Scholarship To Study Abroad : ఉన్నత చదువు కోసం స్టడీ అబ్రాడ్ విద్యార్థులకు పలు స్కాలర్‌షిప్‌లు.. అకడమిక్ రికార్డ్, ప్రతిభ ఆధారంగా..
దీంతో ఎంతోమంది అవకాశాలు వచ్చినా వదులుకుంటున్న పరిస్థితి. ఇలాంటి విద్యార్థులకు ఆర్థిక భారం నుంచి ఉపశమనం కల్పిస్తున్నాయి.. స్కాలర్‌షిప్స్! అకడమిక్ ప్రతిభతోపాటు టాప్ యూనివర్సిటీలో ప్రవేశం పొందితే.. ఉపకార వేతనం లభించే అవకాశముంది. ఈ నేపథ్యంలో.. స్టడీ అబ్రాడ్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న పలు స్కాలర్‌షిప్‌ల వివరాలు..
ఫుల్‌బ్రైట్ మాస్టర్స్ ఫెలోషిప్స్
భారతీయ విద్యార్థులు తొలి గమ్యంగా భావించే అమెరికాలో.. ఎలాంటి కోర్సులో చేరాలనుకున్న వారికైనా.. అందుబాటులో ఉన్న ఉపకార వేతనం.. ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్స్. ఆర్ట్స్, ఎకనామిక్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/స్టడీస్, హయ్యర్ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్, ఇంటర్నేషనల్ అఫైర్స్, ఇంటర్నేషనల్ లీగల్ స్టడీస్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ హెల్త్, అర్బన్ అండ్ రీజనల్ ప్లానింగ్, ఉమెన్స్ స్టడీస్/జండర్ స్టడీస్ తదితర విభాగాల్లో పీజీ, ఆపై స్థాయి కోర్సుల్లో చేరిన వారు ఈ ఫెలోషిప్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన వారికి కోర్సు వ్యవధిలో ఒకసారి స్వదేశానికి వచ్చి వెళ్లేందుకు విమాన చార్జీలు, నివాస ఖర్చులు, ట్యూషన్ ఫీజు ఫండింగ్ వంటివి లభిస్తాయి.
వెబ్‌సైట్: www.usief.org.in/Fullbright-Nehru-Fellowships.aspx
NHB Recruitment 2024 : ఎన్‌హెచ్‌బీలో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు.. చివరి తేదీ!
క్వాడ్ ఫెలోషిప్ ఫర్ స్టెమ్ కోర్సెస్
క్వాడ్ దేశాల కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటైన స్కాలర్‌షిప్ ఇది. క్వాడ్ గ్రూప్‌లోని ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికాకు చెందిన వంద మంది విద్యార్థులకు అమెరికాలోని యూనివర్సిటీలు/ఇన్‌స్టిట్యూట్స్‌లో.. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ పీజీ, డాక్టోరల్ కోర్సుల్లో చేరే వారికి ఈ క్వాడ్ ఫెలోషిప్‌ను అందిస్తారు. దీనికి ఎంపికైన వారికి రూ.50 వేల డాలర్ల ఏక మొత్తం ఆర్థిక సహాయం అందిస్తారు. నీడ్ బేస్డ్ విధానంలో కోర్సు పూర్తి చేసుకునేందుకు అయ్యే వ్యయంలో భాగంగా మరో 25 వేల డాలర్లు ఇస్తారు.
వెబ్‌సైట్: www.quadfellowship.org
నేషనల్ ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ ఫర్ ఎస్సీ క్యాండిడేట్స్
దేశంలో ఎస్సీ కేటగిరీలకు చెందిన అల్పాదాయ వర్గాల విద్యార్థులు విదేశీ విద్యను అందుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం.. నేషనల్ ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్. ఎస్సీ/ఎస్టీ, వ్యవసాయ కూలీ కుటుంబాలకు చెందిన విద్యార్థులు, డినోటిఫైడ్, సంచార, పాక్షిక సంచార జాతులు, సంపద్రాయ కళాకారుల కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ ఆదాయం రూ.8లక్షలకు లోపు ఉండాలి. డిగ్రీ లేదా పీజీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి.. విదేశాల్లో పీజీ లేదా పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకుని ఉండాలి. మొత్తం 125 స్కాలర్‌షిప్ అందుబాటులో ఉనా్నయి. ఇందులో ఎస్సీ కులాల వారికి–115, సంచార, పాక్షిక సంచార జాతుల వారికి–06, భూమిలేని వ్యవసాయ కూలీలకు, సంప్రదాయ కళాకారులకు–04 స్కాలర్‌షిప్స్‌ను కేటాయిస్తారు. పీజీ కోర్సులో చేరితే మూడేళ్ల పాటు, పీహెచ్‌డీ చేస్తే నాలుగేళ్ల కాలానికి స్కాలర్‌షిప్స్‌ను మంజూరు చేస్తారు.
వివరాలకు వెబ్‌సైట్: https://nosmsje.gov.in
Apprentice Posts at PNB : పీఎన్‌బీ శాఖల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు.. ఎక్కడ?
ఏడీబీ–జపాన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్
జపాన్‌లోని యూనివర్సిటీల్లో ప్రవేశం ఖరారు చేసుకున్న మన దేశ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో ప్రముఖ స్కాలర్‌షిప్ పథకం.. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ జపాన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్. ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇతర అభివృద్ధి సంబంధిత విభాగాల్లో ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో విద్యనభ్యసించే విద్యార్థులకు ఇవి లభిస్తాయి. ఎంపికైన వారికి పూర్తి స్థాయి ట్యూషన్ ఫీజు, హౌసింగ్ అలవెన్స్, బుక్స్ అలవెన్స్, ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్ అందుతాయి.
వివరాలకు వెబ్‌సైట్: www.adb.org
టోఫెల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్
ప్రముఖ లాంగ్వేజ్ టెస్టింగ్ ఏజెన్సీ ఈటీఎస్.. టోఫెల్ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. ఏ దేశంలో ప్రవేశం ఖరారు చేసుకున్నా.. ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌గా 80 శాతంపైగా మార్కులు సాధించాలి. టోఫెల్‌లో సదరు యూనివర్సిటీ పేర్కొన్న స్కోర్ సాధించిన విద్యార్థులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు ఏడు వేల డాలర్ల స్టయిఫండ్ లభిస్తుంది.
వివరాలకు వెబ్‌సైట్: www.ets.org/toefl/grants
TS EAMCET Counselling 2024: నేటి నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. ఇలా స్లాట్ బుక్ చేసుకోవాలి
బ్రిటిష్ కౌన్సిల్ ఐఈఎల్‌టీఎస్ అవార్డ్స్
బ్రిటిష్ కౌన్సిల్.. ఐఈఎల్‌టీఎస్ స్కోర్ ఆధారంగా అందిస్తున్న స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ఇది. ఐఈఎల్‌టీఎస్ జాయింట్ ఫండెడ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ పేరుతో ఈ స్కాలర్‌షిప్స్‌ను ఏర్పాటు చేసింది. వీటికి బ్రిటిష్ కౌన్సిల్, ఐడీపీ, ఐఈఎల్‌టీఎస్ ఆస్ట్రేలియా సహకారం అందిస్తాయి. ఈ స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు కోసం రూ.మూడు లక్షల స్కాలర్‌షిప్ లభిస్తుంది.
వివరాలకు వెబ్‌సైట్: www.ielts.org/for-researchers/grants-and-awards
ఛార్లెస్ వాలెస్ ఇండియా ట్రస్ట్ స్కాలర్‌షిప్స్
యూకేలో పీజీ, ఆపై స్థాయి కోర్సుల అభ్యర్థులకు అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్ ఇది. ఎంపిక చేసుకున్న కోర్సు మేరకు ఏడాదికి గరిష్టంగా 1400 పౌండ్ల స్కాలర్‌షిప్ లభిస్తుంది.
వివరాలకు వెబ్‌సైట్: www.britishcouncil.in/study-uk/scholarships/charles-wallace-india-trust-scholarships
Special Cadre Officer Posts : ఐడీబీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
ఎరాస్‌మస్ ముండస్
యూరోపియన్ యూనియన్ దేశాల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో చేరాలనుకునే వారికి అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్.. ఎరాస్‌మస్ ముండస్. ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు, నివాస వసతి, మెడికల్ అలవెన్స్, ఇన్సూరెన్స్ తదితర ఖర్చుల మెుత్తానికి సరిపడే విధంగా ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది.
వివరాలకు వెబ్‌సైట్:eacea.europa.eu/erasmus_mundus/funding
కామన్వెల్త్ స్కాలర్‌షిప్స్–యూకే
కేంద్ర ప్రభుత్వ పరిధిలో అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్ పథకం ఇది. కామన్వెల్త్ సభ్య దేశాల జాబితాలోని ఏ దేశంలోనైనా చదవాలనుకునే వారు ఈ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తుకు అర్హులు. మాస్టర్స్ స్థాయిలో ఒక ఏడాది, పీహెచ్‌డీ స్థాయిలో మూడేళ్లు ఈ స్కాలర్‌షిప్ లభిస్తుంది. అర్హులైన అభ్యర్థులకు ట్యూషన్ ఫీజు, నివాస వ్యయాలకు సరిపడ మొత్తంలో ఆర్థిక తోడ్పాటు అందుతుంది.
వివరాలకు వెబ్‌సైట్: mhrd.gov.in/scholarships
AP TET, DSC Update News 2024 : ఏపీ టెట్, డీఎస్సీ-2024లపై కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..!
డీఏఏడీ స్కాలర్‌షిప్స్
జర్మనీలో ఇంజనీరింగ్, సైన్స్ విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టోరల్, పోస్ట్ డాక్టోరల్ స్టడీస్ అభ్యర్థులకు అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్ పథకం ఇది. దీన్ని జర్మన్ అకడమిక్ ఎక్సే్ఛంజ్ ప్రోగ్రామ్ మేరకు అందిస్తారు. ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు, నివాస ఖర్చుల మెుత్తానికి స్కాలర్‌షిప్ లభిస్తుంది.
వివరాలకు వెబ్‌సైట్: www.daad.in/en
ఎ–స్టార్ యూత్ స్కాలర్‌షిప్
సింగపూర్‌లో గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన భారత విద్యార్థుల కోసం సింగపూర్ ప్రభుత్వం ప్రత్యేకంగా అందిస్తున్న స్కాలర్‌షిప్ పథకం ఎ–స్టార్ యూత్ స్కాలర్‌షిప్ ఫర్ ఇండియా.
వివరాలకు వెబ్‌సైట్: www.a-star.edu.sg/Scholarships/for-graduate-studies
APPSC Group 2 Mains 2024 Postponed : ఏపీపీఎస్సీ గ్రూప్-2 వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?
ఓఎఫ్‌ఐడీ స్కాలర్‌షిప్ అవార్డ్
ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్ పథకం ఇది. ఓఎఫ్‌ఐడీ ఒపెక్ ఫండ్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ పేరిట అందిస్తున్న ఈ స్కాలర్‌షిప్‌నకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లు/యూనివర్సిటీల్లో మాస్టర్ డిగ్రీలో చేరాలనుకుంటున్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన విద్యార్థులు అర్హులు. ఎంపికైన విద్యార్థులకు యాభైవేల డాలర్ల ట్యూషన్ ఫీజు, నివాస ఖర్చులు, రిలొకేషన్ గ్రాంట్, ప్రయాణ ఖర్చులు లభిస్తాయి.
వివరాలకు వెబ్‌సైట్: www.ofid.org/FOCUS-AREAS/Beyond-the-scope/Scholarship-Award
Tags
- Scholarships
- students education
- Higher Studies
- Study Abroad
- Foreign Universities
- Scholarships in Foreign Universities
- Study Abroad students
- academic record of students
- students talent
- Education News
- Scholarships for higher education
- Foreign university financial aid
- Scholarships for international students
- International Scholarships
- Education grants abroad
- Global study scholarships
- Postmetric Student Scholarships
- goabroad