Student Visas: విద్యార్థుల వీసాలను తగ్గించిన కెనడా..!
Sakshi Education
కెనడా ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థులకు ఇచ్చే వీసా(Student Visas)ల్లో కోత విధించినట్లు తెలిపింది.
ప్రస్తుతం తీసుకుంటున్న కోటాలో సుమారు 35 శాతం కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కోటా తగ్గింపు రెండు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. గృహవసతి సంక్షోభంతోపాటు విదేశీ విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించి తప్పుడు పద్ధతులను అవలంభిస్తున్న సంస్థలను కట్టడి చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
కోటా తగ్గింపు భారతీయ విద్యార్థులపై బాగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ప్రకారం 2024లో అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాలలో 35 శాతం కోతపడనున్నట్టు ఇమ్మిగ్రేషన్ శాఖ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు. కొత్త విధానం ప్రకారం 2024లో 3,64,000 మంది విద్యార్థులను అనుమతించే అవకాశం ఉంది.
Study Abroad: వీసా తిరస్కరణకు ముఖ్యమైన కారణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Published date : 24 Jan 2024 03:25PM