను, 150 మందితో సిట్టింగ్‌ స్క్వాడ్, మరో 75 మందితో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ల‌ను ఏర్పాటు చేసి ప‌టిష్టంగా ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు.

After Inter: ఇంటర్మీడియెట్‌ తర్వాత.. ఏకకాలంలో డిగ్రీతోపాటు పీజీ పూర్తి..

జూలై మొదటి వారంలో
ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూలై మొదటి వారంలో నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా కరోనాతో విద్యా సంవత్సరంలో ఒడిదొడుకులు చోటుచేసుకున్న విష‌యం తెల్సిందే. అలాగే ఇంటర్‌ పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేశారు. అలాగే ఈ సారి ఇంటర్ ప‌రీక్ష‌ల ప్ర‌శ్న‌ప‌త్రాల‌ను 70 శాతం సిలబస్ నుంచి మాత్రమే ఇచ్చారు. దీంతో ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనా వ్యాప్తి తగ్గడంతో ఈసారి విద్యాసంవత్సరం సాధారణ సమయాల్లోనే చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.

తెలంగాణలో ఈ సారి జ‌రిగిన ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..

ఫస్టియర్‌

తేదీ

పరీక్ష

6–5–22

ద్వితీయ భాష

9–5–22

ఇంగ్లిష్‌

11–5–22

మ్యాథ్‌స్ –1ఎ, బాటనీ, పొలిటికల్‌ సైన్స్

13–5–22

మ్యాథ్‌స్ –1బి, జువాలజీ, హిస్టరీ

16–5–22

ఫిజిక్స్, ఎకనామిక్స్‌

18–5–22

కెవిుస్ట్రీ, కామర్స్‌

20–5–22

పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జికోర్సు–మ్యాథ్‌స్

23–5–22

మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ

సెకండియర్‌

తేదీ

 పరీక్ష

7–5–22

ద్వితీయ భాష

10–5–22

ఇంగ్లిష్‌

12–5–22

మ్యాథ్‌స్ –2ఎ, బాటనీ, పొలిటికల్‌ సైన్స్

14–5–22

మ్యాథ్‌స్ –2బి, జువాలజీ, హిస్టరీ

17–5–22

ఫిజిక్స్, ఎకనామిక్స్‌

19–5–22

కెవిుస్ట్రీ, కామర్స్‌

21–5–22

పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జికోర్సు మ్యాథ్స్‌

24–5–22

మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ

TS Inter Results Press note

 

Published date : 15 Jun 2022 04:36PM

Photo Stories