North Korea: అణు డ్రోన్‌ను పరీక్షించిన ఉత్తరకొరియా
Sakshi Education
ఉత్తరకొరియా అణ్వాయుధాల సామర్థ్యాన్ని పెంచుకుంటోంది.
ఇటీవల పశ్చిమ సముద్ర జలాల్లో అణు దాడి చేసే సామర్థ్యమున్న డ్రోన్‌ను పరీక్షించినట్లు జనవరి 19వ తేదీ (శుక్రవారం) ప్రకటించింది. పోర్టులు, యుద్ధ నౌకలను ధ్వంసం చేసే సామర్థ్యం ఈ డ్రోన్‌కు ఉందని తెలిపింది.
దక్షిణ కొరియా, అమెరికా, జపాన్‌లు కలిసి ఈ వారంలో జెజు దీవికి సమీపంలో చేపట్టిన భారీ సైనిక విన్యాసాలకు స్పందనగానే తామీ పరీక్ష జరిపినట్లు చెప్పుకుంది. గత ఏడాది మొదటిసారిగా ఈ డ్రోన్‌ను పరీక్షించినట్లు తెలిపింది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెంచుతూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పర్యవసానాలుంటాయని హెచ్చరించింది.
Miss World Pageant: 28 ఏళ్ల తర్వాత భారత్‌లో మిస్ వరల్డ్ పోటీలు
Published date : 23 Jan 2024 09:25AM