Skip to main content

TREIRB Gurukulam Exam Result 2023 : గురుకుల పరీక్షల తుది ‘కీ’ విడుద‌ల‌.. అలాగే ఫ‌లితాలు కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలో 9,210 గురుకుల విద్యాసంస్ధల ఉద్యోగాల‌కు ఆగస్టు 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించిన విష‌యం తెల్సిందే.
TREIRB Gurukulam Exam Final Key and Result 2023 News Telugu
TREIRB Gurukulam Exam Final Key 2023

ఈ ప‌రీక్ష‌లు 18 రోజులపాటు మూడు షిఫ్టుల్లో పరీక్షలు జరిగాయి. ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన‌ తుది ‘కీ’లను గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) విడుద‌ల చేసింది. ఆగస్టు చివరి వారంలో ప్రాథమిక కీలను అందుబాటులోకి తీసుకొచ్చిన టీఆర్‌ఈఐఆర్‌బీ.. వాటిపై అభ్యంతరాలను స్వీకరించింది. 

ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో వచ్చిన అభ్యంతరాలను పూర్తిగా పరిశీలించిన నిపుణుల కమిటీ వాటికి సంబంధించి టీఆర్‌ఈఐఆర్‌బీకి సిఫార్సులు చేసింది. వీటిని పరిశీలించిన అధికారులు వాటి ఆధారంగా తుది కీలను ఖరారు చేశారు. వీటిని టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టారు. 

టీఎస్ గురుకుల ఉద్యోగ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన‌ తుది 'కీ' కోసం క్లిక్ చేయండి

రోస్టర్‌ పాయింట్ల మార్పులు..
మొత్తంగా 51 కేటగిరీల్లో జరిగిన పరీక్షలకు సంబంధించిన ఫైనల్‌ కీలు తాజాగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ప్రకటించిన తుది కీలలో ఇకపై ఎలాంటి మార్పులు ఉండవని గురుకుల బోర్డు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రోస్టర్‌ చార్ట్‌ కీలకంగా పనిచేస్తుంది. ఈ చార్ట్‌లో నిర్దేశించిన రిజర్వేషన్ల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. తాజాగా రోస్టర్‌ పాయింట్లలో కొన్ని రకాల మార్పులు చేస్తూ సవరించిన రోస్టర్‌ జాబితాను టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

ఇందులో ప్రధానంగా 13, 37 (ఎక్స్‌ సర్వీస్‌మెన్‌) రోస్టర్‌ పాయింట్లలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. సొసైటీ వారీగా నిర్దేశించిన పోస్టు కేటగిరీల్లో ఈ పాయింట్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదివరకు ప్రకటించిన పాయింట్లు... తాజాగా సవరించిన పాయింట్లతో కూడిన జాబితాను టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

ఈ ఫ‌లితాల‌ను కూడా..
ఈ 9,210 పోస్టులకు గాను 2.63 లక్షల మందికి పైగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు.ఒక్క పోస్టుకు సగటున 29 మంది అభ్యర్ధులు పోటి పడుతున్నారు. ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఫ‌లితాల‌ను కూడా ఈ వారంలో ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఈ మేర‌కు టీఆర్‌ఈఐఆర్‌బీ అధికారులు క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

Published date : 06 Sep 2023 01:47PM

Photo Stories