ఇంటర్ అర్హతతోనే.. కెనడాలో విద్య, ఉద్యోగావకాశాలు
Sakshi Education
స్టడీ అబ్రాడ్, పోస్ట్ స్టడీ వర్క్ పరంగా ఇటీవల కాలంలో మన దేశ విద్యార్థుల ప్రాథమ్యంగా మారుతోంది కెనడా..! ఆ దేశ ప్రభుత్వం విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు నిబంధనలను సరళీకృతం చేస్తుండటమే ఇందుకు కారణం! అంతేకాకుండా.. భారతీయ విద్యార్థులు కెనడాలోని కళాశాలల్లో సులభంగా ప్రవేశాలు పొందేలా ప్రత్యేక ఒప్పందాలు కూడా చేసుకుం టోంది.
ఇంటర్మీడియెట్ నుంచే కెనడాలో అడుగుపెట్టేందుకు.. ఆపై అక్కడే వర్క్ పర్మిట్ పొందేందుకు.. వీలు కల్పించే విధానమే.. ఎస్‌పీపీ (స్టూడెంట్ పార్ట్‌నర్‌షిప్ ప్రోగ్రామ్)!! ఆయా కోర్సులకు సంబంధించి అవసరమైన ప్రామాణిక పరీక్షల స్కోర్ల మినహాయింపు, వీసా, ఎస్‌పీపీ విధా నంతోపాటు కెనడాలో విద్య, ఉద్యోగావకాశాలపై కథనం..
విదేశీ విద్య అంటే ఎక్కువ మంది మాస్టర్ కోర్సుల గురించే ఆలోచిస్తారు. అయితే కెనడాలో ప్రస్తుతం అమల్లో ఉన్న స్టూడెంట్ పార్ట్‌నర్‌షిప్ ప్రోగ్రామ్(ఎస్‌పీపీ) కాలేజెస్ విధానంలో ఇంటర్‌తోనే అక్కడి కళాశాలల్లో అడుగుపెట్టొచ్చు. ఆ తర్వాత రెండేళ్ల వర్క్ పర్మిట్ కూడా సొంతం చేసుకునే వీలుంది.
ఎస్‌పీపీ కాలేజెస్ అంటే..?
వాస్తవానికి ఎస్‌పీపీ (స్టూడెంట్ పార్ట్‌నర్‌షిప్ ప్రోగ్రామ్) కాలేజెస్ అనేది కెనడా విద్యా విధానాల్లో ఒకటి. ఇందులో అసోసియేషన్ ఆఫ్ కెనడియన్ కమ్యూనిటీ కాలేజెస్, సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ కెనడా భాగస్వామ్యంలో.. కోర్సులు అందిస్తున్న కళాశాలలనే ఎస్‌పీపీ కాలేజెస్ అని పిలుస్తారు.
భారత్‌తో ఒప్పందం :
ఎస్‌పీపీ కాలేజెస్ విధానంలో భారత విద్యార్థులను ఆకర్షించేందుకు కెనడా, భారత్‌తో ఒప్పందం చేసుకుంది. ఫలితంగా ఆ దేశ కళాశాలల్లో భారతీయ విద్యార్థులు సులభంగానే ప్రవేశం పొందొచ్చు. వీసా మంజూరు, ట్యూషన్ ఫీజు, ప్రామాణిక టెస్ట్ స్కోర్ల పరంగా సరళమైన నిబంధనలు అమలుచేస్తోంది. ముఖ్యంగా కోర్సు పూర్తయ్యాక రెండేళ్ల వ్యవధికి వర్క్ పర్మిట్ అందించడం.. భారత విద్యార్థులకు అత్యంత ప్రయోజనకరంగా చెప్పొచ్చు.
సర్టిఫికెట్ నుంచి అడ్వాన్స్‌డ్ డిప్లొమా వరకు..
ఎస్‌పీపీ కాలేజెస్ విధానంలో ఆయాకళాశాలల్లో ఇంటర్మీడియెట్, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ అర్హతగా పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా ప్రోగ్రామ్స్‌కు ఇంటర్ అర్హతతోనే దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్వాన్స్‌డ్ డిప్లొమా ప్రోగ్రామ్స్‌కు మాత్రం బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి. ఆయా కళాశాలల నిబంధనల ప్రకారం– ఇంటర్, బ్యాచిలర్ డిగ్రీలో 50శాతం నుంచి 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. లాంగ్వేజ్ టెస్ట్ స్కోర్ పరంగా ఐఈఎల్‌టీఎస్‌లో 6–6.5 బ్యాండ్స్ పొందాలి.
జీఆర్‌ఈ లేకపోవడం :
ఎస్‌పీపీ కాలేజెస్ విధానంలో మరో ప్రధాన ప్రత్యేకత.. సైన్స్, టెక్నాలజీ కోర్సులకు అవసరమైన జీఆర్‌ఈ టెస్ట్ స్కోర్ నుంచి మినహాయింపు ఇవ్వడం. కొన్ని కళాశాలలు ఐఈఎల్‌టీఎస్ స్కోర్ విషయంలోనూ మినహాయింపు ఇస్తున్నాయి. 5.5 బ్యాండ్స్ స్కోర్‌తోనూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ కళాశాలల్లో టెక్నాలజీ, డిజైన్, ఫ్యాషన్, మీడియా అండ్ ఆర్ట్స్, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్‌ఆర్, మేనేజ్‌మెంట్, సోషల్ అండ్ కమ్యూనిటీ సర్వీసెస్, కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్, హెల్త్ సైన్సెస్, హాస్పిటల్ అండ్ హోటల్ మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో డిప్లొమా నుంచి అడ్వాన్స్‌డ్ డిప్లొమా వరకు పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఉద్యోగావకాశాలు..
ఎస్‌పీపీ కళాశాలల్లో కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు అక్కడే ఉద్యోగావకాశాలు అందుకోవచ్చు. ఎస్‌పీసీ కాలేజెస్‌లో కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు సీఎస్‌ఈ, ఐటీ, బిజినెస్ అండ్ ఫైనాన్స్, బయో సైన్సెస్, మెడిసిన్ అండ్ హెల్త్‌కేర్, మీడియా అండ్ జర్నలిజం ఇలా పలు రంగాల్లో ఉద్యోగావకాశాలు సులభంగా లభిస్తున్నాయి. వేతనం నెలకు సగటున నాలుగు వేల నుంచి అయిదు వేల కెనడియన్ డాలర్ల మధ్యలో ఉంటోంది. కోర్సు సమయంలో ఇన్ క్యాంపస్– ఔట్ క్యాంపస్ పరిధిలో పలు పార్ట్ టైమ్ వర్క్ అవకాశాలు కూడా అందుకోవచ్చు. ఈ విధానంలో వారానికి 20 గంటలు పని చేసే వీలుంటుంది. సగటున నెలకు 800 నుంచి 1000 కెనడియన్ డాలర్లు పార్ట్ టైమ్ వర్క్ చేస్తూ సంపాదించుకోవచ్చు.
పబ్లిక్ యూనివర్సిటీస్ :
కెనడాలో ప్రస్తుతం యూనివర్సిటీ స్థాయిలోనూ సరళీకృత విధానాలు అమలవుతున్నాయి. ప్రభుత్వ పరిధిలో ఉండే పబ్లిక్ యూనివర్సిటీస్‌లో ప్రవేశం పొందాలంటే.. అకడమిక్‌గా ఉత్తమ ప్రతిభ(70 శాతంపైగా మార్కులతో ఉత్తీర్ణత)తోపాటు ఐఈఎల్‌టీఎస్, జీఆర్‌ఈలలో బెస్ట్ స్కోర్స్ ఉండాలి. ఐఈఎల్‌టీఎస్‌లో 7 బ్యాండ్స్, జీఆర్‌ఈ స్కోర్ 300–310 మధ్య శ్రేణిలో ఉంటే.. ప్రవేశం సులభంగా లభిస్తుంది. వీటిలో మాస్టర్ స్థాయి కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని చెప్పొచ్చు. ట్యూషన్ ఫీజుకు సంబంధించి 50 శాతం మేరకు స్కాలర్‌షిప్ లభించే అవకాశం ఉంది.
ప్రైవేటు యూనివర్సిటీలు :
భారతీయ విద్యార్థులు ఎక్కువగా ప్రైవేట్ యూనివర్సిటీల్లోనే చేరుతున్నారు. వీటిలోనూ ప్రధానంగా మేనేజ్‌మెంట్, సీఎస్, ఐటీ కోర్సుల్లో పీజీ ప్రోగ్రామ్స్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. పబ్లిక్ యూనివర్సిటీలతో పోల్చితే ప్రైవేటు యూనివర్సిటీల్లో ఫీజులు కొంత ఎక్కువనే చెప్పాలి. ఏడాదికి రూ. పది లక్షల నుంచి రూ.12లక్షల వరకు ట్యూషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా అకడమిక్‌గా నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ, 6.5 బ్యాండ్స్‌తో ఐఈఎల్‌టీఎస్, 290కు పైగా జీఆర్‌ఈ స్కోర్ తప్పనిసరి.
వీరికి మూడేళ్ల వర్క్ పర్మిట్ :
యూనివర్సిటీ స్థాయిలో మాస్టర్ కోర్సులు పూర్తి చేసిన వారికి కోర్సు పూర్తయ్యాక మూడేళ్ల వర్క్ పర్మిట్ మంజూరు చేస్తారు. అంతేకాకుండా వీరికి లభించే ఉద్యోగావకాశాలు, వేతనాలు కూడా ఆకర్షణీయంగా ఉంటున్నాయి. ప్రారంభంలోనే సగటున నెలకు అయిదు వేల నుంచి ఎనిమిది వేల కెనడియన్ డాలర్లతో ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా చదువుకుంటున్న సమయంలో పార్ట్ టైమ్ వర్క్ విధానంలో నెలకు ఎనిమిది వందల నుంచి రెండు వేల కెనడియన్ డాలర్ల మేరకు ఆదాయం పొందొచ్చు. వీటిద్వారా నివాస ఖర్చులు, ఇతర వ్యక్తిగత ఖర్చుల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది.
కెనడా స్టడీ / పోస్ట్ స్టడీ వర్క్.. ముఖ్యాంశాలు :
సగటు విద్యార్థులకు ఎస్‌పీపీ కాలేజ్‌లు అనుకూలం..
అకడమిక్‌గా యావరేజ్‌గా ఉన్న విద్యార్థులకు, ఐఈఎల్‌టీఎస్‌లో తక్కువ స్కోర్ సాధించిన వారికి, జీఆర్‌ఈ స్కోర్ లేకున్నా.. కెనడాలో అడుగు పెట్టాలనుకునే విద్యార్థులకు ఎస్‌పీపీ కాలేజ్‌లు చక్కటి మార్గం అని చెప్పొచ్చు. ఇవి కేవలం డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులనే అందిస్తున్నప్పటికీ.. ప్రవేశ ప్రక్రియ సులభంగా ఉంటుంది. వీసా కూడా సులభంగా మంజూరవుతుంది. అంతేకాకుండా ఫీజుల పరంగానూ విద్యార్థులకు ఇవి ఎంతో అనుకూలంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా వీటిలో డిప్లొమా, పీజీ డిప్లొమా పూర్తి చేసుకోవడం ద్వారా ఉద్యోగావకాశాలు అందుకోవచ్చు. అయితే అకడమిక్‌గా చక్కటి ప్రతిభ, ఇతర స్టాండర్డ్ టెస్ట్ స్కోర్స్ పరంగా ఉన్నతంగా ఉన్న విద్యార్థులు పబ్లిక్ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకోవడం మంచిది.
– పాలెపు సుమంత్, సీఎంఓ Conduira WWEC

- ఎస్‌పీపీ కాలేజెస్ విధానంలో ఇంటర్ అర్హతతోనే అడుగు పెట్టే అవకాశం.
- డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు పూర్తి చేసుకోవడం ద్వారా మంచి వేతనాలతో ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశం.
- జీఆర్‌ఈ అవసరం లేకుండానే ఎస్‌పీపీ కాలేజెస్‌లో ప్రవేశం.
- కోర్సు పూర్తయ్యాక రెండేళ్ల వర్క్ పర్మిట్.
- యూనివర్సిటీ స్థాయిలో ప్రైవేటు, పబ్లిక్ యూనివర్సిటీల్లో పీజీ కోర్సులు పూర్తి చేసుకొని నైపుణ్యాలు అందిపుచ్చుకుంటే నెలకు అయిదు వేల నుంచి ఎనిమిది వేల వరకు కెనడియన్ డాలర్ల వేతనం అందుకునే అవకాశం.
సగటు విద్యార్థులకు ఎస్‌పీపీ కాలేజ్‌లు అనుకూలం..
అకడమిక్‌గా యావరేజ్‌గా ఉన్న విద్యార్థులకు, ఐఈఎల్‌టీఎస్‌లో తక్కువ స్కోర్ సాధించిన వారికి, జీఆర్‌ఈ స్కోర్ లేకున్నా.. కెనడాలో అడుగు పెట్టాలనుకునే విద్యార్థులకు ఎస్‌పీపీ కాలేజ్‌లు చక్కటి మార్గం అని చెప్పొచ్చు. ఇవి కేవలం డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులనే అందిస్తున్నప్పటికీ.. ప్రవేశ ప్రక్రియ సులభంగా ఉంటుంది. వీసా కూడా సులభంగా మంజూరవుతుంది. అంతేకాకుండా ఫీజుల పరంగానూ విద్యార్థులకు ఇవి ఎంతో అనుకూలంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా వీటిలో డిప్లొమా, పీజీ డిప్లొమా పూర్తి చేసుకోవడం ద్వారా ఉద్యోగావకాశాలు అందుకోవచ్చు. అయితే అకడమిక్‌గా చక్కటి ప్రతిభ, ఇతర స్టాండర్డ్ టెస్ట్ స్కోర్స్ పరంగా ఉన్నతంగా ఉన్న విద్యార్థులు పబ్లిక్ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకోవడం మంచిది.
– పాలెపు సుమంత్, సీఎంఓ Conduira WWEC
Published date : 29 Oct 2019 05:13PM