Study Abroad for Engineering Students : ఇంజినీరింగ్ విద్యార్థులకు విదేశానికి వెళ్లే అవకాశాలు.. ఈ శిక్షణతో అవగాహన పెంచుకోవాలి..
పుట్టపర్తి అర్బన్: జిల్లా కేంద్రం సమీపంలోని సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు విదేశీ విద్యపై శిక్షణను గురువారం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆస్ట్రియాలోని గ్రాజ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ రీసెర్చ్ స్కాలర్ కొన్రాడ్ జలార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు విదేశాలకు వెళ్లడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు.
APPSC 2024 : ఏపీపీఎస్సీ డిపార్ట్‌మెంటల్ టెస్ట్ షెడ్యూల్ విడుదల
ఈ క్రమంలో 6 నెలల పాటు జరిగే ఈ శిక్షణలో అందరూ పాల్గొని నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. శిక్షణలో భాగంగా ఆన్‌లైన్ గేమింగ్, ఆటోమెషిన్ అభివృద్ధి చేయడం, వివిధ ఆపరేటింగ్ సిస్టంల సాంకేతికతపై అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సెంథిల్‌కుమార్, డీన్ బాక్టర్ బాలకోటేశ్వరి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Heat Wave: రికార్డు స్థాయిలో ఉన్న ఎండల తీవ్రత, వరదల బీభత్సం.. ఎక్కడంటే..