Admissions: ఐదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
పర్వతగిరి: గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని కరీంనగర్, వరంగల్ సమన్వయ అధికారి డీఎస్.వెంకన్న, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ డి.మాధవీలత జనవరి 5న ఒక ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తు ప్రక్రియ జనవరి 6న ముగియనుందని పేర్కొన్నారు. నాలుగో తరగతి చదువుతూ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన విద్యార్థులు www.tswreis.telangana.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
చదవండి: Admissions: ఈ పాఠశాలల్లో ప్రవేశాలకి దరఖాస్తు గడువు తేదీ ఇదే..
ఫిబ్రవరి 11వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించి మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Published date : 06 Jan 2024 02:53PM