NATO: ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం అసాధ్యం

రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మొదటిసారిగా ఫిబ్రవరి 12వ తేదీ నాటో ప్రధాన కార్యాలయంలో ‘ఉక్రెయిన్ డిఫెన్స్ కాంటాక్ట్ గ్రూప్’ సమావేశంలో ఇందుకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం అసాధ్యమన్నారు.
ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వంతో శాంతి ఒప్పందం కార్యరూపం దాలుస్తుందనే విశ్వాసం తనకు లేదన్నారు. అంతర్జాతీయ బలగాల దన్నుతో ఆ దేశం రష్యాతో చర్చలకు, శాంతి ఒప్పందానికి సిద్ధ పడాలని సూచించారు.
అంతేకాదు, 2014 తర్వాత రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాలను వదులు కోవాలన్నారు. ట్రంప్ ప్రభుత్వం ఉక్రెయిన్‌కు ఏ మేరకు సైనిక, ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధంగా ఉందో తెలుసుకోవాలనుకున్న నాటో దేశాలకు ఈ వ్యాఖ్యలు మింగుడు పడటం లేదు.
Corrupt Country: ప్రపంచంలో అత్యంత అవినీతి దేశాలివే.. భారత్ స్థానం..?
అంతేకాదు, ఉక్రెయిన్ రక్షణ, ఆర్థిక, సైనిక పరమైన అంశాలను ఇకపై యూరప్ దేశాలే చూసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారని కూడా హెగ్సెత్ బాంబు పేల్చారు. ఒక వేళ శాంతి పరిరక్షక బలగాల అవసరముంటే అందులో అమెరికా బలగాల పాత్ర ఉండబోదని కూడా తేల్చేశారు.
ఈ బలగాలతో రష్యా ఆర్మీకి ఘర్షణ తలెత్తే సందర్భాల్లో అమెరికా లేదా నాటో దేశాల నుంచి ఎటువంటి రక్షణలు కల్పించలేమన్నారు. ఉక్రెయిన్ కోరుతున్న భూభాగంలో కొంత ప్రాంతాన్ని రష్యా ఉంచుకుంటుందన్నారు.
UN Human Rights: యూఎన్‌హెచ్‌ఆర్‌సీకి వీడ్కోలు పలికిన ట్రంప్.. త్వరలో యునెస్కోకు కూడా..!