వాట్ ఆఫ్టర్ సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ..
Sakshi Education
ఇంటర్ సీఈసీ, ఎంఈసీ, హెచ్‌ఈసీ తర్వాత... కెరీర్ పరంగా ఉన్న ఉన్నత అవకాశాలేంటి? ఈ గ్రూపులు ఇతర గ్రూపులకు దీటుగా అవకాశాలను కల్పించగలవా?... చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉండేవి ఇలాంటి సందేహాలే! ఈ నేపథ్యంలో ఆయా గ్రూపుల విద్యార్థులకు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై ఫోకస్...
సీఈసీ, ఎంఈసీ
కామర్స్ కోర్సులు యువతకు కాంతులీనే కెరీర్ అందిస్తున్నాయి. సీఈసీ, ఎంఈసీ అర్హతగా ప్రవేశం లభించే బీకాం కోర్సులో అకౌంటెన్సీ, ట్యాక్సేషన్ వంటి సంప్రదాయ కాంబినేషన్లతోపాటు ఆధునిక పరిస్థితులు, మార్కెట్ అవసరాలకు సరితూగే వినూత్న కాంబినేషన్లు ఆవిష్కృతం అవుతున్నాయి. బీకాం తర్వాత విద్యార్థులకు ఉన్నత విద్య పరంగా ఎంకాం కోర్సు అందుబాటులో ఉంది. ఇటీవల కాలంలో ఎంకాంలోనూ కొత్త స్పెషలైజేషన్లు (ఉదాహరణకు ఈ-కామర్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఈ-బిజినెస్ మేనేజ్‌మెంట్ వంటివి) అందుబాటులోకి వచ్చాయి. ఈ కోర్సులు జాబ్ మార్కెట్‌లో ఎంబీఏ, ఇతర మేనేజ్‌మెంట్ పీజీ ప్రొఫెషనల్ విద్యార్థులతో దీటుగా ఎంకాం అభ్యర్థులను నిలబెడుతున్నాయి. ఆయా కోర్సులు పూర్తిచేసిన వారికి కార్పొరేట్ సంస్థల్లో అకౌంట్స్ ఆఫీసర్, ఫైనాన్స్ మేనేజర్ వంటి హోదాలతో కెరీర్ ప్రారంభమవుతోంది.
చార్టర్డ్ అకౌంటెన్సీ
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా మూడు దశలు(సీపీటీ, ఐపీసీసీ, ఫైనల్)గా నిర్వహించే సీఏ కోర్సుకు ఇంటర్మీడియెట్ నుంచే బాటలు వేసుకోవచ్చు.
సీఎంఏ
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించే సీఎంఏ కోర్సు మూడు దశలుగా (ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్) ఉంటుంది. ఇంటర్మీడియెట్ అర్హతతో ఫౌండేషన్‌లో అడుగుపెట్టొచ్చు. ఇందులోఉత్తీర్ణత సాధిస్తే ఇంటర్మీడియెట్‌లో ప్రవేశించొచ్చు. రెండో దశను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ఫైనల్ స్టేజ్‌కి అర్హత లభిస్తుంది. సీఎంఏ కోర్సును పూర్తి చేసిన వారికి ఉత్పత్తి రంగం, మైనింగ్ విభాగాలు, ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ సంస్థల్లో కాస్ట్ ఆడిటర్స్, కాస్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ ఆడిట్ మేనేజర్ వంటి హోదాలు సొంతమవుతాయి.
వెబ్‌సైట్: www.icmai.in
కంపెనీ సెక్రటరీ
కంపెనీ సెక్రటరీ కోర్సు కూడా మూడు దశలుగా (ఫౌండేషన్, ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్)గా ఉంటుంది. ఇంటర్ అర్హతతో ఫౌండేషన్ కోర్సులో ప్రవేశించవచ్చు.
హెచ్‌ఈసీ
బీఏ... విభిన్న స్పెషలైజేషన్లు
బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ) కోర్సు ఇప్పుడు భిన్న రూపాలు సంతరించుకుంటోంది. సాధారణంగా బీఏ కోర్సు హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ కాంబినేషన్లతో ఉంటుంది. అయితే ప్రస్తుతం బీఏ గ్రూప్‌లో కొత్త కాంబినేషన్లు ఆవిష్కృతమవుతున్నాయి. హిస్టరీ, ఎకనామిక్స్, పబ్లిక్ పాలసీ మేనేజ్‌మెంట్,హిస్టరీ-సోషియాలజీ-ఎకనామిక్స్ వంటి విభిన్న కాంబినేషన్లు విస్తృతావకాశాలకు వేదికలుగా మారాయి.
బీఏ తర్వాత ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు
టీచింగ్ ఎడ్యుకేషన్
అయిదేళ్ల ‘లా’కు అవకాశం
హెచ్‌ఈసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో చక్కని అవకాశం అయిదేళ్ల ‘లా’ కోర్సు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే లాసెట్ ద్వారా రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశించొచ్చు. అదే విధంగా జాతీయ స్థాయిలో నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) ఉత్తీర్ణతతో నల్సార్, నేషనల్ లా స్కూల్ వంటి ప్రతిష్టాత్మక న్యాయ విశ్వవిద్యాలయాల్లో అడుగుపెట్టవచ్చు.
బీఏ + ఆర్మీ కెరీర్ ఎన్‌డీఏ
యూపీఎస్‌సీ నిర్వహించే ఎన్‌డీఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, హెచ్‌ఈసీ విద్యార్థులు ఆర్మీలో పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకుతో కెరీర్ ప్రారంభించొచ్చు. దాంతో పాటు నేషనల్ మిలటరీ అకాడమీ (డెహ్రాడూన్)లో మూడున్నరేళ్ల వ్యవధిగల శిక్షణ పూర్తి చేసుకున్న వారికి బీఏ డిగ్రీ సొంతమవుతుంది.
డిగ్రీ నుంచే బిజినెస్ నిర్వహణ నైపుణ్యాలు
హెచ్‌ఈసీ విద్యార్థులకు సుస్థిర కెరీర్, కార్పొరేట్ కొలువులను అందిస్తున్న మరో కోర్సు బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదా బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్. దీన్ని పూర్తిచేస్తే బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలోనే వ్యాపార నిర్వహణ నైపుణ్యాలను సొంతం చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఐసెట్, క్యాట్, మ్యాట్ వంటి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి మేనేజ్‌మెంట్ పీజీ పట్టాలను అందుకోవచ్చు.
కళాత్మక విద్యకు ఫైన్ ఆర్ట్స్
సృజనాత్మకత కలిగిన హెచ్‌ఈసీ విద్యార్థులకు అద్భుత అవకాశాలను కల్పిస్తున్న కోర్సు బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. బీఎఫ్‌ఏలో.. ఫోటోగ్రఫీ, స్కల్ప్చర్, పెయింటింగ్ స్పెషలైజేన్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లోని జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఈ కోర్సులను అందిస్తోంది. దీంతో కొన్ని ఇతర యూనివర్సిటీలు కూడా పెయింటింగ్, స్కల్ప్పర్ (శిల్ప కళ) స్పెషలైజేషన్లతో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను అందిస్తున్నాయి.
ఎకనామిక్స్‌తో ఎవర్‌గ్రీన్
సంప్రదాయ కోర్సుల పరంగా ఎకనామిక్స్‌ను ఎవర్‌గ్రీన్‌గా పేర్కొనొచ్చు. హెచ్‌ఈసీ తర్వాత బీఏలో ఎకనామిక్స్‌ను గ్రూప్ సబ్జెక్ట్‌గా చదివిన విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అనేక అవకాశాలు ఉంటాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లు, అదే విధంగా కార్పొరేట్, కన్సల్టెన్సీ సంస్థలు, ప్రభుత్వ రంగంలో ప్రణాళిక విభాగాల్లోని కొలువుల్లో స్థిరపడొచ్చు.
ఆతిథ్య రంగంలో సైతం
హెచ్‌ఈసీ విద్యార్థులకు ఆతిథ్య రంగం ఆహ్వానం పలుకుతోంది. టూరిజం అండ్ హాస్పిటాలిటీ విభాగాల్లో బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, బ్యాచిలర్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్ వంటి పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌ల్లోని బీహెచ్‌ఎం కోర్సులో అడుగుపెడితే ఉజ్వల కెరీర్ ఖాయం. ఐఐహెచ్‌ంలో ప్రవేశానికి ఎన్‌సీహెచ్‌ఎంసీటీ నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

- పదో తరగతి ఉత్తీర్ణత ఆధారంగా సీపీటీకి నమోదు చేసుకుని ఇంటర్మీడియెట్ పూర్తయిన తర్వాత సీపీటీకి హాజరై ఉత్తీర్ణత సాధిస్తే సీఏ రెండో దశ ఐపీసీసీలో ప్రవేశించొచ్చు.
- రెండు గ్రూపులుగా ఉండే ఐపీసీసీలో ఉత్తీర్ణత సాధిస్తే ఫైనల్‌కు అర్హత లభిస్తుంది.
- ఫైనల్ దశను కూడా పూర్తి చేసుకుంటే కార్పొరేట్ సంస్థలు రెడ్ కార్పెట్ వెల్‌కం చెబుతున్నాయి.
- ఐపీసీసీకి నమోదు చేసుకున్న విద్యార్థులు ఫైనల్ దశ పరీక్షలు రాసే సమయానికి మూడేళ్ల వ్యవధిలో ఆర్టికల్‌షిప్ పూర్తి చేయాలనే నిబంధన ఉంది. కాబట్టి విద్యార్థులు కోర్సు సమయంలోనే క్షేత్రస్థాయి నైపుణ్యాలు అలవచరచుకోవచ్చు. ఫలితంగా ఫైనల్ సర్టిఫికెట్ చేతికందేనాటికి జాబ్ రెడీ స్కిల్స్‌తో మార్కెట్లో అడుగుపెట్టి కెరీర్ పరంగా ఉజ్వల భవితను సొంతం చేసుకోవచ్చు.
సీఎంఏ
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించే సీఎంఏ కోర్సు మూడు దశలుగా (ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్) ఉంటుంది. ఇంటర్మీడియెట్ అర్హతతో ఫౌండేషన్‌లో అడుగుపెట్టొచ్చు. ఇందులోఉత్తీర్ణత సాధిస్తే ఇంటర్మీడియెట్‌లో ప్రవేశించొచ్చు. రెండో దశను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ఫైనల్ స్టేజ్‌కి అర్హత లభిస్తుంది. సీఎంఏ కోర్సును పూర్తి చేసిన వారికి ఉత్పత్తి రంగం, మైనింగ్ విభాగాలు, ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ సంస్థల్లో కాస్ట్ ఆడిటర్స్, కాస్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ ఆడిట్ మేనేజర్ వంటి హోదాలు సొంతమవుతాయి.
వెబ్‌సైట్: www.icmai.in
కంపెనీ సెక్రటరీ
కంపెనీ సెక్రటరీ కోర్సు కూడా మూడు దశలుగా (ఫౌండేషన్, ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్)గా ఉంటుంది. ఇంటర్ అర్హతతో ఫౌండేషన్ కోర్సులో ప్రవేశించవచ్చు.
- ఫౌండేషన్ కోర్సు ఉత్తీర్ణులకు ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌కు అర్హత లభిస్తుంది. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ పూర్తి చేసుకున్న వారి తుది దశలోప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ఉంటుంది. రెండు గ్రూప్‌లుగా ఉండే ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌లో ఉత్తీర్ణత సాధిస్తే కార్పొరేట్ సంస్థల్లో అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీ, ఫైనాన్స్ ఆఫీసర్లు వంటి ఉన్నత హోదాలతో ఉద్యోగాలు లభిస్తాయి.
హెచ్‌ఈసీ
- హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ కలయికగా ఉండే హెచ్‌ఈసీ గ్రూపు విద్యార్థులు సంప్రదాయ కోర్సులైన బీఏ, తర్వాత ఎంఏలతో పాటు ప్రొఫెషనల్ కోర్సు ఏంబీఏ ను కూడా చదవొచ్చు.
- పోటీ పరీక్షల కోణంలో హెచ్‌ఈసీ సివిల్స్ నుంచి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల వరకు అనేక ప్రభుత్వ కొలువుల దిశగా నడిపిస్తూ ఇతర గ్రూపులకు దీటుగా నిలుస్తోంది.
- కొన్నేళ్లుగా యువతలో ఇంజనీరింగ్, మెడిసిన్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల పట్ల కొంత క్రేజ్ నెలకొంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు పట్ల యువత దృక్పథం మారింది.
- యువత ఉద్యోగ భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ.. ప్రభుత్వ కొలువుల్లో స్థిరపడేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వాలపై ఒత్తిడి పెరగడంతో అవి కొలువుల భర్తీకి చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి.
బీఏ... విభిన్న స్పెషలైజేషన్లు
బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ) కోర్సు ఇప్పుడు భిన్న రూపాలు సంతరించుకుంటోంది. సాధారణంగా బీఏ కోర్సు హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ కాంబినేషన్లతో ఉంటుంది. అయితే ప్రస్తుతం బీఏ గ్రూప్‌లో కొత్త కాంబినేషన్లు ఆవిష్కృతమవుతున్నాయి. హిస్టరీ, ఎకనామిక్స్, పబ్లిక్ పాలసీ మేనేజ్‌మెంట్,హిస్టరీ-సోషియాలజీ-ఎకనామిక్స్ వంటి విభిన్న కాంబినేషన్లు విస్తృతావకాశాలకు వేదికలుగా మారాయి.
బీఏ తర్వాత ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు
- సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షల సిలబస్‌లను పరిగణనలోకి తీసుకుంటే బీఏ విద్యార్థులకు ఆయా పరీక్షల్లో విజయావకాశాలు కొంత మెరుగ్గా ఉంటాయి.
- త్రివిధ దళాల్లో పర్మనెంట్ కమిషన్డ్ హోదా కల్పించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, ఆర్మీ విభాగాలకు ఎంపిక కావచ్చు.
టీచింగ్ ఎడ్యుకేషన్
- కెరీర్ సుస్థిరత కోరుకునే హెచ్‌ఈసీ విద్యార్థులకు చక్కటి అవకాశం ఉపాధ్యాయ విద్య. ఇంటర్ అర్హతగా రెండేళ్ల వ్యవధిలోని డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఈడీ)లో అడుగుపెట్టొచ్చు. ఈ కోర్సు పూర్తిచేసిన వారు డీఎస్సీలో విజయం సాధించడం ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్‌గా ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడవచ్చు.
అయిదేళ్ల ‘లా’కు అవకాశం
హెచ్‌ఈసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో చక్కని అవకాశం అయిదేళ్ల ‘లా’ కోర్సు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే లాసెట్ ద్వారా రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశించొచ్చు. అదే విధంగా జాతీయ స్థాయిలో నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) ఉత్తీర్ణతతో నల్సార్, నేషనల్ లా స్కూల్ వంటి ప్రతిష్టాత్మక న్యాయ విశ్వవిద్యాలయాల్లో అడుగుపెట్టవచ్చు.
బీఏ + ఆర్మీ కెరీర్ ఎన్‌డీఏ
యూపీఎస్‌సీ నిర్వహించే ఎన్‌డీఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, హెచ్‌ఈసీ విద్యార్థులు ఆర్మీలో పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకుతో కెరీర్ ప్రారంభించొచ్చు. దాంతో పాటు నేషనల్ మిలటరీ అకాడమీ (డెహ్రాడూన్)లో మూడున్నరేళ్ల వ్యవధిగల శిక్షణ పూర్తి చేసుకున్న వారికి బీఏ డిగ్రీ సొంతమవుతుంది.
డిగ్రీ నుంచే బిజినెస్ నిర్వహణ నైపుణ్యాలు
హెచ్‌ఈసీ విద్యార్థులకు సుస్థిర కెరీర్, కార్పొరేట్ కొలువులను అందిస్తున్న మరో కోర్సు బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదా బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్. దీన్ని పూర్తిచేస్తే బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలోనే వ్యాపార నిర్వహణ నైపుణ్యాలను సొంతం చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఐసెట్, క్యాట్, మ్యాట్ వంటి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి మేనేజ్‌మెంట్ పీజీ పట్టాలను అందుకోవచ్చు.
కళాత్మక విద్యకు ఫైన్ ఆర్ట్స్
సృజనాత్మకత కలిగిన హెచ్‌ఈసీ విద్యార్థులకు అద్భుత అవకాశాలను కల్పిస్తున్న కోర్సు బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. బీఎఫ్‌ఏలో.. ఫోటోగ్రఫీ, స్కల్ప్చర్, పెయింటింగ్ స్పెషలైజేన్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లోని జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఈ కోర్సులను అందిస్తోంది. దీంతో కొన్ని ఇతర యూనివర్సిటీలు కూడా పెయింటింగ్, స్కల్ప్పర్ (శిల్ప కళ) స్పెషలైజేషన్లతో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను అందిస్తున్నాయి.
ఎకనామిక్స్‌తో ఎవర్‌గ్రీన్
సంప్రదాయ కోర్సుల పరంగా ఎకనామిక్స్‌ను ఎవర్‌గ్రీన్‌గా పేర్కొనొచ్చు. హెచ్‌ఈసీ తర్వాత బీఏలో ఎకనామిక్స్‌ను గ్రూప్ సబ్జెక్ట్‌గా చదివిన విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అనేక అవకాశాలు ఉంటాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లు, అదే విధంగా కార్పొరేట్, కన్సల్టెన్సీ సంస్థలు, ప్రభుత్వ రంగంలో ప్రణాళిక విభాగాల్లోని కొలువుల్లో స్థిరపడొచ్చు.
ఆతిథ్య రంగంలో సైతం
హెచ్‌ఈసీ విద్యార్థులకు ఆతిథ్య రంగం ఆహ్వానం పలుకుతోంది. టూరిజం అండ్ హాస్పిటాలిటీ విభాగాల్లో బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, బ్యాచిలర్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్ వంటి పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌ల్లోని బీహెచ్‌ఎం కోర్సులో అడుగుపెడితే ఉజ్వల కెరీర్ ఖాయం. ఐఐహెచ్‌ంలో ప్రవేశానికి ఎన్‌సీహెచ్‌ఎంసీటీ నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
కామర్స్.. కలల కెరీర్ ఖాయం కామర్స్ కోర్సులు పూర్తి చేసిన వారికి కలర్‌పుల్ కెరీర్ ఖాయం. కామర్స్‌లో పూర్తి స్థాయి కోర్సులతోపాటు ఈ రంగానికి సంబంధించి షార్ట్ టర్మ్ సర్టిఫికేషన్స్ చేయడం ద్వారా ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. ఉదాహరణకు అకౌంటింగ్ ప్యాకేజెస్, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్, ఫైనాన్స్‌కు సంబంధించి ఈఆర్‌పీ సొల్యూషన్స్ సర్టిఫికేషన్స్ సొంతం చేసుకుంటే సాఫ్ట్‌వేర్ సంస్థల్లో కొలువులు ఖాయం. - ప్రొఫెసర్ జి.లక్ష్మణ్, డీన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ ఓయూ. |
ఆర్ట్స్.. భవిష్యత్తు ఉజ్వలం ప్రస్తుతం ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ విద్యార్థులకు అకడెమిక్, కెరీర్‌ల పరంగా ఆశాజనక పరిస్థితులు నెలకొన్నాయి. హెచ్‌ఈసీ అనగానే తక్షణ గమ్యం బీఏ అని కాకుండా వినూత్నంగా ఆలోచిస్తే అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా బీఏ స్థాయిలో కొత్తగా వచ్చిన కాంబినేషన్లు, వివిధ స్పెషలైజేషన్లు ఉజ్వల అవకాశాలను అందిస్తున్నాయి. దీని కోసం ముందుగా విద్యార్థులకు ఆయా స్పెషలైజేషన్లపై అవగాహన పెంచుకుంటే బెస్ట్ ఫ్యూచర్ గ్యారెంటీ. - ప్రొఫెసర్ టి.ఎల్.ఎన్. స్వామి, ప్రిన్సిపాల్, నిజాం కాలేజ్ |
Published date : 08 Apr 2016 11:47AM