Heat Wave: రికార్డు స్థాయిలో ఉన్న ఎండల తీవ్రత, వరదల బీభత్సం.. ఎక్కడంటే..
తీవ్రమైన ఎండల తాకిడితో అమెరికాలోని పలు ప్రాంతాలు అల్లాడిపోతున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో జూలై 4వ తేదీన 123 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రికార్డు స్థాయికి దగ్గరగా ఉంది. వచ్చే 4-5 రోజుల్లో 130 డిగ్రీల ఫారన్‌హీట్ ఉష్ణోగ్రత కూడా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు టెక్సాస్‌తో సహా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల వరదలు సంభవించి, ప్రజలు, పంటలు, ఆస్తులకు భారీ నష్టం జరిగింది.
ఈ వాతావరణ విపత్తుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వీలైనంత సమయం ఇళ్లలోనే ఉండాలని, బయటకు వెళ్లాల్సిన అవసరం ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
EIU Global Liveability Index: ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన టాప్ 10 నగరాలు ఇవే..