Skip to main content

Animal Husbandry Assistant Result 2024 : ఎల్లుండే 1,896 యానిమ‌ల్ హ‌జ్బెండ‌రీ అసిస్టెంట్ ఫ‌లితాలు విడుద‌ల‌..'కీ' కోసం క్లిక్ చేయండి

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ..ఏపీ పశుసంవర్ధక సబార్డినేట్‌ సర్వీసెస్‌లో రెగ్యులర్‌ ప్రాతిపదికన 1,896పశు సంవర్ధక సహాయకులు (ఏహెచ్‌ఏ) పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ ఇచ్చిన విష‌యం తెల్సిందే.
Animal Husbandry Assistant Jobs in Andhra Pradesh   Job Opportunity in Animal Husbandry Department  Animal Husbandry Assistants Notification Government Employment in AP   AP Animal Husbandry Subordinate Services Vacancy AP Animal Husbandry Assistant Result 2024 Date and Time  Andhra Pradesh AHA Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశుసంవర్ధక సహాయకుల  పోస్టుల నియామక పరీక్ష తుది కీ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ విడుదల చేసింది. రెండు రోజుల్లో ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఫ‌లితాలను జ‌న‌వ‌రి 17వ తేదీన విడుద‌ల చేస్తామ‌ని స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గ‌తేడాది డిసెంబ‌ర్ 31వ తేదీన 150 మార్కుల‌కు ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. ఇప్ప‌టికే ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన కీ ని కూడా విడుద‌ల చేశారు. ఈ ఉద్యోగంకు ఎంపికైన అభ్య‌ర్థులు ఏపీ గ్రామ స‌చివాల‌యాల్లో రెండెళ్లు పాటు ప్రొబేష‌న్ ఉంటుంది.వీరికి నెలకు రూ.22,460 – రూ.72,810 వేతనం ఉంటుంది. అలాగే అనంతపురం-473, చిత్తూరు-100, కర్నూలు-252, వైఎస్సార్‌ కడప-210, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు-143, ప్రకాశం-177,గుంటూరు-229,కృష్ణా-120, పశ్చిమ గోదావరి-102, తూర్పు గోదావరి-15, విశాఖపట్నం-28,విజయనగరం-13,శ్రీకాకుళం-34 పోస్టులు ఉన్నాయి.

ఏపీ యానిమ‌ల్ హ‌జ్బెండ‌రీ అసిస్టెంట్ ప‌రీక్ష‌ ఫైనల్ కీ ఇదే..

Published date : 17 Jan 2024 09:11AM
PDF

Photo Stories