Skip to main content

TREIRB Gurukulam Jobs Final Results 2023 Date : 9,210 గురుకుల‌ ఉద్యోగాల ఫ‌లితాల విడుదల ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలో 9,210 గురుకుల విద్యాసంస్ధల ఉద్యోగాల‌కు ఆగస్టు 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించిన విష‌యం తెల్సిందే.
TREIRB Gurukulam Exam Final Result 2023 News in Telugu
TREIRB Gurukulam Exam Final Result 2023

ఇప్ప‌టికే ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన‌ తుది ‘కీ’లను గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (TREIRB) విడుద‌ల చేసింది. 

ఈ వారంలోనే..
ఈ 9,210 పోస్టులకు గాను 2.63 లక్షల మందికి పైగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు.ఒక్క పోస్టుకు సగటున 29 మంది అభ్యర్ధులు పోటి పడుతున్నారు. ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఫ‌లితాల‌ను కూడా ఈ వారంలోనే ఏక్షణంలోనైన‌ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఈ మేర‌కు టీఆర్‌ఈఐఆర్‌బీ అధికారులు క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

రోస్టర్‌ పాయింట్ల మార్పులు..

ts gurukulam jobs 2023

మొత్తంగా 51 కేటగిరీల్లో జరిగిన పరీక్షలకు సంబంధించిన ఫైనల్‌ కీలు తాజాగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రోస్టర్‌ చార్ట్‌ కీలకంగా పనిచేస్తుంది. ఈ చార్ట్‌లో నిర్దేశించిన రిజర్వేషన్ల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. తాజాగా రోస్టర్‌ పాయింట్లలో కొన్ని రకాల మార్పులు చేస్తూ సవరించిన రోస్టర్‌ జాబితాను టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

ఇందులో ప్రధానంగా 13, 37 (ఎక్స్‌ సర్వీస్‌మెన్‌) రోస్టర్‌ పాయింట్లలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. సొసైటీ వారీగా నిర్దేశించిన పోస్టు కేటగిరీల్లో ఈ పాయింట్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదివరకు ప్రకటించిన పాయింట్లు... తాజాగా సవరించిన పాయింట్లతో కూడిన జాబితాను టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

అక్టోబర్‌ నెలాఖరు కల్లా..
ఉన్నత స్థాయి పోస్టుల నుంచి కింది స్థాయి పోస్టులకు అవరోహణ క్రమంలో నియామక ప్రక్రియ పూర్తి చేయనుంది. ముందుగా డిగ్రీ, జూనియర్‌ లెక్చరర్‌, తర్వాత పీజీటీ, టీజీటీ పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన ఉండే అవకాశం ఉంది. అక్టోబరు నెలాఖరు నాటికి నియామకాలు పూర్తి చేయాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది.

Published date : 15 Sep 2023 08:59AM

Photo Stories