Skip to main content

Study Abroad: కెనడా ప్రభుత్వం ప్రకటనతో విద్యార్థులు షాక్‌.. ఇదే జరిగింది..!

ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లాలనుకునే విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే విలేకరులతో సమావేశంలో ఈ విషయాల్ని వెల్లడించారు అక్కడి ఇమిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌..
Mark Miller addressing reporters on changes in student immigration rules   Updates on education plans for students interested in studying in Canada.  Big shock to students for studying abroad   Government announcement affecting students planning to study in Canada.

కెనడాకు చెందిన జస్టిన్ ట్రూడో ప్రభుత్వం వచ్చే రెండేళ్ల పాటు అంతర్జాతీయ విద్యార్థి వీసాలలో కోత విధించడంతో పాటు వీసా జారీపై పరిమితిని విధించింది.

ఒట్టావాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కెనడా ఇమిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌ ఈ విషయాల్ని ‍ప్రకటించారు. కెనడాలో వేగంగా పెరుగుతున్న గృహ సంక్షోభంతో జస్టిన్ ట్రూడో ప్రభుత్వం విద్యార్థి వీసా కోతలు విధిస్తుంది.

Israel Visa: ఇజ్రాయిల్‌ వీసాల కోసం తరలివచ్చిన ఉద్యోగార్థులు

ఇక, ఈ సంవత్సరం కెనడాకు కొత్త స్టడీ వీసాలలో మొత్తం 35శాతం తగ్గించింది. అంటారియో వంటి నిర్దిష్ట ప్రావిన్సులు 50శాతం వరకు మరింత కోతలు విధించాయి. అయితే, మెడిసిన్, లా వంటి ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌లతో పాటు మాస్టర్స్- డాక్టరల్ ప్రోగ్రామ్‌లలో చేరిన విద్యార్థుల జీవిత భాగస్వాములకు రాబోయే వారాల్లో ఓపెన్ వర్క్ పర్మిట్లు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. ఈ ప్రకటనతో కెనడాకు వెళ్లి చదువుకోవాలని కలలు కంటున్న వేలాది మంది భారతీయ విద్యార్థులను నిరాశపరిచింది. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు పంజాబ్- గుజరాత్‌ల నుంచి వెళ్లారు. ప్రస్తుతం కెనడాలో దాదాపు మూడున్నర లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు.

North Korea: అణు డ్రోన్‌ను పరీక్షించిన ఉత్తరకొరియా

ఇక, కెనడాలో భారత్‌తో సహా అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య మిలియన్ దాటింది. కోవిడ్-19 తర్వాత కెనడా 2023లో రికార్డు స్థాయిలో 5.80 లక్షల స్టడీ వీసాలను జారీ చేసింది. ఇక, కెనడాలో గృహ సంక్షోభం కారణంగా లిబరల్ పార్టీ జస్టిన్ ట్రూడో ప్రభుత్వం విమర్శలకు గురవుతోంది. కెనడాలో తాత్కాలిక నివాసితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.. దీని కారణంగా ఇంటి అద్దెలు పెరిగాయని నిపుణులు హెచ్చరించారు. తాత్కాలిక నివాసితులలో ఎక్కువ మంది అంతర్జాతీయ విద్యార్థులు, ఇది కెనడాలో గృహ సరఫరాను దెబ్బతీసింది.

Published date : 23 Jan 2024 12:09PM

Photo Stories